కాటమరాజు కథ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంక్షిప్త కథ: clean up, replaced: శ్రీనాధ → శ్రీనాథ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లో → లో (2), కి → కి , ధీర్ఘ → దీర్ఘ, ఆర్ధిక → using AWB
పంక్తి 1:
{{Underlinked|date=ఏప్రిల్ 2017}}
{{వికీకరణ}}
తెలుగునాట ప్రాచీనమూ, ప్రశస్తమూ ఐన వీరగాథల్లో ఎన్నదగిన వాటిల్లో '''కాటమరాజు కథ''' ఒకటి. ముప్ఫై రెండు కథలుగా ప్రచారంలో ఉన్న ఈ సుధీర్ఘసుదీర్ఘ వీరగాథా చక్రం తెలుగు వీరగాథావృత్తాల్లోకెల్లా పెద్దదిగా చెప్పుకోవచ్చు. వేటూరి, మల్లంపల్లి, తిమ్మావజ్ఝల గార్ల రచనలను ఆధారంగా చేసుకుని, తాను మరికొంత పరిశోధన చేసి [[ఆరుద్ర]] ఈ కథ ఆధారంగా ఒక నాటకాన్ని రచించారు.
ఈ పుస్తకానికి దిగుమర్తి సీతారామస్వామి ముందుమాట రచించారు. ఈ నాటకాన్ని స్త్రీశక్తి ప్రచురణలు, చెన్నై వారు పుస్తకంగా ప్రచురించారు.
 
Line 7 ⟶ 8:
శ్రీశైలం దగ్గర ఆవుల్ని మేపుతున్న కాటమరాజు, అక్కడ క్షామం రావడం చేత తన అనుచరులతో కలిసి ఆలమందలను తోలుకుని దక్షిణ భూములకు తరలి వస్తాడు. నెల్లూరిసీమను పాలించే నల్లసిద్ధి రాజుతో ఒక ఏడాది పాటు తమ పశువుల్ని అక్కడ మేపుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ ఒప్పందం కోసం రాజు దగ్గర మంత్రిగా ఉన్న ఖడ్గతిక్కన సాయాన్ని తీసుకుంటారు. ఐతే, నల్లసిద్ధిరాజు ఉంపుడుకత్తె కుందుమాదేవి (కన్నమదేవి) పెంపుడు చిలక ఆలమందలను బెదిరించడంతో దానిపై బాణం వేసిచంపుతారు కాటమరాజు అనుచరులు. దానికి ఆగ్రహించిన కన్నమదేవి తమ భటులతో వీరి పశువులను చంపిస్తుంది. ఆ విధంగా మొదలైన ప్రతీకారాలు, ఒప్పంద ఉల్లంఘనలు ఇరుపక్షాల వారినీ యుద్ధానికి ప్రేరేపిస్తాయి. యాదవులకు మొదట్నుంచీ సహాయం చేసిన ఖడ్గతిక్కన ఈ సంఘటనల నేపథ్యంలో వారితోనే యుద్ధంచేసి స్వర్గస్థుడౌతాడు. నల్లసిద్ధి రాజు, కాటమరాజు ముఖాముఖీ తలపడే యుద్ధ సన్నివేశంతో నాటకం ముగుస్తుంది. ఐతే విజయం ఎవరిది అనే విషయం అస్పష్టంగా ఉంది. ఇదే అస్పష్టత ఈ కథ మీద ప్రచారంలో ఉన్న ఇతర గాథల్లోనూ ఉన్నట్టు తెలుస్తుంది.
 
కాటమరాజు శ్రీకృష్ణునికి 23వ తరం వాడని కొన్ని వీరగాథలలోని వంశవృక్షాల వల్ల తెలుస్తోంది. పల్నాటి యుద్ధం క్రీ.శ 12 వ శతాబ్ధంలోశతాబ్దంలో జరగగా, కాటమరాజు ఎర్రగడ్దపాటి పోరు క్రీ.శ 1280 – 1296 మధ్యకాలంలో కాకతీయ సామ్రాజ్యానికి ప్రతాపరుద్రుడు యువరాజుగా ఉన్నకాలంలో నల్లసిద్ధిరాజుకి, కాటమరాజుకీ జరిగింది.
 
