ఖాకీవనం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( using AWB
పంక్తి 28:
'''ఖాకీవనం''' నవలను ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు, నిర్వాహకుడు [[కె.ఎన్.వై.పతంజలి]] రచించారు.
== రచన నేపథ్యం ==
ఖాకీవనం ప్రముఖ [[రచయిత]], పత్రికా సంపాదకుడు [[కె.ఎన్.వై.పతంజలి]] తొలి నవల. ఈ నవల [[చతుర మాసపత్రిక]] [[1980]] [[నవంబరు]] సంచికలో మొదట [[ముద్రణ]] పొందింది. [[2012]] నవంబరులో [[మనసు ఫౌండేషన్]] ప్రచురించిన పతంజలి సాహిత్యం తొలిసంపుటంలో చోటుచేసుకుంది.<br />
ఈ నవలలోని వివరాలలో అధికభాగం వివిధ దిన, వారపత్రికల నుండి సేకరించిన యదార్థాలే గానీ కల్పితాలు కావని రచయిత పేర్కొన్నారు. ఈ అంశాన్ని గురించి చెప్తూ ''ఈ [[నవల]]లోని కథ సౌలభ్యం కోసం [[తెలుగు]] దేశంలోనే జరిగినట్లుగా వ్రాయబడింది. పాత్రలను కూడా తెలుగువారిగానే పరిచయం చేయటం జరిగింది... అయితే. వాస్తవంలో ఈ కథ తెలుగు దేశానికే పరిమితం కాదు. భారతదేశంలో[[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో ఎక్కడనయినా ఈ సంఘటనలు జరిగి ఉండవచ్చు. పాత్రలు ఏ ప్రాంతానివైనా కావచ్చు'' అంటారు గ్రంథకర్త [[నవలా సాహిత్యము|నవల]] చివర ప్రచురించిన నోట్ లో.<ref>పతంజలి సాహిత్యం:కె.ఎన్.వై.పతంజలి:మనసు ఫౌండేషన్ ప్రచురణ:పే.74</ref>
=== అంకితం ===
ఖాకీవనం నవలను రచయిత కె.ఎన్.వై.పతంజలి తన గురువులు అని పేర్కొంటూ [[శ్రీశ్రీ]], [[చాసో]], [[రావిశాస్త్రి]]ల దివ్యస్మృతికి అంకితం ఇచ్చారు.
పంక్తి 38:
 
== ఇతివృత్తం ==
ఖాకీవనం నవల [[రక్షకభటుడు|పోలీసు]] వ్యవస్థ వల్ల పోలీసులు, సామాన్యులు ఎదుర్కొనే ఇబ్బందులను ఇతివృత్తంగా స్వీకరించింది. ఉన్నతాధికారుల ఇళ్లవద్ద ఆర్డర్లీ పేరిట పనిచేసే కానిస్టేబుళ్ళు, ఎదురు చెప్పడానికి వీల్లేకుండా ఉన్నతాధికారి మాటను ఔదల దాల్చవలసిన కానిస్టేబుళ్ళు ఎదురుతిరిగి వ్యవస్థపై [[తిరుగుబాటు]] చేయడం ముఖ్య కథాంశం. ఈ నవలలోని వివరాలు దిన, వార పత్రికల్లోనించి స్వీకరించిన యదార్థాలని రచయిత స్వయంగా చెప్పుకున్నారు.<ref>పతంజలి సాహిత్యం:కె.ఎన్.వై.పతంజలి: మనసు ఫౌండేషన్ ప్రచురణ:ఖాకీవనం నవల చివరి నోట్:పేజీ.74</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఖాకీవనం" నుండి వెలికితీశారు