అర్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
===కర్తవ్య పాలనలో===
[[దస్త్రం:Swayamvara Draupadi Arjuna Archery.jpg|thumb|250px|మత్స్య యంత్రాన్ని ఛేదిస్తున్న అర్జునుడు.]]
పాండవులు తమ ఉమ్మడి భార్యయైన ద్రౌపదితోద్రౌపది సంసార జీవనం సాగించడానికి కొన్ని విధి నియమాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నియమాల ప్రకారం ఒకరు [[ద్రౌపది]]<nowiki/>తో ఏకాంతంగా ఉన్నపుడు మరొకరు వారి ఏకాంతానికి భంగం కలిగించరాదు. ఇలా భంగం కలిగించిన వారికి ఏడాది పాటు బహిష్కరణ శిక్ష విధిస్తారు. పాండవులు ఇంధ్రప్రస్థాన్ని పరిపాలిస్తున్నపుడు ఒక సారి బ్రాహ్మణుడొకడు, అర్జునుని సహాయాన్ని అభ్యర్థించాడు. అతని పశుసంపదలను ఎవరో దొంగల ముఠా తోలుకెళ్ళారనీ, వారి నుంచి తన పశు సంపదను కాపాడమని అర్జునుని వేడుకొన్నాడు. కానీ అర్జునుని ఆయుధ సామాగ్రి మొత్తం ద్రౌపది మరియు యుధిష్టురుడు ఏకాంతంగా ఉన్న గదిలో ఉండిపోయి నందున వారికి భంగం కలిగించడం నియమాలకు వ్యతిరేకం కనుక సందిగ్ధంలో పడ్డాడు. కానీ సహాయార్థం వచ్చిన బ్రాహ్మణోత్తముని తిప్పి పంపటం [[క్షత్రియుడు|క్షత్రియ]] ధర్మం కాదు కాబట్టి ఆ శిక్ష గురించి జంకకుండా వారున్న గదిలోకి వెళ్ళి ఆయుధాలు తీసుకొని పశువులను దొంగలించిన వారికోసం వెళ్ళాడు. ఆ పని పూర్తయిన వెంటనే [[ధర్మరాజు]] మరియు [[ద్రౌపది]]తో సహా [[కుటుంబం]] మొత్తం వారిస్తున్నా ఒక సంవత్సరం పాటు తనకు తానే బహిష్కరణ విధించుకున్నాడు.
 
== అరణ్య వాసం మరియు అజ్ఞాతవాసం ==
"https://te.wikipedia.org/wiki/అర్జునుడు" నుండి వెలికితీశారు