కమలిని ముఖర్జీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
== బాల్యం, నాటకాభిలాష ==
 
కమలిని ముఖర్జీ (అసలు పేరు: రోష్ని లేక రోని) మార్చి 4, 1980 లో కలకత్తాలో జన్మించింది. ఇద్దరు చెల్లెళ్ళు. స్కూల్, కాలేజ్ లో నాటక ప్రదర్శనల తర్వాత [[ముంబై|ముంబాయి]] పట్టణంలో నాటకాల పై నిర్వహించిన అభ్యాస సదస్సులో పాల్గొన్నది. నాటకాలే కాకుండా, ఆధ్యాత్మిక పుస్తక పఠనం, [[చిత్రలేఖనం]] కమలినికి ప్రీతిపాత్రమైనవి. పెక్కు సంవత్సరాలు [[భరతనాట్యం|భరత నాట్యం]] అభ్యాసం చేసింది. నీల్‌కమల్ ప్లాస్టిక్ సామాన్లు, పారాచూట్ కోబ్బరి నూనె, ఫైర్ అండ్ లవ్లీ క్రీం ఇంకా ఆయుష్ వ్యాపార ఉత్పత్తుల ప్రకటన చిత్రాలలో నటించింది.
 
== సినిమాలలో అవకాశం ==
 
కమలినిని ఒక ప్రకటన చిత్రంలో చూసిన దర్శకురాలు రేవతి తన ఫిర్ మిలేంగే (2004) [[హిందీ సినిమా రంగం|హిందీ]] చిత్రంలో అవకాశమిచ్చింది. ఎయిడ్స్ కథా నేపథ్యంలో సాగె ఈ చిత్రానికి చాలా బహుమతులు వచ్చాయి. ఇంగ్లీష్ లిట్ (డిగ్రీ) చదివిన కమలినికు [[కవిత్వం]] రాయటం ఇష్టం. Thoughts, Confusion and Solitude అనే కవితలను poetry.com లో ప్రచురించింది. తన కవిత అంతర్జాతీయ కవితల పోటీలో ఎంపికయిన సందర్భంలో, [[వాషింగ్టన్, డి.సి.|వాషింగ్టన్]] లో (దలైలామా ఆధ్వర్యాన) నిర్వహించిన కవితా సదస్సుకు ఆహ్వానించిన 150 మందిలో కమలిని ఉంది. అదే సమయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాలో కథానాయిక అవకాశం రావటంతో [[సినిమా]] వైపే మొగ్గు చూపింది.
 
== అవార్డులు ==
 
ఆనంద్, గోదావరి ఇంకా గమ్యం చిత్రాలలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. [[తెలుగు సినిమా|తెలుగు]] చిత్రాలతో పాటు [[హిందీ సినిమా రంగం|హిందీ]], తమిళ్[[తమిళ సినిమా|తమిళ]], [[మలయాళం]] ఇంకా [[కన్నడ సినిమా రంగం|కన్నడ]] చిత్రాలలో నటించింది. ఆనంద్ చిత్రంలో రూప పాత్రలో కనపరచిన నటనకు ఉత్తమ నటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వపు [[నంది పురస్కారాలు|నంది బహుమతినిబహుమతి]]<nowiki/>ని గెలుచుకుంది.
 
== నటించిన తెలుగు చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/కమలిని_ముఖర్జీ" నుండి వెలికితీశారు