ముత్తినేని లక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== జీవిత విశేషాలు ==
ఈవిడ చిన్నవయసులోనే శైవాగారి వద్ద నాట్యంలో శిక్షణ తీసుకున్నారు. వివిధ ప్రాంతాలలో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం కళా నాట్యమండలి పేరుతో ఒక నాట్యసంస్థను ప్రారంభించి, ఔత్సాహిక కళాకారులకు [[శిక్షణ]] ఇచ్చారు. విజయలక్ష్మి, కల్యాణి, శ్యామల, రజనీ, శ్రీవల్లీ మొదలైనవారు వీరి యొక్క నాట్యసంస్థలోనే శిక్షణ పొంది ప్రసిద్ధ నాట్యకళాకారులుగా గుర్తింపుపొందారు.
 
== రంగస్థల ప్రస్థానం ==
చిన్నవయసులోనే నాట్యాన్ని అభ్యసించినా చాలాకాలం వరకు నాటకరంగానికి రాలేదు. కొన్నేళ్ల తరువాత [[ప్రజానాట్యమండలి]] [[ఒంగోలు]] శాఖవారి [[అల్లూరి సీతారామరాజు]] నాటకంలో రత్తి పాత్రతో నాటకరంగంలోకి ప్రవేశించారు. ఈ నాటకంలో సాబ్జాన్, [[వల్లం నరసింహారావు]], లక్ష్మిపెరుమాళ్లు, ఇంద్రాణి వంటి ప్రముఖ రంగస్థల నటులు నటించారు.
 
ఇందిరా ప్రయదర్శిని ఆర్ట్ థియేటర్ ను ప్రారంభించి, గరీబ్ హటావో అనే నాటకాన్ని రాయించి, అనేక ప్రాంతాలలో ప్రదర్శించారు. ప్రస్తుతం శ్రీ పద్మాలయ కళా సమితి వారి శ్రీ తిరుపతమ్మ కథ నాటకంలో నటిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/ముత్తినేని_లక్ష్మి" నుండి వెలికితీశారు