రోజర్ బిన్నీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
బిన్నీ అతని సొంత మైదానమైన బెంగుళూరు లోనే [[1979]] లో [[పాకిస్తాన్]] పై తన అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం చేసినాడు. [[ఇమ్రాన్ ఖాన్]], [[సర్ఫ్రరాజ్ నవాజ్]] లాంటి మేటి బౌలర్లను ఎదుర్కొని తొలి మ్యాచ్ లోనే 46 పరుగులు సాధించాడు. ఈ సీరీస్ లోని ఐదవ టెస్టులో ఇమ్రాన్ ఖాన్ బౌన్సర్ కు సిక్సర్ కొట్టిన సంఘటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సమయంలో అతడు మంచి బౌలర్ మరియు ఫీల్డర్ కూడా. రోజర్ బిన్నీ భారతదేశం తరఫున ఆడిన తొలి [[ఆంగ్లో-ఇండియన్]]. [http://content-usa.cricinfo.com/ci/content/current/story/149642.html].
==టెస్ట్ గాణాంకాలుగణాంకాలు==
రోజర్ బిన్నీ భారత్ తరఫున 27 టెస్టులకు ప్రాతినిద్యం వహించి 23.05 సగటుతో 830 పరుగులు సాధించాడు. ఇందులో 5 అర్థ సెంచరీలు కలవు. టెస్ట్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 83 నాటౌట్. బౌలింగ్ లో 32.63 సగటుతో 47 వికెట్లు సాధించాడు. రెండు సార్లు ఇన్నింగ్సులో 5 వికెట్లు సాధించిన ఘనత పొందినాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ 56 పరుగులకు 6 వికెట్లు.
==వన్డే గణాంకాలు==
72 వన్డే లకు ప్రాతినిద్యం వహించిన బిన్నీ 16.12 సగటుతో మొత్తం 629 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్థ సెంచరీ కలదు. వన్డేలో అతని అత్యధిక స్కోరు 57 పరుగులు. బౌలింగ్లో 29.35 సగటుతో 77 వికెట్లు సాధించాడు. వన్డేలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 29 పరుగులకు 4 వికెట్లు.
==ప్రపంచకప్ లో ప్రాతినిద్యం==
 
భారతదేశం గెలుపొందిన 1983 ప్రపంచ కప్ క్రికెట్ జట్టులో రోజర్ బిన్నీ ప్రాతినిద్యం వహించాడు. ఈ కప్ లో 18 వికెట్లు సాధించి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా అవతరించడమే కాకుండా భారత్ కప్ గెల్వడానికి కారకుడైనాడు. ఆ తర్వాత 1987 ప్రపంచ కప్ క్రికెట్ లో కూడా ప్రాతినిద్యం వహించాడు.
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/రోజర్_బిన్నీ" నుండి వెలికితీశారు