కాటమరాజు కథాచక్రాన్ని యాదవభారతం అంటారు. ఈ కథలు రాయబడిన తాటాకు పుస్తకాలని “సుద్దులగొల్లలు, కొమ్ములవారు” అనే గాథాకారులు ఎద్దులపై వేసికొని ఊరూరా ప్రయాణం చేసి ఈ వీరగాథలను పాడటం చేత “యాదవభారతం ఎద్దుమోత బరువు” అనే సామెత పుట్టింది. ఈ కథాచక్రాన్ని తొలుత శ్రీనాథకవి రచించాడనటానికి గాథాకవుల వాక్యాలు ఆధారంగా ఉన్నప్పటికీ శ్రీనాథ విరచితమైన కథ మనకి అందుబాటులో లేదు.
Line 19 ⟶ 20:
“తమకు గురుతుల్యులైన బ్రాహ్మలతో యుద్ధం చెయ్యడం యాదవవంశ ఆనవాయితీ కాదని”, కాటమరాజు కత్తిని ఒరలో దించి ఒంటరివాడైన తిక్కన ముందు తలదించి నిలబడే సన్నివేశం నాయక పాత్రకు ఔన్నత్యాన్ని సంపాదించి పెట్టింది.
 
ఇటుపక్క కత్తి దించిన వారిపై కదనం చేయలేక ఇంటికి తిరిగివచ్చిన ఖడ్గ తిక్కనను పిరికివాడిగా భావించి తల్లి, తండ్రి, భార్య హేయంగా అవమానిస్తున్నప్పుడు కనీసం నోరు మెదపక తిక్కన సహనం పాటించిన సందర్భంలో వ్యక్తిత్వం, బాధ్యత, యుద్ధనీతుల నిర్వాహణ లోనిర్వాహణలో సంయమనం సాధించడానికి ఆ పాత్ర వహించిన మౌనం అతని గంభీరతను నిరూపిస్తుంది.
 
ఎనిమిదవ రంగంలో బోయలు యాదవుల వల్ల తమ భుక్తికి ఇబ్బందిగా ఉందనీ, వేటలో తమకన్నా వారు చురుగ్గా ఉండటం వల్ల వేట తమవరకూ రావడం లేదనీ తిక్కన దగ్గర మొరపెట్టుకున్నప్పుడు, ‘వాళ్లంత చురుగ్గా మీరు లేకపోవడం వాళ్ల దోషం కాదు’ అని సమాధానపరచి పంపుతాడు. అటువంటిది, ఒప్పందాన్ని అతిక్రమించి యాదవులు రాజ్యం దాడిచేశారన్న వార్త విని, యుద్ధం చెయ్యడానికి కృతనిశ్చయుడౌతాడు. రెండు సందర్భాల్లోనూ వేడుకున్నది తమ ప్రజలే అయినా, ఒప్పంద నియమాలను సూక్ష్మంగా విచారించి స్పందించే ధోరణి కనపడుతుంది.
Line 30 ⟶ 31:
జిలుగుటమ్ములు పాతించి, పారాలు తవ్వించి, నిడిపట్టు, అలిమేక, దిగుమజవ వంటి వ్యూహాలతో కూడిన చక్రబంధాన్ని రచించి నల్లసిద్ధి ఆధునిక యుద్ధతంత్రాలతో సాయుధసేనతో సమరశంఖారావం చేస్తే..
 
అడ్దాయుకటువ, అమలచెలిక, కుందలింగముకొంద, తూమువేరులను కాపాడటానికి బొల్లావును నియమించి, గోసంగి బలాలు , భండన విక్రములైన యాదవవీరులు, ఏనుగులను చంపడానికి ఎద్దులు, అశ్వాలను చంపడానికి అక్షీణసంఖ్యలో ఆవులనూ తరలించి, స్థైర్యమే సైన్యంగా, ఆత్మబలమే అంగరక్షణగా కాటరాజు బలగం రణభూమిలోకి దిగినట్టు చిత్రిస్తారు రచయిత.
 
దొనకొండలో ఉండవలసిన దోరవయసు బాలుడు పోచయ్య యుద్ధభూమిలో బాలచంద్రుడివలే భయంగొల్పి , వీరాభిమన్యుడివలె విజృంభించి చివరకు రాజభటులు ప్రయోగించిన విలుమూకలకూ, చాయలబల్లాలకూ బలి అవుతాడు. ఈ రకంగానే మిగతా యాదవముఖ్యులంతా హతమౌతారు.
 
పతాక సన్నివేశంలో తలపడ్ద కాటమరాజు, నల్లసిద్ధి తమ తమ తప్పొప్పులపై, బలమూ, బలగాల ప్రస్థావనతోప్రస్తావనతో రాజనీతి గురించి మాట్లాడుకునే సన్నివేశం సందర్భోచితంగా ఉంటుంది.
 
