"కుమారజీవుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు కు → లకు , ని → ని , బౌద్దులు → బౌద్ధులు, → (2), ) → ) using AWB
(-అనాథ మూస)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు కు → లకు , ని → ని , బౌద్దులు → బౌద్ధులు, → (2), ) → ) using AWB)
==మహాయాన బౌద్దంలోనికి కుమారజీవుడు==
[[Image:Tarimbecken 3. Jahrhundert.png|thumb|300px|క్రీ.శ. 4 వ శతాబ్దంలో తారిమ్ బేసిన్ (చైనా) లో ఏర్పడిన కూచా, కాష్గర్, తుర్పాన్ తదితర మద్య ఆసియా రాజ్యాలు]]
కూచా రాజ్యానికి ఈశాన్య సరిహద్దులలో వున్న తుర్పాన్ రాజ్యంలో 10 వేలకు పైగా బౌద్ధ సన్యాసులు వుండేవారు. కుమారజీవుడు దాదాపుగా ఇక్కడ ఉంటున్న సమయంలోనే కుమారజీవుని ధర్మపధం మహాయానం వైపు నడిచింది. ఒకప్పుడు యార్కండ్ (Yarkand) రాకుమారుడు తరువాత కాలంలో మహాయాన బౌద్ధసన్యాసిగా మారిన సుత్యసోము నిసుత్యసోముని ప్రభావం కుమారజీవునిపై గాఢంగా పడింది. అతని ప్రభావం వల్ల కుమారజీవుడు శూన్యవాదం వైపు ఆకర్షించబడ్డాడు. సుత్యసోముని ఉపదేశంతో కుమారజీవుడు మహాయాన బౌద్ధసూత్రాలని ఆకళింపు చేసుకొన్నాడు.
 
హీనయానం (స్థవిర వాదం) నుంచి మహాయాన బౌద్ధానికి మారిన తరువాత కుమారజీవుడు తన మనోవైఖిరిని వివరిస్తూ “బంగారాన్ని (మహాయానం) ఎరుగని వ్యక్తి, ఇత్తడిని (స్థవిరవాదం) చూసి అదే గొప్పదని భ్రమపడినట్టుగా, తానింతకాలం వున్నానని, చివరకు మహాయాన ప్రభావంతో తాను విముక్తుడు అయినట్లు” వెల్లడించాడు.
# దశాభూమిక విభాస - 17 వాల్యూమ్స్
 
వీటిలో 'వజ్రచ్చేదిక ప్రజ్ఞాపారమిత సూత్ర’ (The Diamond Sutra), సుఖావతి వ్యూహ (అమితభ సూత్ర), సద్దర్మ పుండరీక సూత్ర (The Lotus Sutra), ‘విమలకీర్తి నిర్దేశ సూత్ర’, ‘అష్ట సహస్రిక ప్రజ్ఞాపారమిత సూత్ర', ‘మహా ప్రజ్ఞాపారమిత ఉపదేశ’ అనువాదాలు ముఖ్యమైనవి. వీటన్నింటిలోకూడా లోటస్ సూత్రాలు కుసూత్రాలకు చేసిన అనువాదం (సంస్కృతంలో 'సద్దర్మ పుండరీక సూత్ర’: చైనా భాషలో 'Miao-fu-lien-hauo') బౌద్ద ధర్మాన్ని విశిదీకరించడంలోను, భాషా అనువాద స్థాయిలోను కుమారజీవుని ప్రతిభను చాటి, ప్రపంచ అత్యుత్తమ అనువాదకారులలో ఒకడిగా చిరస్మరణీయం చేసింది.
 
కుమారజీవుడు స్వయంగా రచించిన గ్రంథాలు అరుదనే చెప్పాలి. అశ్వఘోషుడు, నాగార్జనుడు, ఆర్యదేవుడు, వసుబంధు ల జీవన చరిత్రలను చినా భాషలో రాసాడు.
కుమారజీవుడు ఆనాటి ఉత్తర చైనా చక్రవర్తి యావో జింగ్ (Yao Xing) (క్రీ.శ. 366 - 416) తో చక్కని స్నేహపూరితమైన సంబంధాలు కలిగి ఉన్నాడు. కుమారజీవుని అసాధారణ ప్రజ్ఞా పాటవాలు, బౌద్ద ధర్మ వివరణలో అతనికున్న సాధికారత, చక్రవర్తిని అమితంగా ఆకర్షించాయి. బౌద్ద గ్రంథాల చైనా అనువాద ప్రక్రియలకు సమర్ధుడిగా అతనినే భావించిన చక్రవర్తి కుమారజీవుని శత్రు చెర నుంచి విడిపించి తన వద్దకు రప్పించుకొన్నాడు. జాతీయ గురువుగా గౌరవించడమే కాకుండా, రాజ గురువుగా ప్రకటించి తన ఆస్థానంలో అతని స్థాయిని అతి స్వల్ప వ్యవధిలోనే ఉన్నతీకరించాడు. అనువాద కేంద్రానికి నాయకుడిగా చేసి బృహత్తర అనువాద కార్యక్రమ బాధ్యతను కుమారజీవుని భుజ స్కంధాలపై నిలిపాడు.
 
