యస్. వి. యస్. రామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
'''యస్.వి.యస్. రామారావు''' తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కళా దర్శకుడు.
==విశేషాలు==
ఇతని పూర్తి పేరు శీలంశెట్టి వెంకట శ్రీరామారావు. ఇతడు [[బందరు]] లోని [[ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం|జాతీయ కళాశాల]]లో చదువుకున్నాడు<ref>{{cite journal|last1=పి.|first1=పుల్లయ్య|title=ఇద్దరు కళాదర్శకులు|journal=విజయచిత్ర|date=1 JuneJuly 1970|volume=5|issue=1|pages=32-33|accessdate=29 April 2017}}</ref>. ఇతడు మంచి పెయింటర్. ఇతడు వేసిన చిత్రాలలో 'లంబాడీ కన్య' అనే వర్ణచిత్రం ఎన్నదగినది. ఇతడు ఎన్నో ఆర్ట్ ఎగ్జిబిషన్‌లలో తన చిత్రాలను ప్రదర్శించి అనేక బహుమతులు అందుకున్నాడు. 1934లో ఇతడు వేసిన ఒక పెయింటింగ్‌కు "గ్రిగ్ మెమోరియల్ మెడల్" లభించింది. ఈ బహుమతిని పుచ్చుకున్న మొట్టమొదటి భారతీయుడు ఇతడే. ఇతడు ఫ్రీ స్టయిల్ పెయింటింగులో సిద్ధహస్తుడు. ఇతనికి ఆధునిక చిత్రకళ పట్ల కొంత అయిష్టం ఉండేది. [[బందరు]]కే చెందిన [[పినపాల వెంకటదాసు|పి.వి.దాసు]] ఇతడిని సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. పి.వి.దాసు తన వేల్స్ పిక్చర్స్ స్టూడియోలో ఇతడిని కళా దర్శకత్వ శాఖలో చేర్చుకున్నాడు. ఇతడు కళాదర్శకత్వం వహించిన తొలి సినిమా [[శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా)|శ్రీకృష్ణ లీలలు]]. ఇతనికి గొప్ప పేరు తెచ్చిపెట్టిన చిత్రం 1960లో విడుదలైన [[శ్రీ వెంకటేశ్వర మహత్యం]]. ఈ చిత్రానికి సెట్సు, కాస్ట్యూములు తయారు చేయడంలో ప్రతిభ చూపించాడు. స్టుడియోలో వెంకటేశ్వరుని విగ్రహానికి నిజమైన విగ్రహంలోని నగల్లాంటి నగలను తయారు చేయడానికి చాలా శ్రమించాడు. ఫలితంగా ఆ చిత్రం చూసినవాళ్లవ్వరూ అది స్టూడియో విగ్రహమని నమ్మలేదు. [[బాలరాజు]] సినిమాలో హీరో పాత్రకు ఇతడు సృష్టించిన 'మీసం' స్టయిలు ఎంతో మందికి నచ్చింది. ఆ రోజుల్లో చాలామంది ఈ మీసాన్ని అనుకరించారు. ఇతడు నిర్మాతగా కూడా మారి రెండు చిత్రాలను నిర్మించాడు. 1970లో ఇతడు మరణించాడు.
 
==చిత్ర సమాహారం==