గయ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సైనిక శిక్షణ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కమీషన్ → కమిషన్ using AWB
చి →‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
పంక్తి 27:
గయ చరిత్ర గౌతమబుద్ధుడు జన్మించిన తరూవాత చరిత్రపుటలలోకి ఎక్కింది. గయకు 11 కిలోమీటర్లదూరంలో బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన బోధగయ ఉంది. గయకు సమీపంలో రైగిర్, నలందా, వైశాలి, పాటలీపుత్ర ఉన్నాయి. ఈ పురాతన ప్రపంచానికి జ్ఞానభాండాగారమని కీర్తించబడుతుంది. గయ మగధ సామ్రాజ్యంలో ఒక భాగం. పాటలీపుత్ర అగరాన్ని రాజధానిగా చేసుకుని మౌర్యులు సామ్రాజ్యాన్ని పాలించారు. మౌర్యుల కాలంలో నలందావిశ్వవిద్యాలయం ప్రజలను విజ్ఞానవంతులని చేయడంలో ప్రథమస్థానంలో ఉంది.
 
క్రీ.శ 1810 లో గయ రెండు భాగాలుగా ఉండేది. ఒకభాగం పూజారులు నివసించే భాగం. ఈ భాగాన్ని గయ అనేవారు. రెండవ భాగంలో న్యాయవాదులు మరియు వ్యాపారులు ఉండేవారు. దానిని ఎలహాబాద్ అనేవారు. అయినా తరువాత రోజులలో కలెక్టర్ సాహెబ్ థోమస్ ఈ నగర పునరుద్ధరణ చేసిన తరువాత దీనిని సాహెబ్‍గంజ్ అంటూ వచ్చారు. ప్రఖ్యాత జాతీయవాది బీహార్ విభూతి డాక్టర్ అనుగ్రహ్ నారాయణ్ సింహా జన్మస్థలమిదే. ఈయన బీహార్ మొదటి ఉపముఖ్యమంత్రి అరియు ఆర్థిక మంత్రిగా పనిచేసారు. అలాగే మగధ చివరి రాజైన టెకారీ జన్మించిన నగరం ఇదే. ప్రఖ్యాత జాతీయవాది మరియు కిసాన్ ఆందోళన్ నాయకుడు అయిన స్వామి సహజానంద సరస్వతి గయలోని నేయమత్ పూర్ వద్ద ఆశ్రమనిర్మాణం చేసాడు. తరువాత అది బీహార్ స్వాతంత్ర్యోద్యమ నాయకులకు కేంద్రమైంది. ఆయన అంతరంగిక సహాయకుడు వీర్ కేశ్వర్ సింగ్ ఆఫ్ పరిహాస్. భారతీయ జాతీయ కాంగ్రెస్ కు చెందిన ప్రముఖ నాయకులందరూ దాదాపు ఈ ఆశ్రమానికి తరచుగా యదునందన శర్మను చూడడానికి విచ్చేసేవారు. యదునందన్ గయజిల్లా రైతులకు నాయకుడుగా కిసాన్ ఆందోళన్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. తరువాతతరువాతి కాలంలో స్వాతంత్ర్యోద్యమ నాయకుడైన సహజానంద సరస్వతి రైతులకు నాయకత్వం వహించాడు. బీహార్ స్వాతంత్ర్యోద్యమంలో విస్తారంగా పాల్గొన్నది. స్వతంత్రోద్యమ కాలంలో 1922 లో ఇక్కడ దేశ్ బంధు చిత్తరంజన్ దాసు నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ సభ నిర్వహించబడింది. ఆ సభలో ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకులందరూ భాగస్వామ్యం వహించారు. మోహ‍న్‍దాస్ కరమ్‍చంద్ గాంధీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ అనుగ్రహ్ నారాయణ్ శర్మా, సరదార్ పటేల్, మౌలానా ఆజాద్, జవహర్ లాల్ నెహ్రూ మరియు శ్రీకృష్ణ సింహా వంటి మహామహులు ఆ సభలో పాల్గొన్నారు.
 
గయ నియోజకవర్గానికి శ్రీ ఈశ్వర్ చౌదరి ఐదవ, ఆరవ మరియు తొమ్మిదవ 1971-79 నుండి 1989 -1991 వరకు పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నాడు. ఆయన ప్రఖ్యాత సంఘసేవకుడు ఆయన తనజీవితాన్ని బలహీనవర్గాలను ముందుకు తీసుకురావడానికి అంకితం చేసాడు. ఆయన పార్లమెంటులో క్రియాశీలకంగా పనిచేసాడు. ఆయన షేడ్యూల్ కులాలు మరియు గిరిజనుల సంక్షేమానికి కృషిచేసాడు. ఆయన సేవలు శ్రామిక సంక్షేమ మంత్రిత్వశాఖ సలహా కమిటీలో కూడా కొనసాగాయి. 1991 మే మాసంలో ఆయన తన 52వ సంవత్సరంలో పదవ పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేసిన సమయంలో తుపాకితో కాల్చివేయబడ్డాడు.
"https://te.wikipedia.org/wiki/గయ" నుండి వెలికితీశారు