500, 1000 రూపాయల నోట్ల రద్దు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లో → లో , → (2) using AWB
పంక్తి 1:
{{Orphan|date=ఏప్రిల్ 2017}}
 
[[File:Queue in ATM at Tadepalligudem after demonetization of Indian 500, 1000 Note.jpg|thumb|500, 1000 రూపాయల నోట్లు చెల్లవన్న నిర్ణయం వెలువడ్డ గంటల వ్యవధిలో ఏటీఎం ([[తాడేపల్లిగూడెం]], [[స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా]]) వద్ద బారులు తీరిన జనం]]
'''500, 1000 రూపాయల నోట్ల రద్దు''' అన్నది [[భారత ప్రభుత్వం]] అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయం. 8 నవంబర్ 2016 అర్థరాత్రి నుంచి మొదలుకొని అన్ని 500, 1000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన మారక విలువను కోల్పోతాయి. 8 నవంబర్ 2016న జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగం ద్వారా దీన్ని భారత ప్రధాని [[నరేంద్ర మోడీ]] ప్రకటించారు.<ref>{{cite news|last1=Bhatt|first1=Abhinav|title=Watch PM Modi's Entire Speech On Discontinuing 500, 1000 Rupee Notes|url=http://www.ndtv.com/india-news/pm-modi-speaks-to-nation-tonight-at-8-pm-1622948|accessdate=8 November 2016|publisher=NDTV India|date=8 November 2016}}</ref> ప్రకటనలో మోడీ 500, 1000 రూపాయల బ్యాంకు నోట్లను చెల్లనివిగా ప్రకటించి, కొత్త 500, 2000 రూపాయల నోట్లను చెలామణిలోకి వచ్చినట్టు ప్రకటించారు. ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా మారిన దొంగనోట్ల మాఫియాను, దేశంలోని నల్లధనాన్ని దెబ్బతీసేందుకు ఈ చర్య చేపట్టారు.<ref>[http://indiatoday.intoday.in/story/live-pm-narendra-modi-addresses-nation/1/805755.html PM Narendra Modi: Rs 500, Rs 1000 bank notes not valid from midnight; ATMs won't work tomorrow]</ref>
 
==విధానం==
ధాని ప్రకటన జరిగిన వెంటనే [[ఆర్.బి.ఐ|ఆర్.బి.ఐ.]]. [[గవర్నర్]] చలామణిలో ఉన్న 500, 1000 నోట్లను మార్చుకునే విధానాన్ని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. <ref>http://finmin.nic.in/press_room/2016/press_cancellation_high_denomination_notes.pdf</ref> నవంబర్ 8న 500, 1000 రూపాయల నోట్లు చెల్లవన్న అంశంతో పాటుగా మరికొన్ని సంబంధిత నిర్ణయాలను కూడా ప్రకటించారు:
# 9, 10 నవంబర్ తేదీల్లో దేశ వ్యాప్తంగా అన్ని [[ఏటీయం]]<nowiki/>లు మూసివుంటాయి.
# అన్ని బ్యాంకులు 9 నవంబర్ తేదీన మూసివుంటాయి.
# ఆపైన డిసెంబర్ 31 వరకూ సరైన గుర్తింపు ద్వారా [[బ్యాంకు]]<nowiki/>ల్లో, [[పోస్టాఫీసు]]<nowiki/>ల్లో 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు.
# పై గడువు తేది వరకు కూడా ఎవరైనా [[బ్యాంకు]] లో తమ నోట్లను జమచేయనట్లయితే, మార్చి 30, 2017 వరకు తగిన ఆధారాలతో ఏదేని ఆర్. బి. ఐ బ్యాంకు లలో జమ చేయవచ్చు
 
 
==రద్దు ద్వారా సమస్యలు, ఇబ్బందులు==