కబీరుదాసు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , అధారం → ఆధారం using AWB
పంక్తి 15:
| mother = Neema
}}
'''కబీరుదాసు''' భక్తి సామ్రాజ్యంలో ఆణిముత్యాలవలె వెలుగొందిన వారిలో అగ్రగణ్యుడు. ''కబీరుదాసు'' అంటే గొప్ప జ్ఞాని అని అర్థం. కబీర్ జన్మస్థలం [[కాశి]]. ఈయన క్రీ.శ.[[1399]]లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులెవరో తెలియదు. కానీ ఇతన్నిఒక నిరుపేద చేనేత [[ముస్లిం]] దంపతులైన నీమా, నీరూ పెంచి పెద్దచేశారు. ఇతను దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఇతని మొదటి భార్య చనిపోగా రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ అమె పరమగయ్యాళి కావటం వలన జీవితముపై విసిగిపోయాడు. ఆకాలంలో ఉత్తర భారతదేశంలో [[హిందువులు]], [[మహమ్మదీయులు]] పరస్పరం ద్వేషించుకొనేవారు మరియు మూఢాచాఅరాలు విరివిగా వ్యాపించి యుండెడివి. ఇవన్నీ చూసిన కబీరుదాసు ఇల్లు వదలి దేశాటనకై బయలుదేరి అనేక యాత్రలు తిరిగి పలుప్రదేశాలను, వివిధ వ్యక్తులను కలుసుకొని జ్ఞాన సంపన్నుడయ్యాడు. కబీరు చదువుకొన్న విద్యాధికుడు కాదు. అయినా ఆయన చెప్పిన ఉపదేశాలను ఆయన శిష్యులు గ్రంథస్థం చేశారు. దాని పేరు "కబీరు బీజక్". కబీర్ శ్రీరాముని భక్తుడు. కబీరుదాసు గురువు "రామానందుడు". అతని ద్వారా జ్ఞానోపదేశం పొంది జీవితాన్ని పావనం చేసుకున్నాడు కబీర్. కబీర్ క్రీ.శ.[[1518]] లో మరణించాడు. అతని భౌతికకాయం కోసం హిందువులు, ముస్లింలు వాదులాడుకున్నారు. కబీర్ ముస్లిం అని, కాదు, హిందువని వారు పోట్లాడుకున్నారు. భౌతికకాయం మాయమై, దానికి బదులుగా అక్కడ పుష్పాలు వెలిశాయట. ఈ నిదర్శనం వల్ల వారికి భక్తకబీరు ఎంతటి మహిమాన్వితుడో తేటతెల్లమయింది. ఇతడు 120 యేళ్ళ సుదీర్ఘ జీవితాన్ని చూశాడు.
 
== సాహిత్యం ==
పంక్తి 25:
* భగవంతుని కొరకు అక్కడ - ఇక్కడ వెతకవలసిన పనిలేదు, అతడు నీలోనే ఉన్నాడు . నీలో వున్న ఆత్మారాముని కనుగొనలేక [[కస్తూరి]] మృగం చందంబున అక్కడక్కడ వెదకులాడిన ఏమి లాభం? పూవులోని వాసనలా దేవుడు నీలోనే ఉన్నాడు. తన నాభినుండి బయట పడుతున్న కస్తూరి గంధాన్ని, తెలుసుకొనలేని జింక, దాన్నిబయట గడ్డిలో వెతుకుతుంది. అలాగే నీలోని భగవంతుని బయట వెతకవద్దు .
== మూలాలు ==
* కబీరుదాసు: సి.వి.నారాయణ ఫిబ్రవరి 2008 [[సప్తగిరి]] పత్రికలో వ్రాసిన వ్యాసం అధారంగాఆధారంగా.
{{భారతీయ సంఘ సంస్కర్తలు}}
[http://www.kubeer.eu.pn www.kubeer.eu.pn]
 
[[వర్గం:భారత కవులు]]
[[వర్గం:ఇస్లాంను వదిలేసిన వారు]]
[[వర్గం:1399 జననాలు]]
[[వర్గం:1518 మరణాలు]]
 
[http://www.kubeer.eu.pn www.kubeer.eu.pn]
"https://te.wikipedia.org/wiki/కబీరుదాసు" నుండి వెలికితీశారు