మోవాకుల మీద లేఖ రాయడం కోసం ఎర్రయ్య తాటిచెట్టుని పెకలించుకురావడం అంతకుముందే ప్రచారంలో ఉన్న వీరగాథల్లోనే ఉండటం వల్ల ఆరుద్ర గారు తేదలచుకున్న రామాయణ సామ్యానికి హనుమంతుడి బలానికి పోలిక సరిపోయింది.
Line 41 ⟶ 42:
సందేశం:
 
యాదవులు రాచరికపు నాగరికతల దృష్ట్యా వెనకబడినవారు. దేశసంపదలోని స్వయంసమృద్ధికి ఆయువుపట్టైన పశుగణాన్ని ప్రాణాధికంగా కాపాడి అహర్నిశలూ వాటి క్షేమాన్ని కోరుకునే అమాయకజాతి. రాజులకి పశుగణాలు కేవలం సంపద ఐతే యాదవులకి అవి దైవ స్వరూపాలు. గోవుని మాతగా పూజించే భారతీయ సంస్కృతిని వంటబట్టించుకుని బొల్లావుని విష్ణుస్వరూపంగా ఆరాధించినవారు. అటువంటి ఒక నిర్మలమైన జాతిని, ఆ జాతి జీవనాధారమైన పశు సంపదను నిర్మూలించడానికి ఆధునిక పరికరాల్ని, మందుగుండునూ వాడి, ఆర్ధికంగాఆర్థికంగా సాస్కృతికంగా వినాశనాన్ని కొనితెచ్చిన ప్రతిపక్షమే నెల్లూరిరాజులని నిరసించడమే ఈ నాటకంలోని ముఖ్యోద్దేశం.
 
అన్ని పాత్రలకూ సరిపడినంత స్థలమూ, అన్ని సన్నివేశాలకూ సమాన ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అంతర్లీనంగా తానుఎంచుకున్న కోణం నుండి కథను రసవత్తరంగా చూపించడంలో రచయిత సఫలీకృతుడయ్యాడనే చెప్పవచ్చు.
Line 49 ⟶ 50:
మచ్చుకి కొన్నిమాటలు:
 
వెర్రిగొల్లలు వెక్కిరిస్తే నాదేం పోదు. ఓండ్రకప్పకు నోరు గొప్పదే. దెబ్బల యెలుగులాగ మీరు బొబ్బరిస్తే ఏం భయపడం. గొల్ల వంకరబుద్ధి గొబ్బున మానండి.
మీరు ముడుపులోని కనకంలాంటివారు. మేము ముడుపుపైన ముద్రవంటివారం. ముద్రలుపోనిదే ముడుపుపోదు. మీరు కన్నయితే మేము కంటికి రెప్పల వంటి వాళ్లము, రెప్పకు హాని రానిదే కంటికి దెబ్బ తగలదు.
ఆవులు అల్లకల్లోలం చేస్తున్నాయి ప్రభూ! కొమ్ముటేనుగులను కూలదోస్తున్నాయి. అశ్వాలసేనపై అమాంతంగా పడుతున్నాయి.
 
==తెలుగు నుడికారం, జాతీయాలు, వాడుక పదాలు==
Line 57 ⟶ 58:
ఈ నాటక రచనలో కథనాన్ని నల్లేరు మీద నడిపించి వీరరసాన్ని విరివిగా ఒలికించడానికి ఆరుద్ర ఎంతో చాకచక్యంగా అలవోకగా వాడిన జాతీయాలు ప్రధాన కారణం. తెలుగు భాష, వాడుక పదాలు, నుడికారం వంటివాటిపై ఆయనకున్న పట్టు ఎన్నోచోట్ల తేటతెల్లమౌతుంది. అటువంటి కొన్ని వాడుకలు:
 
పుల్లరి – కప్పం, సుంకం, శిస్తు వంటిది. పశువులను పరాయి గడ్దపై మేపుకోనిచ్చినందుకు ప్రతిగా చెల్లించవలసిన రుసుము.
శుద్ధకాంతలు – అంతఃపుర కాంతలని శుద్ధకాంతలు అని వ్యవహరిస్తారు, ఒకచోట
ఏరాలి కొడుకు – సవతి కొడుకు
పొరుపులు - పొరపొచ్చాలు
రాణువలు- సేనలు
కూటయుద్ధం – అధర్మయుద్ధం
సాగుమానం: సహగమనానికి వికృతి రూపం కావచ్చు
సృగాలాలు – నక్కలు
కెంధూళి – గోధూళి కిగోధూళికి మరో రూపం (కెంపు+ధూళి)
 
===జాతీయాలు===
Line 127 ⟶ 128:
</poem>
 
అని రాయశృంగారభట్టు యాదవులను హెచ్చరించిన సందర్భంలో రాజసూయ యాగం లోయాగంలో శిశుపాలుడు కృష్ణుని హేళన చేసిన పోలిక లీలగా గుర్తుకు వస్తుంది.
 
<poem>
"https://te.wikipedia.org/wiki/కాటమరాజు_కథ" నుండి వెలికితీశారు