యు.విశ్వేశ్వర రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''యు. విశ్వేశ్వర రావు''' తెలుగు సినిమా నిర్మాత మరియు [[దర్శకుడు|దర్శకులు]].
==విశేషాలు==
విశ్వేశ్వరరావు సంపన్నుల కుటుంబంలో జన్మించాడు. ఇతనికి మూడుసంవత్సరాల వయసు ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. మేనమామ ఇతనిని చేరదీశాడు. ఇతనికి 8 సంవత్సరాల వయసు వచ్చేవరకు అక్షరాభ్యాసం జరగలేదు. మొదట్లో ఇతడు మూడు సంవత్సరాల తరువాత చదువు ఆగిపోయింది. వ్యవసాయం చూసుకునే వాడు. ఇతని బావ దావులూరి రామచంద్రరావు ఇతడిని బాగా చదివించాలని నిర్ణయించాడు. ఫలితంగా ఇతడు తన 14వ యేటనుండి [[ముదినేపల్లి]], [[గుడివాడ]], [[ఏలూరు]], [[విజయనగరం|విజయనగరాల]]లో చదివి బి.ఎస్.సి.పట్టా సంపాదించాడు. తరువాత గుడివాడ హైస్కూలులో ఉపాధ్యాయుడిగా చేరాడు. తనకు చదువు చెప్పిన టీచర్ల సరసనే సహ ఉపాధ్యాయుడిగా పనిచేయడం అతనికి వింతగా అనిపించింది. సినిమా నిర్మాతలు [[అట్లూరి పూర్ణచంద్రరావు]], పి.రాఘవరావు గుడివాడ స్కూలులో ఇతని శిష్యులు. తరువాత గుడివాడలో జనతా ట్యుటోరియల్ ఇన్‌స్టిట్యూట్ స్థాపించి కొంతకాలం నడిపాడు. ఇతడికి విదేశాలలో వెళ్ళి చదువుకోవాలనే ఆసక్తి ఉండేది. కాని అతని బావ ప్రోద్బలంలో సినిమా రంగంలోనికి అడుగు పెట్టాడు.
 
మొదట ఇతడు [[పి.పుల్లయ్య]] వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా చేరాడు. [[కన్యాశుల్కం (సినిమా)|కన్యాశుల్కం]], [[జయభేరి]] చిత్రాలకు పుల్లయ్య వద్ద పనిచేశాడు. ఆ సమయంలో [[బాలనాగమ్మ (1959 సినిమా)|బాలనాగమ్మ]] సినిమాకు తమిళ డబ్బింగ్ హక్కులు కొని నిర్మాతగా మారాడు. ఆ చిత్రం విడుదలై అతడికి లాభాలు తీసుకువచ్చింది. దానితో అతడు విశ్వశాంతి అనే సంస్థను స్థాపించి 15 తమిళ, తెలుగు డబ్బింగ్ సినిమాలు నిర్మించాడు.
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/యు.విశ్వేశ్వర_రావు" నుండి వెలికితీశారు