మాయని మమత: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహ → మహా, పెళ్లి → పెళ్ళి (3), → (2), , → , (6) using AWB
పంక్తి 3:
name = మాయని మమత |
image = Mayani Mamatha.jpg |
director = [[ కమలాకర కామేశ్వరరావు ]]|
 
year = 1970|
పంక్తి 35:
* కథ: శివలింగం
* సంభాషణలు : [[మద్దిపట్ల సూరి]]
* పాటలు : [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]], [[సింగిరెడ్డి నారాయణరెడ్డి| సి.నారాయణరెడ్డి]], [[కొసరాజు రాఘవయ్య చౌదరి|కొసరాజు]]
* సంగీతం : అశ్వత్థామ
* ఛాయాగ్రహణం : ఎల్లప్ప
పంక్తి 45:
 
== సంక్షిప్త చిత్రకథ==
మధు ధనవంతుడు. సాహితీ ప్రియుడు. మృదువైన కవిత చెప్పగల మధురకవి. పదునైన రచనలతో పాఠకులను ఉత్తేజపరచే పత్రికా రచయిత. అతడి రచనా వ్యాసంగానికి 'వజ్రాయుధం' పత్రిక ఆటపట్టు. ఆ పత్రిక సంపాదకుడు జానకిరామయ్య అంటే అతడికి గౌరవాభిమానాలు. ఆ పత్రిక రజతోత్సవ సభలో అతడు జానకిరామయ్యచేత సన్మానించబడతాడు. అప్పుడే అతడికి జానకిరామయ్య కుమార్తె జ్యోతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది.
 
స్వార్థపరుల అత్యాచారాలను నిశితంగా విమర్శించే మధు రచనలు వజ్రాయుధం పత్రిక మనుగడకే ముప్పుతెస్తాయి. ఆర్థికమైన చిక్కులలో ఉన్న ఆ పత్రికను స్వార్థపరుడు, నయవంచకుడు అయిన జగన్నాథం అప్పు క్రింద స్వాధీనం చేసుకోవడానికి సిద్ధపడతాడు. అభిమానధనుడైన జానకిరామయ్య పత్రికకోసం దానాలు, విరాళాలు స్వీకరించడని తెలుసుకున్న మధు ఎలాగో ఆర్థికంగా ఆదుకొని పత్రికను నిలబెడతాడు. అయినా జానకిరామయ్య మరణించడంతో ఆయన పేరుమీదనే పత్రికను కొనసాగిస్తూ ఉంటాడు.
 
జానకిరామయ్య మృతితో అతని కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. మధు వారికి మరింత సహాయపడటానికి ప్రయత్నిస్తాడు. కాని జ్యోతి అన్న రవి అందుకు అయిష్టత వ్యక్తం చేసి ఉద్యోగరీత్యా బొంబాయి వెళ్లినప్పుడు జ్యోతి బాధ్యతను స్వీకరిస్తాడు. జ్యోతిని పెళ్లిపెళ్ళి చేసుకోవాలనే తన ఆకాంక్షను మధు తెలియజేస్తాడు. కాని హఠాత్తుగా రవి మరణించాడన్న పుకారు పుట్టడంతో జ్యోతి మరింత క్రుంగి పోతుంది. వివాహం వాయిదా పడుతుంది.
 
సేవాసదనం ధర్మకర్త జగన్నాథం సదనం నిధులను చందాలను దుర్వినియోగం చేయడాన్ని బయట పెడతాడు మధు. దానితో మధు అంటే జగన్నాథానికి ద్వేషం ఏర్పడి పత్రికను నాశనం చేయడానికి, మధును అంతమొందించడానికి జగన్నాథం శతవిధాల ప్రయత్నిస్తాడు. కాని ఫలితం లేకపోతుంది. ఆ పరిస్థితిలో మధు సాంస్కృతిక ప్రతినిధివర్గం నాయకుడిగా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. మధు విదేశాలనుండి తిరిగి వచ్చేసరికి జ్యోతి అపవాదులకు గురై ఇల్లు వదిలి వెళ్లిపోయి ఉంటుంది. మధు తల్లి కూడా జ్యోతిని శంకిస్తుంది. మధు ఎంతో విచారిస్తాడు. జ్యోతికోసం అన్నిచోట్లా వెదుకుతాడు.
 
మధు తల్లి మనోవ్యాధితో మంచం పడుతుంది. ఆమె తుది కోర్కె చెల్లించడానికి జగన్నాథం కుమార్తె నీలను పెళ్లిపెళ్ళి చేసుకోవడానికి తల ఒగ్గుతాడు మధు. నీల రవిని పేమించిన సంగతి మధుకు తెలియదు. మధు నీలను పెళ్లిపెళ్ళి చేసుకోవడానికి అంగీకరించినా జ్యోతిని మరచిపోలేక పోతాడు. రవి బ్రతికి ఉన్నాడని, నీల రవి ఒకరినొకరు ప్రేమించారని మధుకు తెలుస్తుంది. మారువేషంలో వచ్చిన రవికి నీలకు వివాహం చేసి జగన్నాథం మోసాలను, దురాగతాలను బట్టబయలు చేయడానికి ప్రయత్నిస్తాడు మధు. చివరకు ఆ స్వార్థపరుని కబంధ హస్తాలనుండి బయటపడి జ్యోతిని వివాహం చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది<ref>{{cite journal|title=చిత్ర ప్రభ - మాయని మమత|journal=ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక|date=4 March 1970|page=48|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=853139|accessdate=19 October 2016}}</ref>.
 
==పాటలు==
# అనగనగా ఒక మహరాజుమహారాజు ఆతని పేరు ఉదయనుడు - పి.సుశీల, ఘంటసాల - రచన: డా.సినారె
# ఈ బ్రతుకే ఒక ఆట తీయని వలపుల బాట - బి. వసంత, ఎస్.పి. బాలు - రచన: శ్రీ శ్రీ
# ఎవరో వచ్చే వేళాయె ఎదురై కాస్త చూస్తారా వాకిలి - పి.సుశీల, బి.వసంత బృందం - రచన: దేవులపల్లి
# ఏమైతివి ప్రియసఖీ ఎందుంటివి ఇందుముఖీ నీవులేని ( సాఖీ ) - ఘంటసాల - రచన: డా. సినారె
# ఓరోరి సిన్నవాడా మాయదారి బుల్లోడా - ఎల్.ఆర్. ఈశ్వరి, పిఠాపురం - రచన: శ్రీశ్రీ
# కనులు మాటలాడునని మనసు పాట పాడునని - పి.సుశీల, ఘంటసాల - రచన: డా.సినారె
# కళ్ళు తెరచి చూచుకోండయా ఓరయ్యల్లారా కల్ల నిజం తెలుసు - ఘంటసాల - రచన: కొసరాజు
# మగవారలపై మగువలు జగడాలకు దారితీయు (పద్యం) - ఎస్.పి.బాలు - రచన: శ్రీశ్రీ
# రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం రాలిన సుమాల - ఘంటసాల - రచన: దేవులపల్లి
# స్వప్న వాసవదత్త ( నాటకం) - ఘంటసాల, పి.సుశీల, రమణ - రచన: డా. సినారె
# సాధువుల బ్రోచి దుష్టుల సంహరించి ధర్మమును నిలుప (పద్యం) - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
 
 
 
==మూలాలు==
Line 75 ⟶ 72:
 
[[వర్గం:శోభన్ బాబు నటించిన సినిమాలు]]
 
 
 
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/మాయని_మమత" నుండి వెలికితీశారు