రైతుబిడ్డ (1939 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
[[బొమ్మ:Raitu Bidda Still.JPG]]
==చిత్రకథ==
శావల్యాపురం అనే వూళ్ళో ఎన్నికల హడావిడి జరుగుతున్నది. జమీందారు అభ్యర్థి వెంకయ్య; అతని పోటీగా రైతు ప్రతినిధి రామిరెడ్డి నిలబడ్డారు. ఆ వూరికి దగ్గరగా వున్న నాగాపురం అనే వూళ్ళో కూడా రెండు పార్టీలున్నాయి. ఒకటి మునసబు పార్టీ, రెండోది కరణం పార్టీ. ఆ వూళ్ళోనే నర్సిరెడ్డి అనే రైతు ఉన్నాడు. భార్యాపుత్రులతో అతను తనకున్న పది ఎకరాల కొండ్రనూ సేద్యం చేసుకుంటూ జీవయాత్ర సాగిస్తున్నాడు. అతనంటే తక్కిన రైతులకు ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయి. అయితే నర్సిరెడ్డి ఆ గ్రామానికి చెందిన షావుకారు కనకయ్యకు కొంత బాకీ వున్నాడు. ఆ మిషతో షావుకారు, కరణం కలిసి శావల్యాపురం జమీందారు పక్షానికి ఓటెయ్యాలని నర్సిరెడ్డిని నిర్భంధించారు. నర్సిరెడ్డి ఒప్పుకోలేదు. "నేను రైతును. కాబట్టి రైతుపక్షానికే ఓటువేస్తాను" అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటకు షావుకారు కనకయ్య, కరణం కలిసి మండిపడ్డారు. "మా మాటనే ధిక్కరించాడని" షావుకారు, "మామాటను కాదన్నాడని" కరణం భావించుకున్నారు. అతని నిర్లక్ష్యానికి ఇద్దరూ రెచ్చిపోయారు. ఇద్దరూ కలిసి దొంగ పద్దులు రాసి నర్సిరెడ్డి ఖాతా పెంచారు. ఆ బాకీ కింద అతని భూమిని తాకట్టు పెట్టమని నర్సిరెడ్డిని బలవంతం చెయ్యసాగారు. భూమి తాకట్టు మాట వినేసరికి నర్సిరెడ్డి పాములా కస్సుమని లేచాడు. "సొంత భూమినీ, కన్న తల్లినీ ఇతరులకు వప్పగించడమా" ఆని ఉరిమాడు. దాంతో కరణం, షావుకారు మరింత రెచ్చిపోయి అతనిపై జమీందారుకు చాడీలు చెప్పారు. దాంతో జమీందారు ఆగ్రహించి, తన్ ఉద్యోగులను పంపి నర్సిరెడ్డి పశువులను దౌర్జన్యంగా తోలించాడు. అప్పటికీ నర్సిరెడ్డి తన పట్టు వదలక పోవడం చూసి, జమీందారు ఉద్యోగులు మరింత ఉగ్రులైనారు. నర్సిరెడ్డి తన కుమార్తెకు వివాహం నిశ్చయించున్నాడు. అందుచేత కాబోయే వియ్యంకుడి దగ్గరకెళ్ళి అతనిద్వారా అడిగించారు. నర్సిరెడ్డి ఆడిన మాట తప్పనన్నాడు. "ఐతే నీ కూతురూ, నీ సంబంధం నాకు అక్కర్లేదు" అని కాబోయే వియ్యంకుడు వెళ్ళిపోయాడు.
 
==పాటలు==