శ్రీశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 113:
* ఉక్కు పిడికిలి, అగ్నిజ్వాల - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001
* ఖబర్దార్ సంఘ శత్రువు లారా - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001
* ప్సామవేదం అనువాద కవిత <ref name="ప్సామవేదం">[http://pustakam.net/?p=19615 ప్సామవేదం – శ్రీశ్రీ – అనువాద కవిత]</ref>
 
===సినిమా రంగం===
ఇతడు మద్రాసులో ఉండడంతోనూ, ఆధునిక కవి కావడంతోనూ సినిమావారి పరిచయం బాగా వుండేది. ప్రత్యక్షంగా సినిమాలతో సంబంధం లేకపోయినా పరోక్షంగా సంబంధం వుండేది. 1950లో ఆ సంబంధం పూర్తిగా ప్రత్యక్షమయ్యింది<ref>{{cite journal|last1=కళానిధి|title=శ్రీశ్రీ|journal=విజయచిత్ర|date=1 May 1970|volume=4|issue=11|pages=46-49|accessdate=28 April 2017}}</ref>. తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా [[ఆహుతి (1950 సినిమా)|ఆహుతి]]కి ఇతడు మాటలు పాటలు వ్రాశాడు. ఇది హిందీ చిత్రం "నీరా ఔర్ నందా"కి ఈ సినిమా తెలుగు అనువాదం. కవిత్వంలో రకరకాల ఫీట్లు చెయ్యడం ఇతడికి తెలుగు కాబట్టి డబ్బింగ్ ఫీట్ కూడా ఈయనే చేయగల సమర్థుడని ఈ అవకాశం దక్కింది. ఇది డబ్బింగ్ సినిమా అయినా దీనిలో శ్రీశ్రీ మంచి పాటలు వ్రాశాడు. ఈ పాటల మూలంగానే ఇతడికి రోహిణి సంస్థలో [[హెచ్.ఎం.రెడ్డి]] నెలకు 300 రూపాయల జీతమిచ్చి ఇతనిని ఆస్థాన రచయితగా వేసుకున్నాడు. [[నిర్దోషి (1951 సినిమా)|నిర్దోషి]] సినిమాకు కొన్ని పాటలు వ్రాశాడు. మూనాన్ [[ప్రపంచం (సినిమా)|ప్రపంచం]] అనే సినిమా తీస్తూ ఇతడిని రచయితగా నెలకు 200 రూపాయలు జీతంతో నియమించుకున్నాడు. ఆ విధంగా ఇతడికి నెలకు 500 రూపాయలు రాబడి రావడంతో సినిమాలలో స్థిరపడ్డాడు. అలా ఈ ఉద్యోగాలు మూడేళ్ళపాటు సాగాయి.
"https://te.wikipedia.org/wiki/శ్రీశ్రీ" నుండి వెలికితీశారు