"యస్. వి. యస్. రామారావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''యస్.వి.యస్. రామారావు''' తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కళా దర్శకుడు. ఇతని పూర్తి పేరు శీలంశెట్టి వెంకట శ్రీరామారావు. ఇతడు [[బందరు]] లోని [[ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం|జాతీయ కళాశాల]]లో చదువుకున్నాడు. ఇతడు మంచి పెయింటర్. ఇతడు వేసిన చిత్రాలలో 'లంబాడీ కన్య' అనే వర్ణచిత్రం ఎన్నదగినది. ఇతడు ఎన్నో ఆర్ట్ ఎగ్జిబిషన్‌లలో తన చిత్రాలను ప్రదర్శించి అనేక బహుమతులు అందుకున్నాడు. 1934లో ఇతడు వేసిన ఒక పెయింటింగ్‌కు "గ్రిగ్ మెమోరియల్ మెడల్" లభించింది. ఈ బహుమతిని పుచ్చుకున్న మొట్టమొదటి భారతీయుడు ఇతడే. ఇతడు ఫ్రీ స్టయిల్ పెయింటింగులో సిద్ధహస్తుడు. ఇతనికి ఆధునిక చిత్రకళ పట్ల కొంత అయిష్టం ఉండేది. [[బందరు]]కే చెందిన [[పినపాల వెంకటదాసు|పి.వి.దాసు]] ఇతడిని సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. పి.వి.దాసు తన వేల్స్ పిక్చర్స్ స్టూడియోలో ఇతడిని కళా దర్శకత్వ శాఖలో చేర్చుకున్నాడు. ఇతడు కళాదర్శకత్వం వహించిన తొలి సినిమా [[శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా)|శ్రీకృష్ణ లీలలు]]. ఇతనికి గొప్ప పేరు తెచ్చిపెట్టిన చిత్రం 1960లో విడుదలైన [[శ్రీ వెంకటేశ్వర మహత్యం]]. ఈ చిత్రానికి సెట్సు, కాస్ట్యూములు తయారు చేయడంలో ప్రతిభ చూపించాడు. స్టుడియోలో వెంకటేశ్వరుని విగ్రహానికి నిజమైన విగ్రహంలోని నగల్లాంటి నగలను తయారు చేయడానికి చాలా శ్రమించాడు. ఫలితంగా ఆ చిత్రం చూసినవాళ్లవ్వరూ అది స్టూడియో విగ్రహమని నమ్మలేదు. [[బాలరాజు]] సినిమాలో హీరో పాత్రకు ఇతడు సృష్టించిన 'మీసం' స్టయిలు ఎంతో మందికి నచ్చింది. ఆ రోజుల్లో చాలామంది ఈ మీసాన్ని అనుకరించారు. ఇతడు నిర్మాతగా కూడా మారి రెండు చిత్రాలను నిర్మించాడు. 1970లో ఇతడు మరణించాడు.
'''యస్.వి.యస్. రామారావు''' తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కళా దర్శకుడు. ఇతని పూర్తి పేరు శీలంశెట్టి వెంకట శ్రీరామారావు. ఇతడు [[బందరు]] లోని [[ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం|జాతీయ కళాశాల]]లో చదువుకున్నాడు.
 
==చిత్ర సమాహారం==
# 1935 : [[శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా)|శ్రీకృష్ణ లీలలు]]
# 1936 : [[ద్రౌపదీ వస్త్రాపహరణం]]
# 1938 : [[గృహలక్ష్మి (1938 సినిమా)|గృహలక్ష్మి]]
# 1938 : [[మాలపిల్ల]]
# 1939 : [[రైతుబిడ్డ (1939 సినిమా)|రైతుబిడ్డ]]
# 1939 : [[వందేమాతరం (1939 సినిమా)|వందేమాతరం]]
# 1942 : [[సీతారామ జననం]]
# 1946 : [[బాలరాజు]]
# 1946 : [[ముగ్గురు మరాటీలు]]
# 1947 : [[మాయలోకం]]
# 1947 : [[యోగివేమన (1947 సినిమా)|యోగివేమన]]
# 1948 : [[బాలరాజు]]
# 1950 : [[స్వప్న సుందరి]]
# 1952 : [[చిన్న కోడలు (1952 సినిమా)|చిన్న కోడలు]]
# 1952 : [[ధర్మదేవత]]
# 1957 : [[వినాయక చవితి (సినిమా)|వినాయకచవితి]]
# 1957 : [[సారంగధర (1957 సినిమా)|సారంగధర]]
# 1960 : [[దీపావళి (సినిమా)|దీపావళి]], [[శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం]]
# 1960 : [[శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం]]
[[వర్గం:తెలుగు సినిమా కళా దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2105117" నుండి వెలికితీశారు