కృతి సనన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
== సినీ జీవితం ==
హిందీలో[[హిందీ సినిమా రంగం|హిందీ]]<nowiki/>లో ఎన్నో కమర్షియల్సులో నటించిన కృతి సనన్ [[ఘట్టమనేని మహేశ్ బాబు|మహేష్ బాబు]] నటించిన ''[[1 - నేనొక్కడినే]]'' సినిమాతో తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలుత ప్రముఖ నటి [[కాజల్ అగర్వాల్]] ఈ సినిమాలో కథానాయికగా ఎన్నుకోబడ్డా డేట్స్ ఖాళీ లేక, ఉన్నవి సద్దుబాటు చెయ్యలేకపోయింది.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/gossip/2012/09/kajal-of-mahesh-sukumar-s-film-106015.html|title=మహేష్ సినిమా నుంచి కాజల్ అవుట్ ?|publisher=వన్ఇండియా|date=September 23, 2012|accessdate=April 21, 2014}}</ref> ఈ సినిమాలో నటించడానికి మొగ్గుచూపినా ఎలాంటి గొడవ లేకుండా సినిమా నుంచి తప్పుకుంది. ఆ సమయంలో దర్శకుడు [[సుకుమార్]] ఈమెని కథానాయికగా ఎంచుకున్నారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/kriti-sanon-confirmed-for-mahesh-babu.html|title=మహేష్ బాబు హీరోయిన్ ఆ అమ్మాయే|publisher=123తెలుగు.కామ్|date=January 13, 2013|accessdate=April 21, 2014}}</ref> ఈ సినిమాలో కృతి ఒక జర్నలిస్ట్ పాత్రను పోషించింది. సంక్రాంతి కానుకగా 2014లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను రాబట్టినా కృతి మాత్రం సానుకూల స్పందనను రాబట్టగలిగింది. [[సాక్షి (దినపత్రిక)|సాక్షి దినపత్రిక]] తమ సమీక్షలో "కృతి సనన్ జర్నలిస్ట్‌గా, గౌతమ్ ప్రేయసి సమీరగా పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో కొంత ప్రాధాన్యం ఉన్న పాత్ర కృతి సనన్‌కు దక్కింది. కొత్త నటి అనే ఫీలింగ్‌ను కలిగించకుండా కృతి బాగానే జాగ్రత్త పడింది" అని వ్యాఖ్యానించారు.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/1-nenokkadine-mahesh-babu-steals-the-show-96193|title=సినిమా రివ్యూ: ’1’ నేనొక్కడినే|publisher=[[సాక్షి (దినపత్రిక)|సాక్షి]]|date=January 12, 2014|accessdate=April 21, 2014}}</ref>
 
ఆపై హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ తొలి చిత్రమైన హీరోపంతి సినిమా ద్వారా హిందీలో కథానాయికగా అడుగుపెట్టింది. ఈ సినిమా జాకీ ష్రోఫ్ నటించిన హీరో [[సినిమా]] రీమేక్ అయినప్పటికీ అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమా ఛాయలు కూడా ఇందులో కనపడటం ఆశ్చర్యం ఎందరికో కలిగించింది.<ref>{{cite web|url=http://www.10tv.in/news/10max/Heroine-Kriti-Sanon-to-act-with-Tiger-Shroff-35959|title='టైగర్' తో నటించే ఛాన్స్ కొట్టిన 'వన్' భామ..!|publisher=10టీవీ.ఇన్|date=April 7, 2014|accessdate=April 21, 2014}}</ref><ref>{{cite web|url=http://www.filmybuzz.com/view-1798-gossips.html|title=అల్లు అర్జున్ 'పరుగు' టైగర్ చేస్తున్నాడా?|publisher=ఫిల్మీబజ్|date=April 6, 2014|accessdate=April 21, 2014}}</ref> ఆ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ఇంతలోనే [[అల్లు అర్జున్]] కథానాయకుడిగా త్రివిక్రం దర్శకత్వం వహిస్తున్న సినిమాలో సమంతతో పాటు నటిస్తున్న మరో ఇద్దరు కథానాయికల్లో ఒకరిగా కృతి ఎన్నుకోబడింది.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/gossip/kriti-sanon-will-be-1-the-heroines-bunny-trivi-film-133880.html|title=మహేష్ '1' హీరోయిన్ పెద్ద ఆఫరే పట్టింది|publisher=వన్ఇండియా|date=April 13, 2014|accessdate=April 21, 2014}}</ref>
 
== నటించిన చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/కృతి_సనన్" నుండి వెలికితీశారు