సచిన్ టెండుల్కర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
టెండుల్కర్ వ్రాయడంలో ఎడమచేతి వాటం ఉపయోగించిననూ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో మాత్రం కుడిచేతినే ఉపయోగిస్తాడు. టెండుల్కర్ తన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ [[1989]]లో [[పాకిస్తాన్]] పై ఆడి కేవలం 15 పరుగులకే [[వకార్ యూనిస్]] బౌలింగ్ లో అవుటయ్యాడు. వకార్ కు కూడా ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఫైసలాబాద్ లో తన తొలి అర్థశతకం పూర్తిచేశాడు. [[డిసెంబర్ 18]] న ఆడిన తన తొలి వన్డే మ్యాచ్ లో కూడా వకార్ యూనిస్ బౌలింగ్ లోనే డకౌట్ అయ్యాడు. పాకిస్తాన్ సీరీస్ తర్వాత న్యూజీలాండ్ టూర్ లో రెండో టెస్ట్ లో 88 పరుగులు సాధించాడు. [[1990]] [[ఆగష్టు]]లో [[ఇంగ్లాండు]] లోని ఓల్డ్ ట్రఫర్డ్ లో జరిగిన మ్యాచ్ లో తన తొలి శతకం సాధించాడు. [[1991]]-[[1992]]లో ఆస్ట్రేలియా టూర్ లో ప్రపంచ శ్రేణి బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. [[షేన్‌వార్న్]] టెస్ట్ మ్యాచ్ లో రంగప్రవేశం చేసిన [[సిడ్నీ]] మ్యాచ్ లో 148 పరుగులు చేశాడు. ఆ తర్వాత [[పెర్త్]] మ్యాచ్ లో మరో సెంచరీ సాధించాడు.
 
టెండుల్కర్ ప్రతిభ [[1994]]-[[1999]] సంవత్సరాలలో ఉన్నత శిఖరాలకు చేరింది. [[1994]]లో [[ఆక్లాండ్]] వన్డేలో టెండుల్కర్‌ను ఓపెనర్‌గా పంపించారు..<ref>[http://www.cricinfo.com/link_to_database/ARCHIVE/1993-94/IND_IN_NZ/IND_NZ_ODI2_27MAR1994.html Cricinfo Ind v NZ March 27, 1994 match report]</ref> ఆ వన్డేలో 49 బంతుల్లోనే 82 పరుగులను సాధించాడు. సచిన్ టెండుల్కర్ తొలి వన్డే సెంచరీ [[సెప్టెంబర్ 271994]], [[1994సెప్టెంబర్ 27]]లో
ఆస్ట్రేలియాపై తన తొలి వన్డే సెంచరీ సాధించాడు. తొలి వన్డే శతకానికిశతకం సాధించడంకోసం 79 మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది.
 
'''1996 ప్రపంచ కప్''' : తన ప్రతిభను అలాగే కొనసాగిస్తూ [[1996]] [[ప్రపంచ కప్ క్రికెట్]]లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్‌గా నిల్చాడు. ఆ ప్రపంచ కప్ లో 2 శతకాలు సాధించాడు.[[1998]] ప్రారంభంలో భారత్ విచ్చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ టీం పై వరుసగా 3 సెంచరీలు సాధించి బ్యాటింగ్ లో తన ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకున్నాడు. అందులోనే [[షేన్‌వార్న్]], [[రోబర్ట్ సన్]] లను లక్ష్యంగా ముందస్తు ప్రణాళిక వేసుకున్నట్లు వారి బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. అతని ఫలితంగా భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ సీరీస్ తర్వాత సచిన్ తన బౌలింగ్ ను ఉతికి ఆరేసినట్లు రాత్రి కలలో వచ్చినట్లు వార్న్ పేర్కొనడం విశేషం.<ref>SportNetwork.net http://www.sportnetwork.net/main/s119/st62164.htm. ''Down Memory Lane - Shane Warne's nightmare''. November 29, 2004</ref>
"https://te.wikipedia.org/wiki/సచిన్_టెండుల్కర్" నుండి వెలికితీశారు