కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
పంక్తి 5:
ఆ తరువాత [[బొంబాయి]]<nowiki/>లో ముద్రణ మరియు ప్రచురణా సాంకేతికతలో కోర్సు చేశాడు. కొన్నాళ్ళు అప్పటి [[హైదరాబాదు]] రాజ్య ప్రధానమంత్రి మహారాజ్ క్రిషన్ ప్రసాద్ వద్ద ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశాడు. ఆ తరువాత ఆడిటర్ జనరల్ కార్యలయంలో ఉద్యోగం చేపట్టాడు.
 
తరువాతతరువాతి కాలంలో [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] దినపత్రికైన డెక్కన్ స్టార్ లో, [[ఉర్దూ భాష|ఉర్దూ]] దినపత్రిక అయిన మసావత్ తో సంపాదకుడిగా పనిచేశాడు. న్యూ ఎరా పత్రికకు కూడా సంపాదకత్వం వహిస్తూ, [[సియాసత్]], రయ్యత్, రహనూమా-ఏ-డెక్కన్, ఎమ్రోజ్ వంటి అనేక [[ఉర్దూ భాష|ఉర్దూ]] వార్తాపత్రికలలో కాలమ్స్ వ్రాశాడు. 1925లో కృష్ణస్వామి తన సొంత ముద్రణాలయం ప్రారంభించి 1929లో ''పిక్టోరియల్ హైదరాబాద్'' గ్రంథాన్ని వెలువరించాడు. ఇది రెఫెరెన్సు గ్రంథంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఈయన హైదరాబాదు చరిత్ర మరియు [[గోవా]]<nowiki/>లో స్వాతంత్ర్యోద్యమం తదితర అంశాలపై అనేక పుస్తకాలను వ్రాశాడు.
 
కృష్ణస్వామి 1918లో సోషల్ సర్వీస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. 1925లో జాంబాగ్ దేవాలయంలో హిందూ ధర్మ పరిషత్ మహాసభను స్థాపించాడు. 1926లో [[రావుబహద్దూర్ వెంకట్రామిరెడ్డి]], [[మాడపాటి హనుమంతరావు]], [[పండిట్ నరేంద్రజీ]]లతో కలసి సుల్తాన్ బజార్లో [[శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం]] రజతోత్సవాన్ని నిర్వహించాడు. 1933 నుంచి 25 సంవత్సరాల పాటు హైదరాబాద్ నగర పాలక సంస్థలో చుడీ బజార్ ప్రాంతానికి మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశాడు. 1940, 1955 లలో డిప్యూటీ మేయర్ (నాయబ్ మీర్ మజ్లిస్) గా, 1957 నుండి 1958 వరకు హైదరాబాదు నాలుగో మేయరుగా సేవలు అందించారు. మేయరుగా ఉన్న కాలంలో హైదరాబాదుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించి నగరంపై చెరగని ముద్రవేశాడు. రచయితగా, సాహితీవేత్తగానే కాకుండా పాత్రికేయుడిగా కూడా ఆయన సేవలందించారు. [[సామాజిక భద్రత|సామాజిక]] రుగ్మతలపై అనేక పుస్తకాలు వ్రాశాడు.