అదేవిధంగా చక్రవర్తి చూపిన ఆదరణ, అందించిన తోడ్పాటు, అనువాదం పట్ల చక్రవర్తికి గల ప్రత్యేకాసక్తిని గమనించిన కుమారజీవుడు చక్రవర్తి అభిమతానికి అనుగుణంగా అనువాద కార్యక్రమాన్ని రాజధానికి చేరుకొన్న ఆరు రోజుల వ్యవధిలోనే ప్రారంభించాడు. తను మరణించేవరకూ 12 సంవత్సరాలపాటు నిరాఘాటంగా అసమాన కృషితో అనువాద యజ్ఞాన్ని కొనసాగించి చక్రవర్తి అభిమానానికి పాత్రుడయ్యాడు.కుమారజీవుని ప్రభావంతో చక్రవర్తి యావో జింగ్ తన రాజ్యంలో అనేక బౌద్దాలయాలు, నిర్మించాడు. కుమారజీవుని ప్రభావం వలన ఈ చక్రవర్తి కాలంలోనే బౌద్దమతానికి తొలిసారిగా రాజ మద్దతు లభించింది. ఫలితంగా కుమారజీవుని ప్రభావంతో ఇతని రాజ్యంలో 90 శాతం ప్రజలు బౌద్దులుగాబౌద్ధులుగా మారారని వర్ణించబడింది.
 
కుమారజీవుని ధార్మిక చింతన, ప్రతిభ, ఆధ్యాత్మిక సంపన్నత చక్రవర్తిని ఎంతగా కదిలించాయంటే, సన్యాసి అయిన కుమారరజీవునికి సంతతి లేని కారణంగా, అతని అపూర్వ ప్రతిభా పాటవాలు అతనితోనే అంతరించిపోతాయనే దిగులు సైతం చక్రవర్తికి కలిగింది. ఫలితంగా ఆశ్రమజీవితం నుండి కుమారజీవుని తప్పించి ఒక అందమైన రాజ భవంతిలోకి తరలించాడు. ఆకర్షణీయమైన అంతఃపుర పడుచులను ఎన్నిక చేసి మరీ అతనికి పరిచారకులుగా నియమించి వారి ద్వారా ఉత్తమ సంతానం కలిగేటట్లుగా అనుకూల పరిస్థితులు కల్పించాడు. దీనితో బొద్ద సన్యాసిగా కుమారజీవునికి సంకట పరిస్థితి ఎదురైంది. ఒకవైపు చక్రవర్తి ఆజ్ఞ ధిక్కరిస్తే అనువాద కేంద్రం మూతబడవచ్చు. మరోవైపు పాటిస్తే సన్యాసిగా తన నియమ నిష్ఠకు భంగం వాటిలుతుంది. జాగ్రత్తగా ఆలోచించి చక్రవర్తి ఆజ్ఞకు తలవంచవలసి వచ్చింది. కొన్ని ఆధారాల ప్రకారం ప్రతికూల పరిస్థితుల ప్రభావానికి గురైన కుమారజీవుడు ఆశ్రమ జీవితం నుండి సాంసారిక జీవితానికి బలవంతంగా మళ్ళించబడ్దాడని, అతనికి సంతతి కలిగిందని తెలుస్తుంది. ఒకానొక సమయంలో అసలు సంగతులు తెలియని అతని గురువు 'విమలరక్ష' (క్రీ.శ. 337 - 413) చైనాకు వచ్చినపుడు శిష్యుడైన కుమారజీవుని జీవనరీతిని చూసి ఆశ్చర్యపోయినట్లు తెలుస్తుంది. ఖిన్నుడైన కుమారజీవుడు గురువుతో తాను కర్మకు బందీ అయినవాడుగా, క్లేశానికి లోనైన వాడుగా వివరించి, గౌరవార్హతకు నోచుకున్నవానిగా తనకు తాను పరిగణించుకోవడం లేదని విన్నవించుకొన్నాడు. పశ్చతాపానికి లోనైన కుమారజీవుడు రాజ భవంతిలో భోగభాగ్యాల మద్య తులతూగవలసి వచ్చినప్పటికీ తన జీవన రీతిని ఒక బౌద్దాశ్రమ సన్యాసి జీవించే రీతిలోనే గడపడానికి చివరివరకు ప్రయత్నించాడు. బురద నుండి వెలువడిన పద్మం వలె తనను పోల్చుకొన్నాడు. తన శిష్యులతో, తన తోటి బౌద్దసన్యాసులతో తన జీవన రీతిని ఉద్దేశిస్తూ పద్మాన్ని మాత్రమే చూసి దానికి అంటిన బురదని పట్టించుకోవలదని కోరాడు. తన బోధనలలోని అంతిమ సత్యాన్ని మాత్రమే అంటిపెట్టుకొనమని, తన జీవన విధానాన్ని ఆదర్శంగా గ్రహించవద్దని తరచు కోరేవాడు. ఏది ఏమైనప్పటికి సమకాలీన బౌద్ద సమాజం కూడా అతని సంకట పరిస్థితిని అర్ధం చేసుకొన్నట్లే కనిపించింది. అనువాద కృషి అవాంతరాలు లేకుండానే చివరవరకూ కొనసాగింది.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2099065" నుండి వెలికితీశారు