నీటి మొక్కలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
==నీటి మొక్కల రకాలు==
 
*'''నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు''' : ఈ మొక్కలు మృత్తికతో సంబంధం లేకుండా, నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి. ఉదా: పిస్టియా, ఐకార్నియా, ఉల్ఫియా, సాల్వీనియా, లెమ్నా.
 
*'''లగ్నీకరణ చెంది, నీటిపై తేలే పత్రాలు గల మొక్కలు''' : ఈ రకం మొక్కలు వేరువ్యవస్థ సహాయంతో మృత్తికలో స్థాపితమై, పొడవైన పత్రవృంతాలు ఉండటం వల్ల పత్రదళాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. ఉదా: నిలంబో, నింఫియా, విక్టోరియా రీజియా.
 
*'''పూర్తిగా నీటిలో మునిగి, అవలంబితంగా ఉండే మొక్కలు''' : ఈ మొక్కలు నీటితో మాత్రమే సంబంధం కలిగి, పూర్తిగా నీటిలో మునిగి, మృత్తికలో నాటుకొని ఉండకుండా, అవలంబితంగా ఉంటాయి. ఉదా: సెరటోఫిల్లమ్, యుట్రిక్యులేరియా, హైడ్రిల్లా.
 
*'''పూర్తిగా నీటిలో మునిగి, లగ్నీకరణ చెందిన మొక్కలు''' : ఈ మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి ఉండి, వేరు వ్యవస్థ సహాయంతో నీటి అడుగున మృత్తికలో నాటుకొని ఉంటాయి. ఉదా: పొటమోజిటాన్, వాలిస్ నేరియా
 
*'''ఉభయచర మొక్కలు''' : ఈ రకం మొక్కలు పాక్షికంగా నీటిలోను, పాక్షికంగా వాయుగతంగాను పెరుగుతాయి. ఉదా: రాన్ కులస్, సాజిట్టేరియా, లిమ్నోఫిలా.
 
==నీటి మొక్కల అనుకూలనాలు==
"https://te.wikipedia.org/wiki/నీటి_మొక్కలు" నుండి వెలికితీశారు