ద్వారకా తిరుమల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 112:
==ప్రధానాలయం==
[[File:Annamayya statue.jpg|left|thumb|ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలోని మండపంలో [[అన్నమయ్య]] విగ్రహం]]
ప్రస్తుతము ఉన్న గుడిని [[మైలవరం (కృష్ణా జిల్లా)|మైలవరం]] జమీందారులు కట్టించారు. [[విమానము]], మంటపము, గోపురము, ప్రాకారాలను [[ధర్మా అప్పారావు]] (1762-1827) కాలంలో కట్టించారు. [[బంగారు]] ఆభరణాలు, [[వెండి]] వాహనాలు రాణీ చిన్నమ్మరావు (1877-1902) సమర్పించారు.
[[Image:Chinnatirupathi 5.JPG|left|thumb|100px|గర్భాలయానికి ఎదురుగా ద్వారక మహర్షి విగ్రహం]]
[[బొమ్మ:Garuda Dwarakatirumala.JPG|thumb|100px|right|ద్వారకాతిరుమల కొండ క్రింద [[గరుడుడు|గరుడ]] విగ్రహం]].
పంక్తి 118:
స్థల పురాణము ప్రకారము ఈ క్షేత్రము రాముని తండ్రి [[దశరథ మహారాజు]] కాలము నాటిదని భావిస్తారు. "ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది. [[విశిష్టాద్వైతం|విశిష్టాద్వైత]] బోధకులైన శ్రీ [[రామానుజాచార్యులు]] ఈ క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధృవమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ [[పురుషార్థాలు|పురుషార్ధములు]] సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.
 
ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక విశేషము. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి [[విగ్రహము]] క్రిందనున్న ఎర్రచీమలను కదుల్చును. ఈ గుడి యొక్క సంప్రదాయము ప్రకారము ప్రతియేటా రెండు కళ్యానోత్సవములు వైశాఖ మరియు ఆశ్వయిజ మాసములలో జరుపుతారు. ఇందుకు కారణం- స్వయంభూమూర్తి వైశాఖమాసంలో[[వైశాఖమాసము|వైశాఖమాసం]]<nowiki/>లో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారనీ చెబుతారు.
 
గుడి ప్రవేశంలో కళ్యాణ మంటపం ఉంది. మంటపం దాటి మెట్లు ఎక్కే ప్రాంభంభంలో (తొలిపమెట్టు వద్ద) పాదుకా మండపంలో స్వామి పాదాలున్నాయి. శ్రీపాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు ప్రక్కలా [[దశావతారములు|దశావతారముల]] విగ్రహములు ప్రతిష్ఠింపబడినవి. మెట్లకు తూర్పునైపున అన్నదాన సత్రం, ఆండాళ్ సదనం ఉన్నాయి. పడమటివైపు పద్మావతి సదనం, దేవాలయం కార్యాలయం, నిత్యకళ్యాణ మండపం ఉన్నాయి.
పంక్తి 125:
ప్రధాన ద్వారం లోపల ఇరువైపుల, గర్భగుడికి అభిముఖంగా, ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం పైభాగాన (లోపల) సప్తర్షుల విగ్రహాలున్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకొని 12 మంది [[ఆళ్వారులు|ఆళ్వారుల]] ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణా మార్గంలో దీపారాధన మంటపం ఉంది. ప్రధాన మందిరంలో [[ఆంజనేయస్వామి]], [[గరుత్మంతుడు|గరుడస్వామి]]ల చిన్న మందిరాలు (ధ్వజస్తంభం వెనుక) ఉన్నాయి.
 
గర్భగుడిలో[[గర్భగుడి]]<nowiki/>లో స్వయంభూ వేంకటేశ్వర స్వామి, ప్రతిష్ఠింపబడిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నులపండువుగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, అండాళ్ (శ్రీదేవి, భూదేవి) అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమపూజ చేస్తారు.
[[File:South gopuram of Dwaraka Tirumala temple.jpg|thumb|right|ప్రధాన ఆలయపు గాలి గోపురం.]]
 
పంక్తి 135:
;పుష్కరిణి
గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరమని, కుమార తీర్ధమనీ అంటారు. ఇక్కడ చక్ర తీర్ధము, రామ తీర్ధము అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్ళపై సుదర్శన (చక్రం) ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. 199లో పుష్కరిణి మధ్య మడపం నిర్మించారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి) నాడు [[తెప్పోత్సవం]] జరుపుతారు.
గ్రామం లోపల విలాస మండపం, క్షీరాబ్ది మండపం, ఉగాది మండపం, దసరా మండపం, సంక్రాంతి మండపం అనే కట్టడాలు వేరువేరు చోట్ల ఉన్నాయి. పర్వదినాలలో తిరువీధుల సేవ జరిగినపుడు ఆయా మండపాలలో స్వామిని "వేంచేపు" చేసి, [[అర్చన]], ఆరగింపు, [[ప్రసాదం|ప్రసాద]] వినియోగం జరుపుతారు.
[[File:Dwaraka-maharshi.jpg|thumb|ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ద్వారకా మహర్షి విగ్రహం]]
 
