ఎర్రకోట: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , దీ. → ది., సంధర్బములో → సందర్భ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు, అక్టోబర్ → అక్టోబరు, డిసెంబర using AWB
పంక్తి 32:
మార్చి 11,1783 నాడు [[సిక్కు]]లు స్వల్పకాలము [[ఢిల్లీ]]లో ఉన్న ఎర్ర కోటలోకి ప్రవేశించి, దివాన్-ఇ-అంని ఆక్రమించారు. మొఘలు వజీరు తన సన్నిహితులయిన సిక్కులతో కలిసిపోయి నగరాన్ని వారికి అప్పగించారు. ఈ కార్యము కరోర్ సిన్ఘియా మిస్ల్కి చెందిన సర్దార్ [[బఘెల్ సింగ్]] ధలివాల్ సేనాధిపత్యంలో జరిగింది.
[[File:Historic Lal Quila, Delhi.jpg|thumb|left|భారత పతాకం ఢిల్లీ గేట్ నుండి ఎగురుతూ ఉంది]]
ఈ కోటలో నివసించిన ఆఖరి మొఘలు చక్రవర్తి [[బహదూర్ షా II]] "జఫర్". ఈ కోట మొఘల్ శక్తికి మరియు దాని రక్షణ సామర్ధ్యానికి కేంద్రముగా ఉన్నప్పటికీ, బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా 1857 సంవత్సరములో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు, ఎర్రకోటకి రక్షణ కల్పించలేదు. 1857 తిరుగుబాటు విఫలమైన తరువాత, 17 సెప్టెంబర్సెప్టెంబరు నాడు జఫర్ కోటని వదిలి వెళ్లారు. ఆయన ఎర్రకోటకి బ్రిటిష్ వాళ్ళ ఖైదీగా తిరిగి వచ్చారు. జఫర్ మీద న్యాయ విచారణ 27 జనవరి, 1858 నాడు ప్రారంభమయి ఆయనను అక్టోబర్అక్టోబరు 7 నాడు రాజ్యబహిష్కరణ చేశారు.
 
15 ఆగస్టు, [[1947]]లో, భారత్ స్వతంత్ర దేశముగా మారింది. ఈ సందర్భములో, [[భారత ప్రధాన మంత్రి]] [[జవాహర్ లాల్ నెహ్రూ]] పతాకాన్ని ఎగుర వేశారు. స్వాతంత్ర్యదినోత్సవం రోజు, ప్రధాన మంత్రి దేశీయ పతాకాన్ని ఎగరవేసి ఒక ప్రసంగం ఇచ్చే పద్ధతి ఈ నాటికి కొనసాగుతూ ఉంది. [[రెండవ ప్రపంచ యుద్ధం]] అయిన వెంటనే, [[ఇండియన్ నేషనల్ ఆర్మీ]] ఫై జరిగిన ప్రసిద్ధమైన విచారణ ఎర్రకోటలో జరిగింది.
పంక్తి 39:
{{Wide image|Red Fort courtyard buildings.jpg|1000px|View of the pavilions in the courtyard}}
[[File:RedFortDelhi-NaqqarKhana-20080210-2.jpg|thumb|నక్క్యర్ ఖానా]]
ఎర్రకోట అత్యుత్తమ స్థాయి కళా రూపానికి మరియు అలంకారపు పనితీరుకి అద్దం పడుతుంది. ఈ కోటలో ప్రదర్శించబడిన కళారూపము ఐరోపా, పర్షియా మరియు భారత దేశాలకి చెందిన కళల యొక్క సంయోగము. ఈ కలయిక రూపము, భావవ్యక్తికరణం మరియు వర్ణములలో అత్యుత్తమంగా ఉండే షాజహాని శైలి అనే ఒక విలక్షణమైన అపూర్వమైన వాస్తుకళారూపం వికసించడానికి దారి తీసింది. ఢిల్లీలో ఉన్న ఎర్రకోట, భారత దేశములోభారతదేశములో ఉన్న ముఖ్యమైన భవన సముదాయాలలో ఒకటి. ఈ కోట భారత దేశపుభారతదేశపు చిరకాల చరిత్ర మరియు కళలను తనలో ఇముడ్చుకున్నది. ఈ కోట యొక్క ప్రాముఖ్యత కాలానికి మరియు అంతరానికి అతీతంగా నిలుస్తంది. ఈ కట్టడము భవననిర్మాణ కళయొక్క శక్తికి, మేధస్సుకు చిహ్నంగా నిలుస్తుంది. 1913లో ఈ కోటని ఒక దేశీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడముగా ప్రకటించక ముందు నుండే ఎర్రకోటని భావితరాల వారికోసం కాపాడి నిక్షేపించడానికి ప్రయత్నాలు చేయబడ్డాయి.
 
