తెలంగాణ సారస్వత పరిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , హైదరాబాద్ → హైదరాబాదు (7), → (11), ) → ) (3), ( → ( (3) using AWB
చి →‎కార్యక్రమాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు, అక్టోబర్ → అక్టోబరు (3), using AWB
పంక్తి 16:
హైదరాబాదు, ఇతర తెలంగాణా జిల్లాల్లో [[సంక్రాంతి]], [[ఉగాది]] మొదలగు పండుగల సమావేశాలు, ఆంధ్ర మహాకవుల జయంత్యుత్సవాలు, కవిసమ్మేళనాలు, ప్రబోధ సప్తాహములు నిర్వహించడం, ఖండవల్లి బాలేందు శేఖరం గారి 'ఆంధ్రుల చరిత్ర' ([[1944]]) వంటి గ్రంథాలను ప్రచురించడం, తెలుగు భాషా సాహిత్యాల్లో మెట్రిక్ స్థాయిలో ప్రవేశ పరీక్షలు జరిపి (1944 జూలై నుండి) హైదరాబాదు ప్రభుత్వానికి తెలుగు ఉపాధ్యాయులను పంపడం మొదలైన కార్యక్రమాలను చేపట్టింది. గ్రంథ ప్రచురణ, గ్రంథాలయ నిర్వహణ, తెలుగులో బోధన, పరీక్షల నిర్వహణ, సాహిత్య కార్యక్రమాల నిర్వహణ మొదలైన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టింది పరిషత్. పండిత, ప్రజా, బాల సారస్వతాలు అనే మూడు విభాగాల్లో సుమారు రెండువందల పుస్తకాలను ప్రచురించి అతితక్కువ ధరలకు విక్రయించింది. తెలుగునాట మొట్టమొదటిసారిగా జానపద వాజ్ఞ్మయాన్ని ప్రచురించింది పరిషత్తే. పరిషత్ ప్రచురించిన [[సురవరం ప్రతాపరెడ్డి]] "[[ఆంధ్రుల సాంఘిక చరిత్]]ర"కు [[1955]]లో వచ్చిన [[కేంద్ర సాహిత్య అకాడమీ]] అవార్డే తెలుగులో మొదటిది. రామాయణ, భారత, భాగవతాది ప్రఖ్యాత గ్రంథాలెన్నింటిపైనో వ్యాఖ్యానాలు, హాస్య విమర్శలను పరిషత్ ప్రచురించింది. ఎన్నో ప్రఖ్యాత గ్రంథాలను సేకరించి గ్రంథాలయాన్ని నిర్వహించింది. 1952లో హైదరాబాదు‌లో నిర్వహించిన అఖిల భారత గ్రంథాలయ మహాసభలకు ఆహ్వాన సంఘ కార్యదర్శిగా పనిచేసింది. లక్ష్మణరాయ పరిశోధక మండలికి, తెలంగాణా రచయితల సంఘ స్థాపనకు, అఖిల భారత తెలుగు రచయితల సమావేశాలకు, యువభారతి సాహిత్య కార్యక్రమాలకు, తెలుగు లిపి సంస్కార కార్యక్రమాలకు, సారస్వత వేదికకు కేంద్రంగా పనిచేసింది.
 
[[1950]] నుండే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహాయం పొందినా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హిందీ భాషలో విద్యాబోధనను వ్యతిరేకించి మెట్రిక్యులేషన్, ఇంటర్, డిగ్రీ స్థాయి వరకు మాతృభాషలో విద్యాబోధన జరిగేటట్లు ప్రభుత్వ వ్యవహారాలూ తెలుగులో జరిగేటట్లు ప్రభుత్వంతో పోరాడి విజయం సాధించింది. 1945 అక్టోబర్అక్టోబరు నుండి ప్రాథమిక, మాధ్యమిక పరీక్షలను నిర్వహించింది. 1951 మార్చి నుంచి ఉన్నత స్థాయిలో విశారద పూర్వభాగం, 1953 మే నుండి విశారద ఉత్తరభాగం పరీక్షలను నిర్వహించి విశారదను ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాచ్య భాషా ప్రవేశ పరీక్ష (ఓరియంటల్ లాంగ్వేజ్ ఎంట్రన్స్) తో సమానంగా గుర్తించేటట్లు చూసింది. ఈ పరీక్షలను సంవత్సరానికి రెండు సార్లు దాని శాఖలన్నింటిలోనూ నిర్వహించినట్లే, 1964 దసరా (అక్టోబర్అక్టోబరు 22) నుండి తెలుగు పండిత శిక్షణ కళాశాలను 1962లో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రారంభించిన భవనంలో నిర్వహించింది. డి.ఓ.యల్., బి.ఓ.యల్, ఎం.ఓ.యల్ కోర్సులను 1965 సంక్రాంతి (జనవరి15) నుండి సాయంకాలం కళాశాలలో, ఆగస్ట్ఆగస్టు 27 నుండి డే కళాశాలలో నిర్వహించింది.
 
బడికి పోలేని పిల్లలు, స్త్రీ పురుష వయోజనుల్లో తెలుగు విద్యను వ్యాప్తి చేయడానికి హైదరాబాదు‌లో 1950 జూన్‌లో వయోజన విద్యా శిక్షణ కేంద్రమును స్థాపించి 1950-54 మధ్య తెలంగాణాలో 64, సింగరేణి, కొత్తగూడెం, బెల్లంపల్లి మొదలైన బొగ్గు గనుల కార్మికుల కోసం 16, బొంబాయి తదితర రాష్ట్రేతర ప్రాంతాల తెలుగు కార్మికుల కోసం మరికొన్ని అన్నీ కలిపి సుమారు 130 వయోజన/ రాత్రి పాఠశాలలను, 1954-56 మధ్య ప్రభుత్వ సహకారంతో 19 సాంఘిక సంక్షేమ విద్యా కేంద్రాలను నడిపింది.
పరిషత్ తెలుగు సాంస్కృతిక కళలనూ పోషించింది. తన వార్షికోత్సవాలలో 1952 అక్టోబర్అక్టోబరు నుండి [[నటరాజ రామకృష్ణ]] చేత హైదరాబాదు‌లోని పలుచోట్ల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలను ఇప్పించింది. [[కొండపల్లి శేషగిరి రావు]], [[కాపు రాజయ్య|కె.రాజయ్య]]ల చేత చిత్రకళా ప్రదర్శనలను నిర్వహించింది. 'రసరంజని' నాటకాలకు ఉచితంగా ఆడిటోరియాన్నిచ్చింది. [[అయ్యదేవర కాళేశ్వరరావు]], [[మాడపాటి హనుమంతరావు]], [[దేవులపల్లి రామానుజరావు]] పరిషత్‌ను విశాలాంధ్రోద్యమ కేంద్రంగా నడిపారు.
 
==పురస్కారాలు==