"కుమారజీవుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో (2), ) → ) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు కు → లకు , ని → ని , బౌద్దులు → బౌద్ధులు, → (2), ) → ) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో (2), ) → ) using AWB)
 
===కాష్గర్ లో విద్యాభ్యాసం===
మార్గమద్యంలో తల్లితో కలసి కుమారజీవుడు కాష్గర్ నగరంలో ప్రవేశిస్తున్నప్పుడు ఒక బౌద్ద మోక్ష సన్యాసి (Arhat) కుమారజీవుని ఉద్దేశించి అతనికి ఉజ్వల భవిష్యత్తు వుందని, బౌద్ధ ధర్మప్రచారకుడిగా అసాంఖ్యకమైన ప్రజలను బౌద్ధంలోకి ఆకర్షించగలడని భవిష్యవాణి పలికాడు. అప్పటికే [[మద్య ఆసియా]] లోని కాష్గర్ నగరం బౌద్ధ ఆచార్యులతో, బౌద్ద గ్రంథాలయాలతో విలసిల్లుతున్నది. కాష్గర్ లో స్థిరపడిన ఒక కాశ్మీర బౌద్ధసన్యాసి 'బుద్ధయాసు'ని మార్గదర్శకత్వంలో అభిధర్మ సాహిత్యాన్ని అభ్యసించాడు. వైదిక సాహిత్యం, వేద మంత్ర ఉచ్చారణ రీతులను నేర్చి, పారమార్ధిక సత్త్యోద్ఘాటనలో కనిపించాల్సిన ఉచ్చారణా ధ్వనిరీతులపై పట్టు సాధించాడు. కాష్గర్ నగరంలో వుంటున్నప్పుడే [[పాళీ]], [[సంస్కృత భాష]] లతో పాటు మధ్య ఆసియా భాషలపై పట్టు సాధించాడు. ఇవి తరువాతతరువాతి కాలంలో సంస్కృతంలో వున్న బౌద్ధ గ్రంథాలను చైనా భాషలోకి అనువాదం చేయడంలో కుమారజీవునికి ఎంతగానో ఉపకరించాయి. ఒకానొక సందర్భంలో కాష్గర్ రాజాస్థానంలో కుమారజీవుడు విశిదీకరించిన ఒక బౌద్ధ ధర్మసూత్రాన్ని ఆధారం చేసుకొని అక్కడి బౌద్ధ మఠాలలో కనిపించే నిర్లక్ష్యధోరణిలను సంస్కరించే ప్రయత్నం జరిగింది.తరువాత 12 వ ఏట కుమారజీవుడు తల్లితో కలసి కాష్గర్ ను విడిచి తుర్పాన్ (Turpan) చేరుకొన్నాడు.
 
==మహాయాన బౌద్దంలోనికి కుమారజీవుడు==
[[Image:Tarimbecken 3. Jahrhundert.png|thumb|300px|క్రీ.శ. 4 వ శతాబ్దంలో తారిమ్ బేసిన్ (చైనా) లో ఏర్పడిన కూచా, కాష్గర్, తుర్పాన్ తదితర మద్య ఆసియా రాజ్యాలు]]
కూచా రాజ్యానికి ఈశాన్య సరిహద్దులలో వున్న తుర్పాన్ రాజ్యంలో 10 వేలకు పైగా బౌద్ధ సన్యాసులు వుండేవారు. కుమారజీవుడు దాదాపుగా ఇక్కడ ఉంటున్న సమయంలోనే కుమారజీవుని ధర్మపధం మహాయానం వైపు నడిచింది. ఒకప్పుడు యార్కండ్ (Yarkand) రాకుమారుడు తరువాతతరువాతి కాలంలో మహాయాన బౌద్ధసన్యాసిగా మారిన సుత్యసోముని ప్రభావం కుమారజీవునిపై గాఢంగా పడింది. అతని ప్రభావం వల్ల కుమారజీవుడు శూన్యవాదం వైపు ఆకర్షించబడ్డాడు. సుత్యసోముని ఉపదేశంతో కుమారజీవుడు మహాయాన బౌద్ధసూత్రాలని ఆకళింపు చేసుకొన్నాడు.
 
హీనయానం (స్థవిర వాదం) నుంచి మహాయాన బౌద్ధానికి మారిన తరువాత కుమారజీవుడు తన మనోవైఖిరిని వివరిస్తూ “బంగారాన్ని (మహాయానం) ఎరుగని వ్యక్తి, ఇత్తడిని (స్థవిరవాదం) చూసి అదే గొప్పదని భ్రమపడినట్టుగా, తానింతకాలం వున్నానని, చివరకు మహాయాన ప్రభావంతో తాను విముక్తుడు అయినట్లు” వెల్లడించాడు.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2100511" నుండి వెలికితీశారు