వై. ఎస్. విజయమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , గా → గా , ప్రధమ → ప్రథమ, → using AWB
పంక్తి 17:
==రాజకీయ జీవితం==
[[ఆంధ్రప్రదేశ్]] ముఖ్యమంత్రి [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] మరణానంతరం జరిగిన పిభ్రవరి 2010, ఉపఎన్నికలలో ఏకగ్రీవంగా [[పులివెందుల శాసనసభ నియోజకవర్గం|పులివెందుల శాసనసభ]] స్థానానికి [[కాంగ్రేస్ పార్టీ]] తరపున ఏన్నికైయ్యారు.
2011, మార్చిలో [[పులివెందుల శాసనసభ నియోజకవర్గం|పులివెందుల శాసనసభ]] స్థానానికి [[కాంగ్రేస్ పార్టీ]] కి రాజీనామా చేసి [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి]] పెట్టిన కొత్త పార్టీ [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ]]లో చేరారు, తరువాత వచ్చిన ఎన్నికలలో [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] సోదరుడు [[వై.ఎస్.వివేకానందరెడ్డి]] పై 81,373 తేడాతో గెలుపొందారు. ఈమె రాజకీయ జీవితంలో ప్రథమ సారిగా ఎన్నికైన తరువాత నుంచి ప్రధమప్రథమ సారి రాజీనామా చేసే వరకూ, [[శాసన సభ]]కు హాజరు అవ్వకపోవడం చరిత్రలో ఓ మైలు రాయి. 2011 మార్చిలో రెండవ సారి ఎన్నికైన తరువాత మొదటిసారిగా అప్పటి ముఖ్యమంత్రి [[కిరణ్ కుమార్ రెడ్డి]] ప్రభుత్వంపై జరిగిన [[అవిశ్వాస తీర్మానం]]పై తమ ఓటు హక్కుని వినియోగించుకునే నిమిత్తం మొదటి సారిగా శాసనసభకు హాజరైయ్యారు.
 
==వ్యక్తిగత జీవితం==
[[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] భార్య [[వై.ఎస్.విజయమ్మ]] గా లోకానికి సుపరిచితం, వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి]] మరియు కుమార్తె [[షర్మిల]].
 
==వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ==
పంక్తి 26:
==వార్తలలో విజయమ్మ==
===2013 సమైక్యాంధ్ర ఉద్యమము===
2013 సమైక్యాంధ్ర ఉద్యమములో భాగంగా ఈవిడ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాకుండా విభజనను నిరసిస్తూ [[గుంటూరు]] లో అమరణ నిరాహారదీక్షను చేశారు. దీనిని పోలీసులు భగ్నం చేసి ఈవిడను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత రాష్ట్ర విభజన ప్రక్రియను వెంటనే ఆపాలని కేంద్ర హోంమంత్రి [[సుశీల్ కుమార్ షిండే]]కు లేఖ రాశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆ లేఖలో ఆమె కోరారు. వాస్తవాలను మరుగునపరుస్తున్నారని పేర్కొన్నారు. సీపీఎం మినహా మిగిలిన పార్టీలు తెలంగాణకు సానుకూలమని ఎలా చెప్తారని ఆమె ప్రశ్నించారు. విభజనకు ఐదుపార్టీలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ, సీపీఐ తెలంగాణకు అనుకూలం అని వివరించారు. వైఎస్సార్‌సీపీ, సీపీఎం, ఎంఐఎం విభజనను వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేశారు.
 
ఉన్నత పదవిలో ఉన్న సదరు మంత్రి వాస్తవాలను ఎందుకు మరుగునపరుస్తున్నారని షిండేను ప్రశ్నించారు. 2012 డిసెంబర్‌ 28నాటి అఖిలపక్ష సమావేశం నుంచి తాము విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రధానికి రాసిన లేఖను కూడా ఆ లేఖకు జతపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక ప్రాంతానికి న్యాయం చేయమంటే మరో ప్రాంతానికి అన్యాయం చేయమని కాదుకదా? అని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం ప్రాథమిక న్యాయసూత్రాలను కాంగ్రెస్‌ విస్మరించిందన్నారు. విభజన నిర్ణయంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయని తెలియజేశారు. అలాంటప్పుడు ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్‌ ఎలా చెప్పగలదు? అని ప్రశ్నించారు.
"https://te.wikipedia.org/wiki/వై._ఎస్._విజయమ్మ" నుండి వెలికితీశారు