ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
'''బసవరాజు వెంకట అప్పారావు''' (1894 - 1933) ప్రముఖ కవి. భావకవితాయుగంలోని ప్రఖ్యాత కవుల్లో ఒకనిగా ఆయన తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని పొందారు.
== జీవిత విశేషాలు ==
'''బసవరాజు అప్పారావు ''' ([[1894]]-[[1933]]) [[విజయవాడ]] సమీపంలోని [[పటమట]] గ్రామంలో, 13 - 12 - 1894 న జన్మించాడు. [[చెన్నై|మద్రాసు]] ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ. పాసైనాడు. 1916లో రాజ్యలక్ష్మమ్మని [[పెళ్ళి|వివాహం]] చేసుకొన్నాడు. [[మహాత్మా గాంధీ|గాంధీ]] ఉద్యమంతో సంబంధం పెట్టుకొని, [[జాతీయ గీతాలు]] వ్రాశాడు. 1921 ప్రాంతంలో [[ఆంధ్రపత్రిక]], [[భారతి]]కి సహాయ సంపాదకుడుగా పనిచేశాడు.
=== సంసారిక జీవితం ===
ఆయన భార్య రాజ్యలక్ష్మి ''సౌదామిని'' కలం పేరుతో కవితలు[[కవిత్వం|కవిత]]<nowiki/>లు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి బసవరాజు అప్పారావు సాంగత్యంలో కవిత్వం పట్ల ఆసక్తి పెంపొందించుకుని కవయిత్రిగా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఆమె హృదయాన్ని కదిలించే కవితలు రాశారు.<ref>రాజ్యలక్ష్మి ఆత్మకథ "అప్పారావు గారు - నేను"</ref> '''అప్పారావు గారు - నేను''' పేరుతో [[ఆత్మకథలు|ఆత్మకథ]] రచించారు.
పూర్తిస్థాయి వ్యాసం: [[బసవరాజు రాజ్యలక్ష్మి]]
 
== రచన రంగం ==
[[బసవరాజు అప్పారావు]], [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]], [[నండూరి సుబ్బారావు]]లు "భావకవులు" అనబడేవారు ఆ కాలంలో. అప్పారావు సరళ శైలిలో గీతాలు వ్రాస్తే, నండూరి జానపద శైలిలో గేయాలు వ్రాసేవాడు. అందుకే దేవులపల్లి ఇలా అన్నాడు."సుబ్బారావు పాట నిభృత సుందరం, అప్పారావు పాట నిసర్గ మనోహరం" అని.
 
===అప్పారావుగారి గీతాలు===
 
== ప్రాచుర్యం ==
అప్పారావు వ్రాసిన పాటలను [[గూడవల్లి రామబ్రహ్మం]] తన సినిమా [[మాలపిల్ల]]లో (1938) పరిచయం చేశాడు.[[సూరిబాబు]] పాడిన "కొల్లాయి గట్టితేనేమి? మా గాంధి మాలడై తిరిగితేనేమి?" అప్పట్లో ప్రతి గొంతుకలో మారుమ్రోగింది. [[కాంచనమాల]] [[సుందరమ్మ]]లుసుందరమ్మలు పాడిన "నల్లవాడే గొల్లపిల్లవాడే" చాలా ప్రాచుర్యం పొందిన పాట. "గుత్తొంకాయ్ కూరోయ్ బావా, కూరి వండినానోయ్ బావా" అనే పాటను [[బందా కనకలింగేశ్వరరావు]] పాడాడు. [[తాజ్‌మహల్]]ను దర్శించినప్పుడే, "మామిడి చెట్టును అల్లుకొన్నదీ మాధవీలతొకటి" అనే పాటను[[పాట]]<nowiki/>ను రాశాడు. ఆయన వ్రాసిన లలితగీతాలను [[టంగుటూరి సూర్యకుమారి]], [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ|బాలమురళీకృష్ణ]], [[రావు బాలసరస్వతీ దేవి]] మధురంగా పాడారు. అప్పారావు 1933 లోమరణించాడు.
 
== మూలాలు ==
1,82,855

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2101526" నుండి వెలికితీశారు