కాంచీపురం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ (2), అభ్యర్ధి → అభ్యర్థి using AWB
పంక్తి 52:
 
=== వరదరాజస్వామి దేవాలయం ===
1053 సంవత్సరం [[చోళులు]] ఈ ఆలయ నిర్మాణం జరిపారని తెలుస్తోంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని [[విష్ణుకంచి]] అని పిలుస్తారు. ఇక్కడ ఈ దేవాలయంలోనే [[రామానుజాచార్యులు]] నివసించారని చెబుతారు. ఈ దేవాలయం 23 ఎకరాల సముదాయంలో ఉంది. ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బంగారు బల్లి మరియు వెండి బల్లులు ఉన్నాయి. ఈ బల్లులను తాకితే మనిషి ఒంటిమీద బల్లి పడితే కలిగే దోషం పోతుందని నమ్మకం. దేవాలయ ప్రాకారం ఉండే అన్ని పైకప్పుల మీద బల్లులు చెక్కబడి ఉంటాయి. ఇతిహాసం ప్రకారం ఇక్కడ ఒక ఋషి కుమారున్ని, అతని తండ్రి దేవతార్చనకు నీళ్ళు తీసుకొని రమ్మనగా ఆ కుమారుడు తెలియక తీసుకొని వచ్చిన ఉదకంలో బల్లి కనిపిస్తుంది. తండ్రి దానికి కోపించి కుమారున్ని బల్లిగా మారిపొమ్మని శపిస్తాడు. తరువాత కుమారుడు వేడుకొనగా ఇక్కడ బల్లిగా వెలసి, అతన్ని ముట్టుకొంటే బల్లి ఒంటి మీద పడే పాపం పోయేటట్లు ఆశీర్వదిస్తాడు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి ఈ వెండి, బంగారు బల్లులు తాకి, తమ మీద బల్లి పడితే కలిగే దోషాన్ని నివారించుకొంటారు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఆసందసరోవరం మరియు బంగారు తామర తటాకం ఉన్నాయిఉbjన్నాయి. ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో జలాంతర్భగాన [[అత్తి]] చెక్కతో చేయబడిన అత్తి దేవతా మూర్తి విగ్రహాలు ఉంటాయి. ప్రతి 40 సంవత్సరాలకొకసారి కోనేరులో నుంచి తీసి 40 రోజులు దర్శనానికి అనుమతిస్తారు. 1979వ సంవత్సరంలో అత్తి శ్రీవరదరాజ పెరుమాళును [[కోనేరు]] నుంచి బయటకి తీసి దర్శనానికి అనుమతించారు.మళ్ళీ 2019వ సంవత్సరం జూన్ నేలలో అత్తి శ్రీవరదరాజ పెరుమాళును దర్శించగలం . ఈ దేవాలయ ప్రాకారాలు పదకొండొవ శతాబ్దం తరువాత చోళ రాజులైన మెదటి [[కుత్తోంగ చోళ]], విక్రమ చోళ తరువాత విజయనగర రాజుల చేత నిర్మించబడ్డాయి మరియు పునరుద్ధించబడ్డాయి. ఈ దేవాలయంలో కూడా వెయ్యి స్తంభాల మండపం ఉంది. ఇతిహాసం ప్రకారం ఇక్కడ వరదరాజస్వామిని [[కృత యుగము]]లో [[బ్రహ్మ]], [[త్రేతా యుగము]]లో గజేంద్రుడు, [[ద్వాపరయుగము]]లో [[బృహస్పతి]], [[కలి యుగము]]లో అనంతశేషుడు పూజించారని చెబుతారు. ఈ దేవాలయ మహాత్మ్యం '''హస్తిగిరి మహాత్మ్యం'''లో వివరించబడింది. ఇక్కడ మూలవిరాట్టుగా ఉన్న వరదరాజ పెరుమాళ్ విగ్రహం అత్యంత ఎత్తైన దేవతా విగ్రహాలలో రెండవది.<ref>{{cite web
|url = http://www.geocities.com/~kanchipuram/temples/varada.html|title = Kanchipuram on the web|archiveurl=http://web.archive.org/web/20000420005136/http://www.geocities.com/~kanchipuram/temples/varada.html|archivedate=2000-04-20}}</ref>.
 
"https://te.wikipedia.org/wiki/కాంచీపురం" నుండి వెలికితీశారు