చెయ్యేరు నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==పేరు వృత్తాంతము==
ఈ నదికి చెయ్యేరు లేక బాహుద అనే పేర్లు రావడానికి వెనుకనున్న కథ ఇది: శంఖ-లిఖితులనే అన్నదమ్ములుద్దరు ఏటికి ఈ ఒడ్డున ఒకరు, ఆ ఒడ్డున ఒకరు కాపురముండేవారు.తమ్ముడు ప్రతిరోజూ అన్న వద్దకు వచ్చి [[వేదములు|వేదము]], [[శాస్త్రము|శాస్]]<nowiki/>త్రము నేర్చుకుని వెళ్ళేవాడు. ఏటి ఒడ్డునే ఒక మామిడి తోట ఉంది. ఒకనాడు లిఖితుడు ఆ దారి వెంట నడుస్తుండగా అతనికి ఆకలి వేసింది. తోట యజమాని కోసం చూస్తే అతను ఎక్కడా కనిపించలేదు. లిఖితుడు ఆకలికి తాళలేక రెండు పళ్ళు కోసుకుని తిన్నాడు. తర్వాత ఈ విషయం అన్నకు చెప్పాడు. చేసింది నేరమని, రాజు రవివర్మ వద్దకు వెళ్ళి శిక్షను కోరుకొమ్మనాడు అన్న శంఖుడు. [[పొత్తపి]] రాజు లిఖితుడి చేతులు ఖండించాడు. లిఖితుడు తెగిన చేతులతో అన్న దగ్గరకు వచ్చాడు. శంఖుడు దైవాన్ని ప్రార్థించి చేతులు ఏట్లో ముంచమన్నాడు. లిఖితుడు అలాగే చేయగా అతనికి చేతులు వచ్చాయి. చేతులను రప్పించిన ఆ నదికి 'చెయ్యేరు' అని పేరు వచ్చింది. సంస్కృతంలో[[సంస్కృతము|సంస్కృతం]]<nowiki/>లో 'బాహు' అంటే చెయ్యి. 'ద' అంటే ఇచ్చునది. అందుకే చేతిని ఇచ్చిన ఈ నది పేరు బాహుద అయింది. ఈ నదిని గురించి తొలితెలుగు యాత్రాచరిత్ర ఐన [[కాశీయాత్ర చరిత్ర]]లో ప్రస్తావనలున్నాయి. 1830లో ఈ ప్రాంతమీదుగా [[కాశీయాత్ర చరిత్ర|కాశీయాత్ర]] చేసిన గ్రంథకర్త [[ఏనుగుల వీరాస్వామయ్య]] ఈ నదిని గురించి, చుట్టుపక్కల ప్రాంతాల గురించి వ్రాసుకున్నారు. ఆయన తన గ్రంథంలో ''నది గడియ దూరము వెడల్పు ఉంద''ని వ్రాశారు. దాన్ని బట్టి ఆ నదిని దాటేందుకు గడియ సేపు పట్టేదని, అంత వెడల్పు అని అర్థంచేసుకోవచ్చు. నదికి ఇరుపక్కల గుళ్ళున్నాయని, పుణ్యక్షేత్రం నెలకొందని పేర్కొన్నారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
 
==ఉపనదులు==
"https://te.wikipedia.org/wiki/చెయ్యేరు_నది" నుండి వెలికితీశారు