ఆల్బర్ట్ స్విట్జర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 22:
 
== వైద్యం ==
1912 సంవత్సరంలో స్విట్జర్ తన స్వంత ఖర్చులతో [[ఆఫ్రికా]]లోని [[లాంబరీని]]లోలాంబరీనిలో నున్న పారిస్ మిషనరీ సొసైటీలో వైద్యునిగా పనిచేయడానికి నిర్ణయించుకొన్నాడు. అప్పుడు అదొక [[ఫ్రెంచి]] కాలనీ. సంగీత కార్యక్రమాలు నిర్వహించి నిధులు పోగుచేశాడు. అందుకు ప్రముఖ సంగీతకారుడు [[బాచ్]] (Bach) కూడా చాలా సహాయం చేశాడు.<ref>''From the Primeval Forest'', Chapter 1.</ref> 1913 సంవత్సరంలో భార్యతో సహా సుమారు 200 మైళ్ళ దూరం చిన్న తెప్పలో ప్రయాణించి హాస్పిటల్ నెలకొల్పడానికి ప్రయాణమయ్యాడు.<ref>''From the Primeval Forest'' Chapter 6.</ref> మొదటి తొమ్మిది నెలలు భార్యాభర్తలు సుమారు 2,000 మంది వ్యాధిగ్రస్తుల్ని పరీక్షించారు. కొంతమంది సుదూర ప్రాంతాల నుండి వచ్చినవారున్నారు. గాయాలనే కాకుండా గుండె సంబంధ వ్యాధుల్ని, అతిసారం, మలేరియా, అనేక రకాలైన జ్వరాలు, లెప్రసీ, మొదలైన చాలా రకాల వ్యాధులకు వైద్యం చేశారు.
 
భార్య ఫ్రా స్విట్జర్ ఇతనికి మత్తుమందు సహాయకులుగా ఉండేవారు. కోళ్ళ ఫారమ్ లో ప్రారంభించిన సేవ, అనతికాలంలోనే ఇనుముతో నిర్మించిన రెండు గదుల మొదటి వైద్యశాలకు తరలించారు. స్విట్జర్లు సొంత బంగళాలో నివసించేవారు. వీరు జోసెఫ్ అనే [[ఫ్రెంచి]] మాట్లాడగలిగే వాన్ని సహాయకుడిగా చేర్చుకున్నారు.<ref>''From the Primeval Forest'', Chapters 3-5.</ref>
 
[[దస్త్రం:Bassin versant de l'Ogooué-fr.svg|thumb|right|200px|The watershed of the Ogooé occupies most of Gabon. [[లాంబరీని]] గుర్తించబడినది.]]
పంక్తి 32:
1924 సంవత్సరంలో ఒంటరిగా తిరిగి గాబన్ చేరాడు. కొందరు వైద్యుల సహాయంతో వైద్యసేవలు కొనసాగించాడు. వారిలో డా.విక్టర్ నెస్మాన్ ముఖ్యుడు.<ref>Dr. Nessmann worked with the [[French Resistance]] during the war and was tortured and killed by the [[Gestapo]] in [[Limoges]] in 1944. cf Guy Penaud, ''Dictionaire Biographique de Perigord'', p. 713. ISBN 2-86577-14-4.</ref> ఆతని తరువాత డా.ట్రెంజ్ వీనితో చేరాడు. ముందుకాలంలో పనిచేసిన జోసెఫ్ తిరిగి కలిసాడు. 1925-6 లో కొత్త హాస్పిటల్ నిర్మించాడు, తెల్లవారి కోసం ప్రత్యేకంగా ఒక వార్డు తో సహా. కరువు మరియు అతిసారం ప్రబలడంతో అక్కడి పనివారితోనే హాస్పిటల్ నిర్మాణం కొనసాగించాడు. డా.ట్రెంజ్ సహాయంతో ప్రయోగాలు చేయడం కూడా మొదలుపెట్టారు. హాస్పిటల్ నడుస్తుండగా 1927లో స్విట్జర్ యూరప్ తిరిగి వచ్చాడు.
 
స్విట్జర్ మళ్ళీ 1929-1932 మధ్యకాలంలో గాబన్ వెళ్ళి సేవచేశాడు. ఈతని పేరుప్రఖ్యాతులు [[ఐరోపా|యూరప్]] అంతా వ్యాపించాయి. మళ్ళీ 1937 లో వచ్చి [[రెండవ ప్రపంచ యుద్ధం]] ముగిసేవరకు అక్కడే ఉన్నాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆల్బర్ట్_స్విట్జర్" నుండి వెలికితీశారు