ఐక్యరాజ్య సమితి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు (2), డిసెంబర్ → డిసెంబరు using AWB
పంక్తి 8:
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే 1941 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు [[థియోడార్ రూజ్‌వెల్ట్]] మరియు బ్రిటిష్ ప్రధాని [[విన్‌స్టన్ చర్చిల్]] [[అట్లాంటిక్ మహా సముద్రం|అట్లాంటిక్ సముద్రం]]లో ఒక ఓడలో సమావేశమై కుదుర్చుకొన్న ఒప్పందాన్ని [[:en:Atlantic Charter|అట్లాంటిక్ ఛార్టర్]] అంటారు. ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధభయాన్ని తొలగించడం, [[శాంతి]]ని నెలకొల్పడం, నిరాయుధీకరణ వంటి ఎనిమిది అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందమే తరువాత ఐక్య రాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందినది.<ref>[http://www.internet-esq.com/ussaugusta/atlantic1.htm Atlantic Charter<!-- Bot generated title -->]</ref>.
 
తరువాత 1944లో [[వాషింగ్టన్]] లోని డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు ఐ.రా.స. ప్రకటన పత్రం ముసాయిదాను తయారు చేశారు. 1945 ఫిబ్రవరిలో [[యాల్టా]] సమావేశంలో [[అమెరికా]], [[బ్రిటన్]], [[రష్యా]] నేతలు ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 1945 [[ఏప్రిల్ 25]]నుండి [[జూన్ 26]] వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో 51 దేశాల ప్రతినిధులు పాల్గొని [[ఐక్య రాజ్య సమితి ఛార్టర్]]‌పై సంతకాలు చేశారు. 1945 అక్టోబర్అక్టోబరు 24న [[న్యూయార్క్]] నగరంలో ఐక్య రాజ్య సమితి లాంఛనంగా ప్రారంభమైంది.
 
== సమితి ఆశయాలు ==
పంక్తి 61:
# [[ఐక్య రాజ్య సమితి ఫారిశ్రామిక అభివృద్ధి సంస్థ]] - (UNIDO) - ఈ సంస్థ ఐక్య రాజ్య సమితి సాధారణ సభకు చెందిన అంగంగా 1966 నవంబరు 17న ఏర్పాటయ్యింది. 1985లో ప్రత్యేక సంస్థగా గుర్తించారు. ప్రధాన కార్యాలయం [[ఆస్ట్రియా]] దేశపు [[వియన్నా]]లో ఉంది. అభివృద్ధి చెందుతున్న, బాగా వెనుకబడిన దేశాల పారిశ్రామికీకరణకు, సంబంధిత పాలిసీలకు ఈ సంస్థ సహకరిస్తుంది.
# [[ఐక్య రాజ్య సమితి శరణార్ధుల హైకమిషనర్]] - (UNHCR)) - 1951 జనవరి 1నుండి ఈ సంస్థ పని చేయసాగింది. ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. శరణార్ధుల పరిరక్షణ ఈ సంస్థ ప్రధాన ధ్యేయం. ఈ సంస్థకు 1954, 1981 సంవత్సరాలలో వోబెల్ శాంతి బహుమతి లభించింది.
# [[విశ్వ తపాలా సంఘం]] - [[యూనివర్సల్ పోస్టల్ యూనియన్]] (UPU) - ప్రధాన కార్యాలయం [[బెర్న్]] (స్విట్జర్లాండు)లో ఉంది. 1874 అక్టోబర్అక్టోబరు 9న బెర్న్‌లో జరిగిన పోస్టల్ కాంగ్రెస్ సమావేశంలో "యూనివర్సల్ పోస్టల్ కన్వెన్షన్"ను ఆమోదించారు. అలా ఏర్పడిన యు.పి.యు., 1875 జూలై1 నుండి అమలులోకి వచ్చింది. 1947 నవంబరు 15న సమితి ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది. ప్రతి యేటా అక్టోబర్ 9 తేదీని [[ప్రపంచ తపాలా దినోత్సవం]]గా నిర్వహిస్తారు. వివిధ రకాల [[తపాలా]] సేవల నిర్వహణ ద్వారా ప్రపంచ దేశాల మధ్య సుహృద్భావ వాతావరణ నిర్వహణకు ఈ సంస్థ కృషి చేస్తుంది.
# [[ప్రపంచ వాతావరణ సంస్థ]] - వరల్డ్ మీటియొరలాజికల్ ఆర్గనైజేషన్ (WMO) - 1873లో ఏర్పడిన అంతర్జాతీయ వాతావరణ సంస్థ నిర్వహించిన సదస్సులో కుదిరిన ఒప్పందం ప్రకారం 1947 వాషింగ్టన్ సమావేశంలో ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పడింది. 1950 మార్చి 23 నుండి ఈ సంస్థ పని చేయడం ప్రారంభించింది. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. 1951లో సమితి ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది. వాతావరణంలో సంభవించే మార్పుల గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం, సమాచారాన్ని అందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిశీలనా కేంద్రాలను ఏర్పాటు చేయడం, త్వరితంగా వాతావరణ సమాచారాన్ని అందించడం ఈ సంస్థ నిర్వహించే కార్యక్రమాలు.
# [[అంతర్జాతీయ అణుశక్తి సంస్థ]] - (IAEA) - 1953లో అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్‌హోవర్ చేసిన "శాంతి కోసం అణుశక్తి" ప్రసంగం ఈ సంస్థ ఆవిర్భావానికి నాంది. 1957 జూలై 29న ఈ సంస్థ ప్రారంభమైంది. అణుశక్తిని కేవలం శాంతియుత కార్యక్రమాలకు ఉపయోగపడేలా చేయడం ఈ సంస్థ లక్ష్యం. దీని రాజధాని వియన్నాలో ఉంది. 2005లో ఈ సంస్థకు, దాని అధ్యక్షుడు మహమ్మద్ అల్-బరాదీకి సంయక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది.
పంక్తి 80:
 
== వనరులు ==
* 2008 డిసెంబర్డిసెంబరు 5 - [[ఈనాడు]] పత్రిక "ప్రతిభ ప్లస్" శీర్షికలో - ఎం. వెంకటేశ్వర్లు వ్యాసం
* 2009 ఫిబ్రవరి 2 - "ఈనాడు" పత్రిక ప్రతిభ శీర్షికలో - సీ.హెచ్. కృష్ణప్రసాద్ వ్యాసం
*నందగోపాల్ సర్ నోట్స్
"https://te.wikipedia.org/wiki/ఐక్యరాజ్య_సమితి" నుండి వెలికితీశారు