ఒగ్గు కథ: కూర్పుల మధ్య తేడాలు

103.196.6.7 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2030763 ను రద్దు చేసారు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, సాంప్రదాయా → సంప్రదాయా, అధారం → ఆధారం, వైవిద్య using AWB
పంక్తి 4:
ప్రేక్షకుడిని విరామం లేకుండా కట్టి పడేసే కళ '''ఒగ్గు కథ'''. [[బోనం]] ఎత్తుకొని, [[వేప]] మండలు పట్టుకుని ఊగుతూ, తూలుతూ ఎల్లమ్మ [[కథ]] చెప్తుంటే జనం ఊగిపోతారు. బోనం నెత్తిమీద పెట్టుకొని, ఎంతో సేపు దాన్ని కదలనివ్వ కుండా కింద వేసిన నాణాల్ని నొసటితో అందుకునే దృశ్యం అద్భుతం. జానపద కళారూపాళ్లో 'ఒగ్గు కథ' ప్రముఖమైంది. ఇది కేవలం కథ మాత్రమే కాదు. గానం, నృత్యం, నాటక మిశ్రమం - గొల్ల, కురుమలు తమ కుల పురుషుడు బీరప్ప కథ చెప్పేందుకు ఎంచుకున్న రూపమే ఒగ్గు కథ. ఈ కథా ప్రక్రియకు, చదువు అవసరం లేదు. డోలు, తాళం, కంజీర వాయిద్యాలతో, తెలంగాణ భాషలో గంటల కొద్ది ఎన్నయినా కథలు చెబుతారు. పాటలు జోడించి కథను పండిస్తారు. పురాణాల మీద పట్టుతో ఆశువుగా కథ అలా చెప్పేస్తారు. నెత్తిన బోనం ఉంచుకుని కథ చెబుతూనే నేలను తలతో ముద్దాడతారు.
 
''కురబ '' జాతివారు శివున్ని, బసవన్నని పూజిస్తారు. కురుమలకు ప్రత్యేక పూజారులు, కుల వాయిద్యకారులు ఉన్నారు. తెలంగాణలో ఒగ్గువాళ్లు, బీరప్పలు, రాయలసీమలొరాయలసీమలో [[గొరవయ్యలు]] అని వీరిని పిలుస్తారు. వైవిద్యంవైవిధ్యం కలిగిన ఒగ్గుకథ గాన, కళారూపం ఒక్క తెలంగాణాలోనే కనిపించడం విశేషం. కురుమ కుల పురోహిత వర్గానికి చెందినవారు ఒగ్గుకథని చెప్పే వృత్తిని స్వీకరించారు. బీరన్నలకు ప్రత్యేకమైన వాయిద్యం [[ఒగ్గు]] ([[ఢమరుకం]]) ఉపయోగించి చెప్పే వృత్తి [[పురాణం]] గురించి తెల్సుకోవడం అంటే [[కురుమ జాతి]] చరిత్ర, సంస్కృతుల్ గురించి తెలుసుకోవట మన్నమాట. [[ఒగ్గు దీక్ష]] ఒకటి ఈ కురుమల్లో కనిపిస్తోంది. ఒగ్గు కథలో తర్ఫీదు పొందాలంటే కులపెద్దల అనుమతితో శైవక్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రానికి వెళ్తారు. ఆలయ లోగిళ్లలో పట్టాలువేసి విభూతి ధరించి, నామాలను జపించుకొంటూ మల్లన్న దేవుడినే ధ్యానిస్తారు. ఈ పూజ అయిపోగానే ఒగ్గువంతులు [[మంత్రం]] బోధించి ఆశీర్వదిస్తారు. ఎల్లమ్మ ప్రసాదించిన ఏడు గవ్వల హారం మెడలో వేసుకుని మల్లన్నకు ఒదుగుతూ ఒగ్గులవుతారు. ఈ ఒగ్గు దీక్ష తర్వాతే వారు [[బీరన్న, మల్లన్న కథలు]] చెప్పేందుకి అర్హత సంపాదించు కొన్నట్లు అవుతుంది. కురుమలు బీరప్ప దీక్ష తీసుకున్న వాళ్లు బీరప్పలవుతారు. ఈ సంప్రదాయం పూర్వం నుంచే వస్తోంది. కురుమల్లో పౌరోహిత్యం చేసేది ఈ ఒగ్గులే. కొంత మంది ఒగ్గులు దేవుని పెట్టెలో మల్లన్న దేవుని విగ్రహాలు పెట్టు కొని కావడి కట్టుకొని ఊరూరా తిరుగుతారు. వీరు నెత్తి విరబోసుకోని, నుదిటిని పసుపు రాసుకొని, కళ్లకి కాటుక రాసుకొని ఎర్రని పొట్టి చేతుల చొక్కా, మువ్వల లాగు ధరించి కాళ్లకి గజ్జెలు కట్టుకొని నృత్యం చేస్తూ శైవగీతాలు పాడతారు.
==పుట్టుక==
ఒగ్గు కళారూపం శైవమత వాప్తిలో ప్రచార మాద్యమంగా ఉద్భవించి ఉంటుంది. ఎందుకంటే పాల్కురికి సోమనాధుడు తెలంగాణ ప్రాంతంలో పుట్టి, శైవమత వ్యాప్తికి విశేషమైన కృషి చేసారు. అటువంటి గొప్పవ్యక్తి ప్రభావం ఈ ప్రాంతంలో కళలపై ఉందనడానికి నిదర్శనం ఒగ్గు కథ. ఈ కథల ఇతివృత్తాల్లో శివుడు కథానాయకుడిగా ఉంటాడు. లేదా శివుని అంశతో జన్మించిన వారు నాయకులుగా ఉంటారు. ఉదాహరణకు శివుని తొలి చెమట నుండి బీరప్ప మలి చెమట నుంచి మల్లన్న పుట్టారని, ఎల్లమ్మ శివుని కూతురని ఆయా కథల్లో వివరిస్తుంటారు.
 
