"ఐస్ బకెట్ ఛాలెంజ్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లో → లో , → (6), ( → ( (2) using AWB
(→‎నేపధ్యము: Fixed an English word to Telugu)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లో → లో , → (6), ( → ( (2) using AWB)
{{Orphan|date=ఏప్రిల్ 2017}}
 
[[File:Doing the ALS Ice Bucket Challenge (14927191426).jpg|thumb|ఐస్ బకెట్ ఛాలెంజ్ తీకునున్న ఔత్సాహికుడు.]]
'''ఐస్ బకెట్ ఛాలెంజ్ ''' అనగా ఒక బకెట్ నిండా మంచు ముక్కలతో కూడిన చల్లని నీటిని తీసుకుని నెత్తిమీదినుండి కుమ్మరించుకోవడం.
'ఐస్ బకెట్ చాలెంజ్' ద్వారా దాతృత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరోపకారి కోరె గ్రిఫిన్. పుర్రె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన స్నేహితుడి సహాయార్థం 'ఐస్ బకెట్ చాలెంజ్' దాతృత్వ కార్యక్రమం మొదలుపెట్టారు. గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్ తారలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు 'ఐస్ బకెట్ చాలెంజ్'లో పాల్గొంటున్నారు. తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు.
 
అమియోట్రోపిక్ లేటరల్ స్ల్కెరాసిస్ (ఎఎల్‌ఎస్) అనేది నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే వ్యాధి. దీనివల్ల మనిషి జీవచ్ఛవంలా మారతాడు. మన దేశంలో అంతగా కన్పించని ఈ వ్యాధి, కొన్ని పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఇంతవరకు దీనికి కారణాలు కనుక్కోలేదు. అమెరికాకు చెందిన బేస్‌బాల్ ప్లేయర్ పెటె ఫ్రేట్స్ దీని బారిన పడ్డాడు. వ్యాధిపై అందరికీ అవగాహన కలిగించేందుకు కొత్త పంథా ఎన్నుకున్నాడు. గత నెలలో ఓ రోజు.. ఐస్‌కోల్డ్ వాటర్‌ను తల మీద నుంచి పోసుకున్నాడు (ఈ వ్యాధి కలిగించే బాధ నుంచి కాస్త ఉపశమనం ఇచ్చేందుకు ఐస్‌వాటర్ ట్రీట్‌మెంట్ కూడా ఒక మార్గమట).
ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టి.. ఇలా మీరు చేయగలరా? అంటూ చాలెంజ్ చేశాడు. దీనిని స్వీకరించినవారు 24గంటల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో 100 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కొంతమంది పాల్గొనే వాళ్ళు పెద్దమనసుతో చాలెంజ్ పూర్తి చేసి కూడా డబ్బు చెల్లిస్తున్నారు. ఇవన్నీ కలిపి ఈ చాలెంజ్‌ను నెట్‌స్క్రీన్‌కి ఎక్కించాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీలను అందరినీ బకెట్ బాట పట్టించాయి. యూట్యూబ్‌లోని వారి వీడియోలకు ప్రకటనల రూపంలో డబ్బులు రాసాగాయి.
ఈ నేపథ్యంలో ఏర్పాటైన ఎఎల్‌ఎస్ ఫౌండేషన్ దీనిని ఒక పూర్తిస్థాయి ప్రాజెక్ట్‌గా చేపట్టింది. వ్యాధి నివారణ గురించిన పరిశోధనలకు నిధుల సమీకరణ కోసం మార్గంగా మార్చింది. ఈ చాలెంజ్ ఇప్పటికే దాదాపు 10 దేశాలను చుట్టేసింది. 15.6 మిలియన్ డాలర్లు రాబట్టింది. అయితే వ్యాధిపై పరిశోధనకు మరింత మొత్తం అవసరం అంటున్నారు ఫౌండేషన్ ప్రతినిధులు.
 
ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలందరూ విపరీతంగా పాల్గొంటున్న పోటీ ఇది. ఎవరూ ఛాలెంజ్ చేయకపోయినా కొంతమంది నెత్తిమీద నుంచి చల్లటి ఐసు నీళ్లు పోసుకుని ఇందులో పాల్గొంటే, [[అక్షయ్ కుమార్]] లాంటి వాళ్ల మీద అభిమానులు బక్కెట్ల కొద్దీ నీళ్లు కుమ్మరిస్తున్నారు. ఏఎల్ఎస్ అనే వ్యాధిని అరికట్టేందుకు జరుగుతున్న పరిశోధనల కోసం విరాళాల సేకరణకు ప్రారంభించిన ఈ ఛాలెంజ్.. ఇప్పుడు ఓ పబ్లిసిటీ వ్యవహారంలా కూడా మారిపోతోంది.
[[File:Atlanta Falcons Take the Ice Bucket Challenge.ogv|thumb|left|ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరిస్తున్న [[m:en:Atlanta Falcons|ఆట్లాంటా ఫాల్కన్స్]] ఆటగాళ్ళు మరియు కోచ్.]]
 
