కె.విశ్వనాథ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది [[శంకరాభరణం]]. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయం సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాడు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు. వాటిలో కొన్ని ''[[సాగరసంగమం]]'', ''[[శృతిలయలు]]'', ''[[సిరివెన్నెల]]'', ''[[స్వర్ణకమలం]]'', ''[[స్వాతికిరణం]]'' మొదలైనవి.
 
[[కుల వ్యవస్థ]], [[వరకట్నం]] వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ చిత్రాలు నిర్మించాడునిర్మించారు. [[సప్తపది]], [[స్వాతిముత్యం]], [[స్వయంకృషి]], [[శుభోదయం]], [[శుభలేఖ]], [[ఆపద్బాంధవుడు]], [[శుభసంకల్పం]] వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి.
 
శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. [[స్వాతిముత్యం]] సినిమా [[1986]]లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్ కు భారత ప్రభుత్వం [[పద్మశ్రీ]] పురస్కారమిచ్చి గౌరవించింది.
"https://te.wikipedia.org/wiki/కె.విశ్వనాథ్" నుండి వెలికితీశారు