ఒగ్గుకథల్ని తెలంగాణ ప్రాంతంలోని గొల్ల, కుర్మలు తమ కుల పురాణంగా భావిస్తారు. కుర్మలు ఈ కథల్ని ఎక్కువ ప్రచారం చేసారు. తరువాతతరువాతి కాలంలో ఇతర కులాల వాళ్ళు కూడా ఈ కళారూపాన్ని నేర్చుకొని ప్రచారం చేసారు. ఇటువంటి వారి సంఖ్య చాల తక్కువ. బీరప్ప, మల్లయ్య కథలు మెదటి నుంచి ఉన్నాయి.ఆ తరువాత ఇతర కథలు పుట్టుకొచ్చాయి.
==కళారూపం==
ఒగ్గు కళారూపం చూస్తుంటే ఒక నాటకం చూసిన అనుభూతి, ఒక నాట్యకళని వీక్షించినంత ఆనందం, ఒక ప్రవచనం విన్నంత సంతృప్తి, ఒక సంగీత కచేరిలో దొరికేంత రసాస్వాదన లభిస్తుంది.అదోక సముద్రం. శ్రోతలు తమకు కావల్సిన ఆనందాన్ని కళ్ళ దోసిళ్ళతో తీసుకపోతారో లేక మనస్సు కుండల్లో పట్టుకెల్తారో వారిష్టం. ఇక ఒగ్గుకథా ప్రదర్శనా తీరుతెన్నుల్ని గమనిస్తే...
పంక్తి 16:
==కథను బట్టి కళారూపం పేరు==
ఈ కథా గాన కళారూపాల పేర్లు ఆ కథలను చెప్పే వారి కులాలను బట్టీ, కథ చెప్పే సమయంలో ఉపయోగించే సహకార వాద్యాలను బట్టీ, కథా వస్తువును బట్టీ వచ్చాయి.
సహకార వాయిద్యం అధారంగాఆధారంగా పేరును సంతరించుకున్న కళా రూపాలు [[పంబ కథ]], [[జముకుల కథ]], [[బుర్ర కథ]], ఒగ్గు కథ, ఇక తెగలను బట్టి పేర్లు వచ్చిన కళారూపాలు [[జంగం కథ]], [[పిచ్చు కుంటుల కథ]], [[గొల్ల సుద్దులు]] మొదలైనవి. కథా వస్తువును బట్టి వ్వహాగృతమౌతున్న కళారూపాలు [[హరి కథ]], [[పాండవుల కథ]], [[రేణుకా కథ]] మొదలైనవి.
 