కోట యొక్క గోడలు నున్నగా అలంకరించబడి, పై బాగాములో భారీగా తీగల అలంకారాలు కలిగి ఉన్నాయి. కోటకి రెండు ముఖ్యమైన ముఖద్వారాలు ఉన్నాయి. అవి ఢిల్లీ దర్వాజా మరియు [[లాహోర్]] దర్వాజ. లాహోర్ దర్వాజానే ప్రధాన ప్రవేశము; ఈ ద్వారం చట్టా చౌక్ అనే ఒక పొడుగైన కప్పబడిన బజార్ వీధికి దారి తీస్తుంది. ఈ వీధి గోడలకు ఆనుకుని దుకాణాల కోసం అంగడులు నిర్మించారు. చట్టా చౌక్ తరువాత ఒక విశాలమైన ఖాళి స్థలం ఉంటుంది. ఆ తరువాత, పెద్ద ఉత్తర-దక్షిణ వీధి వస్తుంది. ఈ వీధి పూర్వం కోటని సైన్య కార్యకలాపాలు పడమర వైపున, రాజభవనాలు తూర్పు వైపున ఉండే విధముగా రెండుగా విభజించేది. ఈ వీధి యొక్క దక్షిణము వైపు చివరలో ఢిల్లీ ద్వారం ఉంటుంది.
పంక్తి 71:
పాత ఢిల్లీలో ఉన్న ఎక్కువ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాల్లో ఎర్రకోట ఒకటి. ఈ కోట ప్రతి ఏడాది వేలాది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ కోట నుండే భారతదేశం బ్రిటీషు వారి నుండి స్వాతంత్ర్యం పొందిన రోజైన ఆగస్టు 15వ తారీఖున, [[భారత ప్రధాన మంత్రి]], దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇదే పాత ఢిల్లీలోని అతి పెద్ద చారిత్రాత్మిక నిర్మాణము.
 
ఒక కాలములో, 3000 మంది కంటే ఎక్కువ జనము ఢిల్లీ కోట సముదాయము లోపల నివసించేవారు. కాని [[1857]] సంవత్సరములోని [[సిపాయిల తిరుగుబాటు]] అనంతరం, [[బ్రిటన్]] ఈ కోటని కైవసం చేసుకొని, నివాస రాజభవనాలని నాశనం చేసింది. ఈ కోట బ్రిటిష్ ఇండియన్ సైన్యం యొక్క కేంద్ర స్థావరముగా మార్చబడింది. తిరుగుబాటు జరిగిన వెనువెంటనే బహదూర్ షా జఫర్ మీద ఎర్రకోటలో విచారణ జరిపించారు. ఇక్కడే నవంబరు 1945లో, [[ఇండియన్ నేషనల్ ఆర్మీ]]కి చెందిన మూడు అధికారుల మీద, ప్రసిద్ధి చెందిన సైన్య విచారణ జరిగింది. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, [[భారత సైన్యం]], ఈ కోటని తన కైవసం చేసుకుంది. డిసెంబర్డిసెంబరు 2003లో భారత సైన్యం, ఈ కోటని భారత పర్యాటక అధికారులకు స్వాధీనం చేసింది.
 
ప్రస్తుతం మొఘల్ చరిత్రని వివరించే ఒక [[ధ్వని మరియు కాంతి ప్రదర్శన]] సాయంత్రం జరిగుతుంది. ఇది పర్యాటకులని ఎంతగానో ఆకర్షిస్తుంది. ముఖ్యమైన వాస్తుశిల్ప కళారూపాల యొక్క పరిస్థితి మిశ్రమంగా ఉంది. విస్తరించి ఉన్న నీటి వనరులలో వేటిలోనూ నీరు లేదు. కొన్ని కట్టడాలు ఒక మోస్తరుగా మంచి పరిస్థితిలోనే ఉన్నాయి. వాటి అలంకరణలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. మరి కొన్నిట్లో పాలరాతి పూల చెక్కుడులని జులాయిలు మరియు దోపిడీదార్లు తీసివేశారు. తేనీరు భవనము చారిత్రాత్మిక పరిస్థితిలో లేనప్పటికీ, ప్రస్తుతం ఇది ఒక పనిచేస్తున్న ఫలహారశాల వలె ఉంది. మసీదు మరియు హమాం ప్రజల దర్శనానికి మూసివేయబడినా, గాజు కిటికీల ద్వారా కాని పాలరాతి జాలకం ద్వారా కాని లోపలకు తొంగి చూడవచ్చు. నడక దారులు అన్ని నాశనమయ్యే పరిస్థితిలో ఉన్నాయి. ప్రజా మరుగుగదులు ఉద్యానవనానికి ప్రవేశద్వారము వద్దను లోపల కూడా ఉన్నాయి. అయితే కొన్ని అపరిశుభ్రంగా అనారోగ్యకరంగా ఉన్నాయి.
పంక్తి 78:
 
==కోటపై ఉగ్రవాదుల దాడి==
ఈ కోటని డిసెంబర్డిసెంబరు 2000 లో, [[లష్కర్-ఎ-తోయిబా]] అనే ఉగ్రవాద సంస్థ దాడి చేసింది.అప్పుడు ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు చంపబడ్డారు. ఇది భారత్-[[పాకిస్తాన్]] మధ్య [[కాశ్మీర్]] గురించి జరుగుతున్నశాంతి ప్రక్రియని నిరోధించే ప్రయత్నమని కొన్ని వార్తా ప్రసార సంస్థలు వర్ణించాయి.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ఎర్రకోట" నుండి వెలికితీశారు