సంధ్యావందనం శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''సంధ్యావందనం శ్రీనివాసరావు''' దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి విద్వత్ గాయకుడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[అనంతపురం]] జిల్లా [[పెనుకొండ]]లో [[1918]], [[ఆగష్టు 21]]న నారాయణరావు, గంగాబాయి దంపతులకు జన్మించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=19834| మా వ్యాసకర్తలు - [[భారతి (మాస పత్రిక)]] - సంపుటము 40 సంచిక 2- ఫిబ్రవరి 1963 - పేజీ100] </ref>. ఇతని తల్లిదండ్రులు దాసకూట పరంపరకు చెందినవారు. ఇతని పూర్వీకులు [[మైసూరు]] సమీపంలోని [[శ్రీరంగపట్టణం]]లో నివసించేవారు. ఇతడు [[దత్తమండల కళాశాల]]లో బి.ఎ.చదివాడు. తరువాత బి.ఎల్. కూడా చదివాడు. [[వకీలు]]గా కొంతకాలం ప్రాక్టీసు చేశాడు. అనంతపురం కలెక్టర్ ఆఫీసులో కొంతకాలం గుమాస్తాగా పనిచేశాడు. ఇతడి భార్యపేరు[[భార్య]]<nowiki/>పేరు సరస్వతి. ఇతనికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె కలిగారు.
 
==సంగీత రంగంలో కృషి==
ఇతడు సంగీతంలో ప్రాథమిక పాఠాలు పల్లవి పక్క హనుమంతాచార్, తిరుపతి రంగాచార్యులు, చిలమత్తూరు రామయ్యల వద్ద అభ్యసించాడు. తరువాత ఇతడు టైగర్ వరదాచారి, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, [[ద్వారం వేంకటస్వామినాయుడు]], [[మైసూరు]] వాసుదేవాచార్‌ల వద్ద సంగీతంలో మెళకువలు నేర్చుకున్నాడు. శ్రద్ధతో, ఉత్సాహంతో, పట్టుదలతో అనేక ప్రాచీన సంప్రదాయ [[కీర్తనలు]] సేకరించి, స్త్రీలపాటలు, పల్లెపదాలు అనేకం ప్రోదిచేసి వాటి ద్వారా ప్రాచీన రాగాల స్వరూపాలను కల్పన చేశాడు.ఇతడు [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[కన్నడ భాష|కన్నడ]], [[మరాఠీ భాష|మరాఠీ]], [[సంస్కృతము]], [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇతడు కళ్యాణి, యదుకుల కాంబోడి, భైరవి, కేదారగౌళ, సహన, ద్విజవంతి మొదలైన రాగాలలో విశేషమైన కృషి చేశాడు. ఇతడు తన 12వ యేటి నుండే కచేరీలు ఇవ్వడం ప్రారంభించి సుమారు 6 దశాబ్దాల కాలం దేశం అంతటా సంగీత ప్రదర్శనలు ఇచ్చాడు. ఇతడు ఆకాశవాణి విజయవాడ,మద్రాసు కేంద్రాలలో శాస్త్రీయ సంగీత కార్యక్రమాల నిర్వాహకుడిగా మరియు వివిధ హోదాలలో పనిచేశాడు. ఇతడు చక్కటి [[కర్ణాటక సంగీతము|కర్ణాటక]] బాణీలో గానం చేసి భక్తిరంజని కార్యక్రమాలను నిర్వహించాడు. ఆకాశవాణిలో అనేక వాద్యగోష్టులను నిర్వహించాడు. [[మద్రాసు]]లోని సంగీత ఉపాధ్యాయుల కళాశాలకు ప్రిన్సిపాల్‌గా కుడా పనిచేశాడు.
==పదవులు, పురస్కారాలు==
ఇతడు కేంద్ర సంగీత అకాడెమీ నిపుణుల కమిటీలోను, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిటీలోను, సంగీత నాటక అకాడెమీలోను, ఆకాశవాణి ఆడిషన్స్ కమిటీలోను సభ్యుడిగా నియమించబడ్డాడు. ఇతడు [[తిరుపతి]] తిరుమల దేవస్థానముల వారి అన్నమయ్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు లకు ప్రత్యేక అధికారిగా కూడా సేవలను అందించాడు. ఇతడికి అనేక [[పురస్కారాలు]], బిరుదులు[[బిరుదు]]<nowiki/>లు లభించాయి. సంగీత అకాడెమీ పురస్కారం, డి.లిట్., [[తిరుమల]] తిరుపతి దేవస్థాన ఆస్థాన పండిత పదవి మొదలైనవి ముఖ్యమైనవి. సంగీత కళాచార్య, సంగీత [[కళారత్న]], స్వరవిలాస అనే బిరుదులు ఇతడికి లభించాయి<ref>[http://www.carnaticindia.com/profiles/Sandhyavandanam_Srinivasa_Rao.html| కర్ణాటిక్ ఇండియాలో సంధ్యావందనం శ్రీనివాసరావు జీవిత విశేషాలు]</ref>.
 
==శిష్యులు==