భిన విభిన్న మైన కథా గాన కళా రూపాలలో ఒగ్గు కథ ఒక్క తెలంగాణా ప్రాంతంలో తప్ప మరో ప్రాంతంలో లేదు. అందులోనూ వరంగల్, నల్ల గొండ హైదరాబాదు జిల్లాలలో బహుళ ప్రచారంలో వుంది. ఈ మూడు జిల్లాలలోనూ సుమారు ఏబై ఒగ్గు కథా బృందాలు కథలు చెపుతూ ఉన్నాయి.
పంక్తి 29:
ఒగ్గుకథలో తప్పకుండ ఉండేది ఒగ్గు. దీన్ని పలుసన్నివేషాల్లో తాళానికి అనుగుణంగా సంఘటనలకి అనుకూలంగా వాయిస్తూంటారు.ఒక్కోసారి ఈ వాయిద్యాన్ని ఆయా పాత్రలుగా ఊహింపజేస్తారు.ఉదాహరణకి చిన్నపిల్లాడిని లాలించే సందర్భం వచ్చినప్పుడు ఒగ్గుని ఆ చిన్నపిల్లాడిలా ఊహింపజేసి ప్రేక్షకులని ఆ సంఘటనలో లీనం చేస్తారు. కథానడకలో ఒగ్గు కొంచెం డోలుకన్న తక్కువ ప్రాధాన్యతని కలిగుంటుంది.జానెడు పొడవుతో మధ్యభాగం ఇత్తడి లేదా చెక్కతో ఉండి ఇరువైపులా మేక చర్మాన్నిబిగించి ఈ ఒగ్గుని తయారుచేసుకుంటారు.
===డోలు ===
అన్ని వాయిద్యాల్లోకెల్లా పెద్దది, ముఖ్యమైనది డోలు. డోలు మోతతోనే కథా ప్రారంభమవుతుంది. సుమారు ఒక మీటరు పొడవుండీ డ్రమ్ము ఆకారంలో ఇత్తడితో కాని చెక్కతో కాని నిర్మాణమై ఇరువైపులా మేక చర్మాన్ని అమర్చి తాళ్ళతో బిగిస్తారు.గంభీరమైన ధ్వని చేస్తూ ప్రతి సన్నివేషంలో తప్పక మోగే వాయిద్యం డోలు. గోల్ల కుర్మల పెండ్లిలోపెళ్ళిలో జరిగే మైలపోలు, ఎదురుకోలు, ఊరేగింపు సందర్భాల్లో డోలు తప్పకుండా ఉంటుంది.కథాగమనంలో కొన్ని సన్నివేషల్లో ఉద్రేకం కలిగించడానికి డోలుని మెళ్ళో వేసుకుని నృత్యం చేస్తారు, పళ్ళతో బిగించి పట్టుకుని తాండవం చేస్తారు, గ్రుండంగా ఆవేషంతో తిరుగుతారు. వీపుకు తగిలించుకుని విన్యాసంగా వాయిస్తారు.ఇలా చిత్రవిచిత్ర చేష్టలతో జనాలకి విసుగు రాకుండా, రాత్రుల్లు నిద్రపోకుండా ఆసక్తిగా కథని నడిపిస్తారు.
===తాళాలు ===
అరచేతికి రెండింతలు పెద్దగా ఉండి ప్రతీరాగానికి లయని అందింస్తూ శ్రావ్యంగా మోగే వాయిద్యమే ఒగ్గులో ఉపయోగించే తాళాలు.వీటికి తోడుగా చిన్నతాళాలని కూడా ఉపయోగిస్తారు.మెండు తాళం, దుయ్యర, మెండుదుయ్యర, ఆదితాళం, మెండు బైరవి, వలపోత బీగడ వంటి వివిధ రకాల తాళగతులను ఉపయోగిస్తారు.
===నపీర ===
''నపీర '' ఇత్తడి లోహంతో తయారవుతుంది. అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఒక చివర సన్నగా ఉండి మరోవైపు కొంచెం వెడల్పుగా ఉంటుంది . నోటితో గట్టిగా ఊదితే భీకరమైన ధ్వని వినిపిస్తుంది. ఇంకా కాళ్ళకు గజ్జెలు, బుజంపైభుజంపై రుమాలు, చేతిలో చిన్న కర్రని కథానడకకి ఉపయోగించుకుంటారు.
==కథా నడక ==
ఇతివృత్తం దగ్గర నుంచి కథనం వరకు ప్రత్యేకమైన శైలిలో నిర్మాణం పొందిన ప్రక్రియ ఒగ్గుకథ. జీవిత చరిత్రల్ని ఇతిహాసాలుగా మలిచే పద్ధతి ఒగ్గు కథని చూసి నేర్చుకోవచ్చు. గొల్ల కుర్మల కులదైవాలు దైవాంశ సంబూతులైనా మానవ మాత్రులుగా జీవించిన తీరు వారికి కుల వృత్తిపైన ఉండే అభిమానం కళ్లకు కట్టినట్టు చూపిస్తారు.ఈ కథలు విన్న ఏ మనిషైన ఈ కులాల్ని గౌరవభావంతో చూస్తారు.
పంక్తి 87:
 
