ఎ.పి. కోమల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశపు → భారతదేశపు, సారధి → సారథి, విద్యార్ధి → using AWB
పంక్తి 35:
| weight =
}}
'''ఆర్కాట్ పార్థసారథి కోమల''' ({{lang-ta| ஏ.பி.கோமளா}}) (జ. ఆగష్టు 28, 1934) <ref name=imdb>{{IMDb name|0007298|Komala A. P.}}</ref> దక్షిణభారత దేశపుదక్షిణభారతదేశపు నేపథ్యగాయని.<ref name=imdb/> ఈమె 1950, 60వ దశకాల్లో [[తమిళం]], [[మళయాలం]] మరియు [[తెలుగు]] భాషల్లో అనేక పాటలు పాడింది. రేడియో కళాకారిణి. తమిళనాడు ప్రభుత్వం ఈమెను కళైమామణి బిరుదంతో సత్కరించింది.
 
కోమల [[మద్రాసు]]లోని తిరువళ్ళికేనులో జన్మించింది. ఈమె తల్లితండ్రులు పార్థసారధిపార్థసారథి, లక్ష్మి. మూడేళ్ళ వయసులోనే పాటలు పాడటం ప్రారంభించిన కోమలకు ఒక తెలిసిన వ్యక్తి [[రేడియో]]లో పాడే అవకాశం ఇచ్చింది.<ref>[http://1.bp.blogspot.com/_vDh6VLh0MwE/TDWtWRz8L_I/AAAAAAAABwI/tVwL9-wPVhI/s1600/singer+ap+komala+1.jpeg జ్ఞాపకాలు - ఎపి కోమల]</ref> అదే సమయంలో రేడియోలో నాదస్వరం వాయించటానికి [[రాజమండ్రి]] నుండి మద్రాసు వచ్చిన గాడవల్లి పైడిస్వామి ఆమె పాటను విని, ఆనందపడి, కోమలిని తనతో పాటు [[రాజమండ్రి]] తీసుకువెళ్ళి అక్కడ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇచ్చాడు. జన్మతః తమిళురాలైనా కోమల సంగీతం నేర్చుకున్నది [[తెలుగు]]దేశంలోనే.<ref>[http://3.bp.blogspot.com/_vDh6VLh0MwE/TDa9YWcRDiI/AAAAAAAABxI/p_t969LUlQM/s1600/singer+ap+komala.jpeg కమ్మని కోమల గాత్రధారిణి]</ref> తొలిసారిగా [[ఒరిస్సా]]లోని [[బరంపురం]]లో 1943లో జరిగిన శాస్త్రీయ సంగీత పోటీలో ముత్తుస్వామి దీక్షితార్‌ కృతి ‘శ్రీ గణనాయకం’ పాడి వెండిభరిణె గెలుచుకున్నది. ఈ కార్యక్రమానికి వచ్చిన [[దుర్గాబాయి దేశ్‌ముఖ్|దుర్గాబాయి దేశ్‌ముఖ్‌]] కోమలను ప్రశంసించి మళ్లీ ఆ కృతిని పాడించుకున్నారు.<ref name=andhrajyothy />
 
సంగీత అవగాహన ఉండటం వలన 1944లో తొమ్మిదేళ్ళ వయసులోనే ఈమెకు [[ఆలిండియా రేడియో]]లో ఉద్యోగం వచ్చింది. రేడియోలో ప్రసారమయ్యే గానలహరి కార్యక్రమంలో విద్యార్ధినిగావిద్యార్థినిగా పాల్గొనేది. అక్కడ పనిచేస్తుండగా సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. కోమల ప్రయాగ నరసింహశాస్తి సిఫార్సుతో 1946లో చిత్తూరు వి.నాగయ్య తీసిన ‘త్యాగయ్య’లో తొలిసారిగా సినిమా పాట పాడింది. ఆనందభైరవి రాగంలో ‘మధురానగరిలో చల్లనమ్మ’ అనే ఈ పాటకు ఆమె 250 రూపాయల పారితోషికం అందుకున్నది.<ref name=andhrajyothy>{{cite news|last1=గనిరెడ్డి|first1=అరుణ్‌కుమార్‌|title=తెలుగు సినిమా నన్ను మరిచి పోయింది!|url=http://www.andhrajyothy.com/Artical.aspx?SID=7766&SupID=25|accessdate=3 December 2014|work=ఆంధ్రజ్యోతి|issue=28 Aug 2014}}</ref> ఈమె సినిమాలలో పాడిన తొలిపాట, చివరి పాట తెలుగు పాటలే కావటం విశేషం.
 
ఆలిండియా రేడియోలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన కోమల 1995లో పదవీ విరమణ పొందింది.
"https://te.wikipedia.org/wiki/ఎ.పి._కోమల" నుండి వెలికితీశారు