అష్టా చమ్మా (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఓక → ఒక, సెప్టెంబర్ → సెప్టెంబరు, విశాఖపట్టణం → విశాఖప using AWB
పంక్తి 18:
|country = [[భారత దేశము]]
}}
'''అష్టా చమ్మా''' 2008లో విడుదలయిన హాస్యకథా చలనచిత్రం. [[ఇంద్రగంటి మోహన కృష్ణ]] ఈ సినిమాకు రచయిత మరియు దర్శకుడు. ఈ సినిమాలో [[స్వాతి (నటి)|స్వాతి]], [[నాని]], [[అవసరాల శ్రీనివాస్]], [[భార్గవి (నటి)|భార్గవి]] ముఖ్య పాత్రలలో నటించగా [[తనికెళ్ళ భరణి]] సహాయక నటుడి పాత్రలో కనిపిస్తారు. అప్పటివరకూ సహాయదర్శకుడిగా పనిచేసిన నాని ఈ సినిమాతో కథానాయకునిగా పరిచయం అయ్యారు. అవసరాల శ్రీనివాస్ కు కూడా ఇది మొదటిచిత్రం. <ref>{{Cite news|url=http://specials.rediff.com/movies/2008/sep/01slid1.htm|title=టెకింగ్ ఆన్ ఆస్కార్ వైల్డ్!|last=Rajamani|first=Radhika|date=2008-09-01|publisher=[[Rediff.com]]|accessdate=2008-09-07| archiveurl= http://web.archive.org/web/20080907041942/http://specials.rediff.com/movies/2008/sep/01slid1.htm| archivedate= 7 September 2008 <!--DASHBot-->| deadurl= no}}</ref><ref>{{Cite news|url=http://www.idlebrain.com/celeb/interview/mohanakrishna2008.html|title=మోహన కృష్ణ ఇంటర్వ్యూ|date=2008-07-10|publisher=Idlebrain.com|accessdate=2008-09-09| archiveurl= http://web.archive.org/web/20080909090033/http://www.idlebrain.com/celeb/interview/mohanakrishna2008.html| archivedate= 9 September 2008 <!--DASHBot-->| deadurl= no}}</ref>
 
==కథ==
సినీనటుడు [[మహేష్ బాబు]] అభిమాని అయిన హైదరాబాద్ అమ్మాయి లావణ్య ([[కలర్స్ స్వాతి]]) అభిమానం హద్దుమీరి ఆయన్నే పెళ్లిచేసుకోవాలనుకుంటుందిపెళ్ళిచేసుకోవాలనుకుంటుంది. హఠాత్తుగా మహేష్ బాబు [[నమ్రతా శిరోద్కర్]] ని పెళ్ళిచేసేసుకున్నాడని తెలిసి చాలా నిరుత్సాహపడిపోతుంది. అయితే సినీనటుడు మహేష్ ని పెళ్ళిచేసుకోలేకపోయినా కనీసం మహేష్ అన్న పేరున్న వ్యక్తినైనా పెళ్లిచేసుకోవాలనిపెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. రోజంతా మహేష్ బాబు సినిమా పాటలు పెట్టుకుని పిచ్చెక్కిస్తుండడంతో పక్కింటి కుర్రాడు ఆనంద్ ([[అవసరాల శ్రీనివాస్]]) ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. మహేష్ అనే పేరుండి, లావణ్యకు తగిన వరుడు కాగల వ్యక్తి కోసం తిరిగీ తిరిగీ చివరికి రియల్ ఎస్టేట్ బిజినెస్ తక్కువగానూ, జీవితన్నా ఎంజాయ్ చేయడం ఎక్కువగానూ చేసే మహేష్ ([[నాని]])ని పట్టుకుంటాడు. మహేష్ ని లావణ్యకి పరిచయం చేసిన కొద్దిరోజులకే వారిద్దరూ ప్రేమించుకుంటారు.<br />