==నేటి ఒగ్గు కథకులు==
ఈనాడు తెలంగాణాలో ఒగ్గుకథ చెప్పే బృందాలు వరంగల్లు, నల్లగొండ, హైదరాబాదు జిల్లాలో వున్న ఏభై బృందాలలో నాలుగు దళాలు మాత్రమే బహుశ ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రధాన కథకులు నేర రామస్వామి డెబ్బై సంవత్సరాలు, చీమల కొండూరు, భువనగిరి తాలూకా, నల్లగొండ జిల్లా. తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో వేములవాడ ప్రాంతములు అత్యదిక ఒగ్గు కథ కళా బృందములు ఉన్నాయి. అందులో ముఖ్యంగా తీగల రాజేశం - నూకలమర్రి (కీ. శే. శ్రీ మిద్దె రాములు గారి ప్రియ శిష్యుడు) , మారుపాక శంకర్ (కనగర్తి) , గాదర్ల బుగ్గయ్య - అచ్చనపల్లి, బర్మ బీరయ్య మరియు బర్మ తిరుపతి - నిజామాబాద్ ఇలా వందల బృందాలు ఉన్నాయి
 
[[మిద్దె రాములు]] గౌడ కులస్తుడై నప్పటికీ ఒగ్గుకథ పట్టుపట్టి మరీ నేర్చుకుని అందులో ప్రసిద్ధుడయ్యాడు.<ref>http://www.ourtelangana.com/node/1733</ref>
పంక్తి 140:
చెంచు భాగవతం,
చెక్కబొమ్మలాట,
జడకోలాటం (కులుకుభజన) ,
జిక్కికి,
డప్పులు,
తంబుర (కడ్డీ తంత్రి) ,
పగటి వేషాలు,
పల్లెసుద్దులు,
పంక్తి 171:
గంగిరెద్దులు వాళ్లు సంక్రాంతి వచ్చిందంటే గ్రామాల్లో ఎద్దులను ఇంటింటికి తిప్పుతూ, పాటలతో సారాంశాన్ని చెబుతూ భిక్షాటన చేసేవారు. హరికథా దాసులు కూడా అంతే. సగం రాత్రి వాళ్లు కూడా వేకువ జామున గ్రామాల్లో తిరుగుతూ భిక్షాటన చేసేవారు.
 
జానపద, సాంస్కృతిక కళలు, కళా రూపాలు మానవ శ్రమ నుండి పుట్టి పురుడు పోసుకొన్నవే. మానవ వికాసానికి, శ్రమ నుంచి సేద తీరడానికి కళలను శ్రమజీవులే సృష్టించుకున్నారు. ప్రకృతిలో విహరిస్తూ పాటలు అల్లిన కష్టజీవులు, చెట్టునుండి పుట్టవరకు అన్నింటిని తమ జానపదంలో శిల్పంగా తీర్చిదిద్దారు.ఇదే సమయంలో అనేక ప్రాంతాలకు బతుకు తెరువు కోసం సంచరించిన సంచార జాతులు అనేక ప్రాంతల సంస్కృతులను, సాంప్రదాయాలనుసంప్రదాయాలను పాటలుగా అల్లి సమాజానికి జ్ఞానాన్ని అందించారు.
 
ఇదే కోవలో వృత్తి కులాల వారైన గొర్రెల కాపర్లు, గొల్ల కుర్మలు అడవిలో సంచరిస్తూ ప్రకృతిని వర్ణిస్తూ ‘ఒగ్గు కత’ను సృష్టించారు. [[సుక్క సత్తయ్య]] [[మిద్దె రాములు]] వంటి కళాకారులు ఒగ్గుకథను ప్రపంచానికి పరిచయం చేసి దేశానికి కీర్తిప్రతిష్ఠలు అందించారు. ఒగ్గు కథలను పుస్తక రూపంలో మారిస్తే వేల పేజీల పుస్తకాలుగా ముద్రించవచ్చు. ఇందులో ఎన్నో పదాలు, ఎన్నో పదప్ర యోగాలు, కమనీయమై న ప్రజల వాడుక భాష, తమ దేవతల గొప్పత నం, తమ పూర్వీకుల త్యాగాలు, వీర గాథలు కళ్లకు కట్టినట్లు నాట్య మాడుతాయి.
"https://te.wikipedia.org/wiki/ఒగ్గు_కథ" నుండి వెలికితీశారు