నారదుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , గాధ → గాథ (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Possibly Narada, the inventor of the Vina..jpg|thumb|వీణ సృష్టికర్త అయిన నారదుడు.]]
'''నారదుడు''' ([[సంస్కృతం]]: नारद, ''nārada'') లేదా '''నారద ముని''' [[హిందూమతము|హిందూ]] పురాణాలలో తరచు కానవచ్చే ఒక పాత్ర. [[బ్రహ్మ]] మానస పుత్రుడనీ, [[ముల్లోకాలు|త్రిలోక]] సంచారి అనీ, [[విష్ణువు|నారాయణ]] భక్తుడనీ, ముక్తుడనీ ఇతని గురించి వర్ణనలలో తరచు వస్తుంది. [[తెలుగు సాహిత్యం]]లోనూ, [[తెలుగు సినిమా]]లలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావించబడుతాయి. [[ఉపనిషత్తులు]], [[పురాణములు]], [[ఇతిహాసాలు|ఇతిహాసములలో]] నారదుని కథలు బహుళంగా వస్తాయి.
 
ఎన్నో పురాణాలలో నారదుని పాత్ర కనుపిస్తుంది. అందులో ముఖ్యమైనవి -
పంక్తి 17:
అతని తల్లి ఒకనాడు పాము కాటువల్ల మరణించింది. అప్పుడు నారదుడు అన్ని బంధములనుండి విముక్తుడై అడవికి పోయి భగవత్స్వరూపాన్ని ధ్యానించ సాగాడు. ఏకాగ్ర ధ్యాన సమయంలో అతని మనస్సులో భగవత్స్వరూపం గోచరించింది. కాని మరుక్షణమే అంతర్ధానమైంది. చింతాక్రాంతుడై నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్యవాణి ఇలా ఆదేశమిచ్చింది - ఈ జన్మలో నీవు నన్ను పొందలలేవు. కాని నా దర్శనం వల్ల నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరింది. ఈ శరీరం త్యజించిన పిమ్మట నా పార్షదుడవై నన్ను పొంద గలవు. - నారదుడు సంతుష్టుడై నిరంతరం హరి నామ జపం చేస్తూ కాలం గడిపి, అంతిమ సమయం ఆసన్నమైనపుడు తన దేహాన్ని త్యజించాడు.
 
అనంతరం ప్రళయ కాలం సమీపించగా ఒక సముద్రంలా ఉన్న ఆ జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మ శ్వాసలో ప్రవేశీంచి ఆయనలో లీనమయ్యాడు. వేయి యుగాల కాలం తరువాత బ్రహ్మ లేచి లోకాలను సృష్టించడం ఆరంభించినపుడు [[బ్రహ్మ]] ప్రాణములనుండి మరీచి మొదలైన మునులతోబాటు నారదుడు కూడా జన్మించాడు. కనుకనే నారదుని బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు. అలా నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు [[అనుగ్రహం]] వలన నిరాటంకంగా సంచరించగలుగుతుంటాడు. తాను స్మరించగానే నారాయణుని రూపం అతని మనసులో సాక్షాత్కరిస్తుంది.
 
ఇలా తన కథ చెప్పి హరికథా గానంతో నిండి వున్న భాగవతాన్ని రచించమని నారదుడు [[వ్యాసుడు|వేద వ్యాసునికివ్యాసు]]<nowiki/>నికి ఉపదేశించాడు.
 
== మహాభారతంలో వర్ణన ==
"https://te.wikipedia.org/wiki/నారదుడు" నుండి వెలికితీశారు