పంక్తి 149:
* '''తిరుకళ్యాణోత్సవాలు''' - వైశాఖమాసం (శుద్ధ దశమి నుండి నిదియ వరకు) మరియు ఆశ్వయుజమాసం (విజయ దశమి నుండి విదియ వరకు) - అలంకరణ, సాంస్కృతిక ఉత్సవాలు, భజనలు, ఉపన్యాసాలు, కళ్యాణోత్సవం, రథోత్సవం వంటివి
* '''పవిత్రోత్సవాలు''' - శ్రావణ మాసంలో - శుద్ధ త్రయోదశినుండి మూడు రోజులు - పూర్ణిమనాడు పూర్ణాహుతి
* '''తెప్పోత్సవం''' - కార్తీక మాసం [[క్షీరాబ్ధి ద్వాదశి]] నాడు - సుదర్శన పుష్కరిణిలో * '''అధ్యయన ఉత్సవాలు''' - మార్గశిరమాసం - [[ధనుర్మాసం]] నెల రోజులు ఉదయం తిరువీధి సేవ- ముక్కోటి ఏకాదశినాడు ఉత్తరద్వార దర్శనం, తరువాత 11 రోజులు అధ్యయన ఉత్సవం మరియు రాత్రి తిరువీధి సేవ.
* '''గోదా కళ్యాణం''' - పుష్యమాసం - భోగి నాడు- మరియు తిరువీధి సేవ
* '''గిరి ప్రదక్షిణము''' - పుష్యమాసం - కనుమ నాడు- తిరువీధి సేవలో స్వామివారు గ్రామం పొలిమేర దాటి [[దొరసానిపాడు]]లో ప్రత్యేక మండపంలో అర్చన, ప్రసాదానంతరం గిరిప్రదక్షిణ పూర్వకంగా ద్వారకా తిరుమల గ్రామంలో ప్రవేశిస్తారు.
పంక్తి 155:
 
==ఇతర ఆలయాలు==
'''భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఆలయం''' : కొండపైన[[కొండ]]<nowiki/>పైన ప్రధానాలయానికి నాయువ్య దిశలో కొద్దిదూరంలోనే కొండమల్లేశ్వరస్వామి, భ్రమరాంబికల ఆలయం ఉంది. భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి [[క్షేత్ర పాలకుడు]]. మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉన్నదనీ, తలపైన శివుడు, తోక పైన విష్ణువు కొలువు తీరారనీ చెబుతారు. ఈ దేవాలయంలో గణపతి, భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి కొలువుతీరు ఉన్నారు. నవగ్రహ మందిరం కూడా ఉంది. ఆలయం తూర్పున "శివోద్యానం" అనే పూలతోట ఉంది. సమీపంలోనే టూరిజమ్ డిపార్ట్‌మెంటు వాఱి "పున్నమి" అతిథి గృహం ఉంది. ఇటీవలి కాలంలో కొడపైభాగాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
 
[[Image:Chinnatirupathi 10.JPG|right|thumb|150px|కుంకుళ్ళమ్మవారి గుడి వద్దనున్న ఒక బోర్డు]]
పంక్తి 162:
'''వెంకటేశ్వర స్వామి, జగన్నాధ స్వామి ఆలయాలు''' : ద్వారకా తిరుమలకు 2 కి.మీ. దూరంలో, భీమడోలు మార్గంలో ఉన్నాయి. హవేలి లింగపాలెం గ్రామ పరిధిలో సుమారు 130 సంవత్సరాల క్రితం పూరీ (ఒడిషా)కి చెందిన "మంత్రరత్నం అమ్మాజీ" అనబడే లక్ష్మీదేవి అనే భక్తురాలు ఇక్కడ తమ ఇలవేల్పు వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మింపజేసింది. అప్పటినుండి ఆ గ్రామానికి లక్ష్మీపురం అనే పేరు వాడుకలోకి వచ్చింది. వారిది పూరీ జగన్నాధమఠం కనుక జగన్నాధ స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లు, జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్ర, ఆళ్వారుల సన్నిధులు ఉన్నాయి. ద్వారకా తిరుమలను ఎగువ తిరుపతిగాను, ఈ లక్ష్మీపురాన్ని దిగువ తిరుపతిగాను భక్తులు భావిస్తారు. తిరుగు ప్రయాణంలో ఈ స్వామిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీ. 1992లో ఈ ఆలయాన్ని నిర్వహణ కొరకు ద్వారకాతిరుమల దేవస్థానానికి అప్పగించారు.
 
కొండక్రింద గ్రామంలో సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. [[పుష్కరిణి]] మార్గంలో ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. [[ఉగాది]] మండపం ఎదురుగా రామాలయం ఉమ్మది.
 
==చూదదగిన ప్రదేశాలు==
* భ్రమారంబా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శివోద్యానం అనే తోట ఉంది. [[పుష్కరిణి]] మార్గంలో నందనవనం అనే తోటను, ప్రధానాలయం వెనుక నారాయణ వనం అనే తోటను పెంచుతున్నారు.
* [[భీమడోలు]]వద్ద స్వామివారి నమూనా [[ఆలయం]] ఉంది.
 
==మండల గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/ద్వారకా_తిరుమల" నుండి వెలికితీశారు