లావణ్య మొదట తన పేరును చూసే ఇష్టపడిందన్న విషయం మహేష్ కి చెప్పేస్తుంది. మహేష్ వెంటనే ఆనంద్ ని కలిసి తన గతం చెప్తాడు. నిజానికి మహేష్ అసలు పేరు రాంబాబు. కోనసీమలోని లక్కవరం గ్రామంలో ఊరిపెద్ద కొడుకు. తల్లిదండ్రులు చనిపోయిన నాటి నుంచి చెల్లెలు వరలక్ష్మిని పాదాలు కందకుండా పెంచుతూంటాడు. ఊళ్ళోవాళ్ళకి ఏ తగవైనా పెద్దమనిషిగా రాంబాబే తీర్పుచెప్పాలి. ఇలా వయసుకు మించిన బరువుబాధ్యతలు, మంచితనం భరిస్తూన్న రాంబాబుకు వీటి నుంచి విముక్తి కోసం మైకేల్ జాక్సన్ పాటల క్యాసెట్ పెట్టుకుని వింటూంటాడు. ఆ క్యాసెట్ చిక్కుకుపోయి పాడైపోవడంతో, ఆ ఫ్రస్టేషన్లో ఊరిలోని బరువు బాధ్యతల నుంచి తప్పించుకుని ఎంజాయ్ చేయడానికి హైదరాబాద్ వస్తూంటాడు. తన చెల్లెలు ఎందుకు వెళ్తున్నావంటే మహేష్ ని కలవడానికి అని చెప్తాడు. అలానే హైదరాబాద్ లో రాంబాబు అన్న తన పల్లెటూరి పేరు పక్కనపెట్టి మహేష్ అని చెప్పుకున్నాడు. లావణ్యకి ఈ విషయం తెలిసి ఎక్కడ తనని కాదంటుందోనని భయపడుతూంటాడు. మరోపక్క లావణ్యకి ఎలాగైనా ఎన్నారై పెళ్ళికొడుక్కే ఇచ్చిచేయాలనుకునే ఆమె పిన్ని మందిర ([[ఝాన్సీ (నటి)|ఝాన్సీ]]) మహేష్ ని ఇంటర్వ్యూ చేస్తుంది. తన ఊరికి తీసుకువెళ్ళమంటే, తన అసలు పేరు ఎక్కడ బయటపడుతుందోనని తప్పించుకోవాలని చూస్తాడు, దాంతో అతని ప్రవర్తన అనుమానంగా ఉందని తేల్చి తిరస్కరిస్తుంది మందిర.<br />
రాంబాబు చెల్లెలు వరలక్ష్మి (భార్గవి) ఫోటో చూసి ఇష్టపడ్డ ఆనంద్ ఎవరికీ చెప్పకుండా లక్కవరం వెళ్ళి తనే వరలక్ష్మి అన్నయ్య మహేష్ ని అని పరిచయం చేసుకుంటాడు. అప్పటికే మహేష్ అనే కల్పితపాత్ర గురించి రాంబాబు గొప్పలు చెప్పడంతో, ఆ మహేష్ పై క్రష్ పెంచుకున్న వరలక్ష్మి మహేష్ అనే పేరుతో వచ్చిన ఆనంద్ ని ప్రేమిస్తుంది. ఆమె ప్రేమ దక్కించుకోవాలనుకున్న ఆనంద్ తన పేరును మహేష్ గా మారిస్తే మంచి సంభావన ఇస్తానంటూ ఊరి పురోహితుడు సర్వశర్మ ([[తనికెళ్ళ భరణి]]) దగ్గరకి వెళ్తాడు. వరలక్ష్మి ప్రేమ విషయం వాళ్ళింట్లో ఆయాగా పనిచేస్తున్న అమ్మాజీ ([[హేమ]]) రాంబాబుకి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో రాంబాబు హడావుడిగా బయల్దేరి లక్కవరం వచ్చేస్తాడు. రాంబాబు తమ ప్రేమను అడ్డుకుంటున్నాడన్న కోపంలో రాంబాబుకు ఓ సమస్య సృష్టిస్తే తమ జోలికి రాడన్నట్టుగా ఆనంద్ హైదరాబాదులో ఉన్న లావణ్యకి ఫోన్ చేసి పిలిపించేస్తాడు. అప్పటికే మందిర, తన స్నేహితురాలు అమృతతో ఊరు వెళ్ళడంతో అదను చూసుకుని లావణ్య లక్కవరం వచ్చేస్తుంది. లక్కవరం రాగానే కొంత అయోమయం తర్వాత లావణ్యకి తాను ప్రేమించిన వ్యక్తి మహేష్ కాదు రాంబాబు అనీ, వరలక్ష్మికి తాను ప్రేమించింది కూడా మహేష్ ని కాదు ఆనంద్ ని అనీ తెలిసివస్తుంది. దాంతో వారిద్దరూ అలుగుతారు.<br />
పంక్తి 29:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