==కోరె గ్రిఫిన్ మరణం==
[[డేవిడ్ బెక్‌హామ్]], [[సత్య నాదెళ్ల]], [[బిల్‌గేట్స్]].. [[క్రిస్టియానో రొనాల్డొ]], [[జస్టిన్ టింబర్లేక్]], [[జిమ్మీ ఫాలన్]].. ఇలా చాలామంది సెలబ్రిటీలు ఐస్ బక్కెట్‌కి సై అన్నారు.
==మనదేశంలో ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖులు==
బాలీవుడ్ నుంచి అక్షయ్‌కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బిపాసా బసు, అభిషేక్ బచ్చన్, సోనాక్షి సిన్హా.. వంటివారంతా సై సై అన్నారు. ఈ ఎఎల్‌ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్‌ను [[హైదరాబాద్]] నగరానికి తీసుకొచ్చిన తొలి టాలీవుడ్ సెలబ్రిటీ [[హన్సికా మోట్వాని|హన్సిక మోత్వాని]].తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో పాటు ఫ్యాన్స్‌ను కూడా చాలెంజ్‌కు నామినేట్ చేసింది. ఆమెతో పాటు [[సానియా మీర్జా]], బ్యాడ్మింటన్ క్రీడాకారిణి [[గుత్తా జ్వాల]], సినీ హీరో [[హర్షవర్ధన్ రాణే]], [[నితిన్ రెడ్డి]], ఉజ్వల్ భల్లా తదితర సెలబ్రిటీలు చాలెంజ్‌లు అందుకోవడమే ఆలస్యం.. బకెట్‌లతో ఐస్‌నీళ్లను నెత్తి మీద కుమ్మరించుకుంటూ యూ ట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేస్తున్నారు. హర్షవర్ధన్ రాణేను గుత్తా జ్వాల చాలెంజ్ చేస్తే.. రంగం ఫేమ్ [[కార్తీక]]ను, [[దగ్గుబాటి రాణా]] తదితరులను హర్ష చాలెంజ్ చేశాడు
===[[సోనాక్షి సిన్హా]]===
బాలీవుడ్ హీరోయిన్ [[సోనాక్షి సిన్హా]] ఓ సరికొత్త పద్ధతిలో ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరించింది.ఎవరూ తనను ఛాలెంజ్ చేయకపోయినా తనంతట తానే ఇందులో పాల్గొంది. ఈ తరహా ఛాలెంజ్ పేరుతో నీళ్లు వృథా చేయడం తనకు ఇష్టం లేదని అంటూ.. బకెట్ లో కేవలం ఒకే ఒక్క ఐస్ క్యూబ్ వేసుకుని, దాన్ని తన తలమీద నుంచి కిందకు వేసుకుంది. అనవసరంగా నీళ్లు వృథా చేయడం మాని ముందు ఆ సైట్ లోకి వెళ్లి విరాళాలు ఇవ్వాలని అభిమానులను కోరింది. ఈ మేరకు [[ఫేస్‌బుక్]] లో తన వీడియోను కూడా పోస్ట్ చేసింది.
 
'ఎవరూ నన్ను నామినేట్ చేయలేదు. అయినా నేను ఛాలెంజ్ స్వీకరించాను. ఇప్పుడు మీ అందరినీ నేను నామినేట్ చేస్తున్నాను. మీరు ఇప్పటికే స్నానం చేసి ఉంటే మాత్రం ఐసునీళ్లు పోసుకోవద్దు. స్నానం చేయకపోతే మాత్రం మీ ఇష్టం. కానీ తప్పనిసరిగా [http://www.alsa.org alsa.org] సైట్ లోకి వెళ్లి విరాళాలు మాత్రం ఇవ్వండి' అని అందులో రాసింది. దీనివల్ల ఏఎస్ఎల్ వ్యాధి నివారణకు పరిశోధనలకు మరింత ఊతం అందే అవకాశం ఏర్పడింది.
 
==బయటి లంకెలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2101200" నుండి వెలికితీశారు