బెంగుళూరు నాగరత్నమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
==సంగీత సేవ==
[[కర్ణాటక]] సంగీతములో నాగరత్నమ్మ తనదైన ఒక కొత్త బాణీని సృష్టించుకొన్నది. ఆమెకు త్యాగరాజ కృతులంటే ఎంతో ఇష్టము. [[సాహిత్యము]]ను చక్కగా అర్థము చేసికొని హృదయములో హత్తుకొనేటట్లు పాడగలిగేది. [[మాతృభాష]] [[కన్నడము]] లోని దేవరనామములు ఆసక్తిగా పాడేది. అమె గళములో స్త్రీ కంఠములోని మాధుర్యముతో పాటు పురుష స్వరపు గాంభీర్యము కూడ మిళితమై వినసొంపుగా ఉండేది. [[సంగీతము|సంగీత]] శాస్త్రాధ్యయనముతో బాటు నాట్య, అభినయ శాస్త్రములలో ఆమెకు పరిచయము ఉన్నందువలన ఆమె [[సంగీతము]] భావభరితము . ఆమె కచ్చేరులలో స్వరకల్పన కన్న రాగాలాపనకు ప్రాముఖ్యత అధికము. యదుకుల కాంభోజి రాగము పాడని కచ్చేరీలు అరుదు.
 
==సాహిత్య సేవ==
నాగరత్నమ్మ మాతృభాష [[కన్నడ భాష|కన్నడము]] అయిననూ [[సంస్కృతము]], [[తెలుగు]]<nowiki/>ము, [[తమిళ భాష|తమిళ]] భాషలలో ప్రావీణ్యమును గడించింది. [[తిరుపతి వేంకటకవులు]] రచించిన శ్రవణానందము అనే పుస్తకములో [[ముద్దు పళని]] విరచితమగు [[రాధికా సాంత్వనము]] గురించి చదివి ఆ పుస్తకమును కొని చదువగా అందులో చాల తప్పులున్నాయని గ్రహించింది. వ్రాతప్రతులకు ముద్రిత ప్రతులకు చాల తేడాలున్నాయి. వ్రాతప్రతులన్నీ సంపాదించి 1911లో వావిళ్ళవారిచే పరిష్కృత పుస్తకము ప్రచురింపచేసింది. పుస్తకములో బూతు పద్యాలున్నాయని బ్రిటీష్ ప్రభుత్వము అభియోగము చేసింది. ప్రసిద్ధులైన కవులు, పండితులు, న్యాయవాదులు వావిళ్ళ వారి తరఫున అర్జీ పెట్టుకొన్నారు. అయినా బ్రిటిష్ ప్రభుత్వము పట్టు విడవలేదు. వావిళ్ళ దుకాణాలపై దాడి 1927లో జరిగింది. భారతదేశానికి [[స్వాతంత్ర్యము]] వచ్చిన తరువాత టంగుటూరు ప్రకాశం పంతులు గారి హయాములో బహిష్కారము తొలగించబడింది. ఆ సమయానికి నాగరత్నమ్మ తిరువైయ్యూరులో ఒక యోగినిగా మారింది.
ఈమె రచించిన గ్రంథములు కొన్ని: 1. శ్రీ త్యాగరాజ అష్టోత్తర శతనామావళి (సంస్కృతం),2. మద్యపానం (తెలుగు సంభాషణం), 3. దేవదాసీ ప్రబోధ చంద్రోదయం (తెలుగు), 4. పంచీకరణ భౌతిక వివేక విలక్కం(తమిళం)