అష్టాచమ్మా సినిమా కథకు మూలం ప్రముఖ ఆంగ్ల నాటకకర్త [[ఆస్కార్ వైల్డ్]] రాసిన ''ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్'' నాటకం. దర్శకుడు [[ఇంద్రగంటి మోహన కృష్ణ]] ఆ నాటకాన్ని ఆధారం చేసుకుని, తెలుగు వాతావరణానికి తగిన మార్పులు చేస్తూ అష్టాచెమ్మా సినిమా కథ రాసుకున్నారు. మోహనకృష్ణ [[గ్రహణం (2004 సినిమా)|గ్రహణం]], [[మాయాబజార్ (2006 సినిమా)|మాయాబజార్]] సినిమాలు చేశాకా మూడవ అవకాశాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్న రామ్ మోహన్ ఇచ్చారు. అప్పుడు ఆయనకు చెప్పిన రెండు కథల్లో ఒకటైన ఈ సినిమా కథను ఆయన ఎంచుకున్నారు. అయితే సినిమా ప్రకారం హీరోయిన్ కి ఓ పేరంటే విపరీతమైన ఆసక్తివుండాలి. అలాంటి పేరు ఏం పెడదామా అని ఆలోచిస్తూంటే అదే సమయంలో ఘనవిజయం సాదించినసాధించిన [[పోకిరి]] సినిమా, తద్వారా అమ్మాయిలకు అత్యంత ఆకర్షణీయమైపోయిన హీరో [[మహేష్ బాబు]] గుర్తుకువచ్చి అదే పేరంటే హీరోయిన్ కి ఇష్టమన్నట్టు పెట్టేశారు. సినిమాకు వర్కింగ్ టైటిల్ గా "హలో హలో ఓ అబ్బాయి" ఉండేది. "కథ కంచికి" వంటి పేర్లు ఆలోచించి చివరకు అష్టా చమ్మా అన్న పేరును ఖరారుచేశారు. హీరోయిన్ పిన్ని అయిన మందిరాదేవి పాత్ర హీరోయిన్ కి వచ్చిన ప్రేమలేఖలు తనకు వచ్చాయనుకుని ప్రేమించే ఓ లవ్ ట్రాక్ కూడా సినిమాలో ఉండేది, అయితే అది ప్రధాన కథకు ప్రతిబంధకం అవుతోందని భావించి షూటింగ్ కు ముందు తొలగించారు.<ref name="సాక్షి సినిమా వెనుక స్టోరీ">{{cite web |url= http://www.sakshi.com/news/funday/mohan-krishna-indraganti-special-interview-260658|title= మహేష్... ఆ పేరులోనే ఓ మత్తుంది|last1= ఇంద్రగంటి|first1= మోహనకృష్ణ|date= 26 జూలై 2015|website= సాక్షి|publisher= |accessdate=24 ఆగష్టు 2015}}</ref>
 
=== నటీనటుల ఎంపిక ===
పంక్తి 38:
== విడుదల ==
=== మార్కెటింగ్, విడుదల ===
సినిమా పూర్తయిన రెండు నెలల వరకూ విడుదల చేయలేదు. చిన్న సినిమాలు విడుదల చేసేందుకు సరైన సమయం చూసుకుని మరీ చేయాలన్నది నిర్మాత రామ్మోహన్ అంచనా. అందుకు తగ్గట్టే 5 సెప్టెంబర్సెప్టెంబరు 2008 తేదీని సరైన సమయంగా ఎంచుకుని ప్రకటించారు. సినిమా ప్రచారానికి కొత్త తరహా విధానాలు అవలంబించారు. వినూత్నంగా సినిమా విడుదలకు వారం రోజుల ముందే విజయవాడ, విశాఖపట్టణంవిశాఖపట్నం నగరాల్లో ప్రీమియర్ షో వేశారు. ఇలాంటి సినిమాలు విడుదలైన వారం, పదిరోజుల వరకూ నెమ్మదిగా బావుందన్న పేరుతెచ్చుకుని ఆ తర్వాత ఊపందుకుంటాయి. ఈలోగా థియేటర్ ఓనర్లు తీసేస్తే చాలా ఇబ్బందికరమైన స్థితి ఎదురవుతుంది. ఆ సమస్య పరిష్కరించేందుకు ఇలా ముందుగా ప్రదర్శన జరిగి, విడుదలయ్యేనాటికి బావుందన్న మాట వ్యాపిస్తే సినిమా విజయం మరింత ముందుగానే సాధ్యపడుతుందన్న ఆలోచనతో చేశారు. సినిమా బాగోలేదన్న పేరు తెచ్చుకుంటే మాత్రం చాలా సమస్యలు ఎదురుకావచ్చు. అయితే తన సినిమాను నమ్మి, రామ్మోహన్ ధైర్యం చేసి ప్రీమియర్ వేశారు. ప్రీమియర్ షోల్లో సినిమా చాలా బావుందన్న టాక్ వచ్చింది.<ref name="సాక్షి సినిమా వెనుక స్టోరీ" />
 
=== స్పందన ===
"https://te.wikipedia.org/wiki/అష్టా_చమ్మా_(సినిమా)" నుండి వెలికితీశారు