మంచాళ జగన్నాధరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
'''మంచాళ జగన్నాధరావు''' ప్రముఖ వైణిక విద్వాంసులు. కర్ణాటక సంగీతం, హిందూస్తానీ సంగీతం రెండూ వీణపై వాయించేవారు.
==జీవిత విశేషాలు==
వైణికులుగా జగన్నాథ రావు సుప్రసిద్ధులు. ఆయన [[కర్ణాటక సంగీతము|కర్ణాటక]] మరియు [[హిందుస్థానీ సంగీతము|హిందూస్థానీ]] సంగీతంలో సుప్రసిద్ధులు. ఆయనకు 10శాతం దృష్టి ఉన్నప్పుదు ఒక సినిమాలో[[సినిమా]]<nowiki/>లో "మా మంచి పాపాయి" అనే పాటను స్వరపరచి పాడారు. ఆ తరువాత ఆయన పూర్తిగా అంధులైనారు. రేడియో కార్యక్రమాలలో ఆయన [[వీణ]] ద్వారా సంగీత సహకారాన్ని అందించేవారు.
 
ఈయన [[మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]]లో పనిచేసారు. ఆకాశవాణి పాట్నాలో కొంతకాలం పనిచేశారు. 1954లో [[హైదరాబాదు]]కు బదిలీ అయ్యారు. 1981 లో పదవీవిరమణ చేశారు. గీత శంకరం (సంస్కృతం), రాధావంశీధరవిలాస్ (హిందీ) సంగీత రూపకాలకు స్వరరచన చేశారు. అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు రచనలను నొటేషంతో ప్రచురించారు. ([[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల తిరుపతి దేవస్థానం]] సహాయంతో). కొన్ని వందల అన్నమయ్య కీర్తనలను స్వరపరిచారు. ఎంకి పాటలకు [[నండూరి సుబ్బారావు]]తో కలిసి బాణీ తయారుచేసి రేడియోలో[[రేడియో]]<nowiki/>లో పాడించారు. స్వీయరచనలైన లలితగీతాలను, పలు భావకవుల గీతాలను స్వరపరిచి నొటేషన్ తో 'ఆధునిక సంగీతం' పేరుతో రెండు సంపుటాలుగా ప్రచురించారు.
 
==ఉద్యోగ జీవితం==
వీరు, సోదరుడు [[వాడ్రేవు పురుషోత్తం]] ఆకాశవాణి హైదరాబాదులో[[హైదరాబాదు]]<nowiki/>లో కలసి పనిచేశారు. జగన్నాథ రావు హైదరాబాదు కేంద్రంలో వీణ అర్టిస్టుగా చేరి ఆ తర్వాత సంగీత విభాగం ప్రొడ్యుసర్ గా రెండున్నర దశాబ్దాలు పనిచేశారు. 1984 లో పదవీ విరమణ చేశారు. జగన్నాధ రావు హైదరాబాదులో పరమపదించారు. నేత్ర వ్యాధితో వారు బాధ పడినా చక్కటి వీణావాదన చేసి శ్రోతల్ని మంత్ర ముద్గుల్ని చేసేవారు. [[అలహాబాదు]], [[పాట్నా]] కేంద్రాలలో హిందుస్థానీ ప్రొడ్యూసర్ గా చేశారు. [[వయోలిన్]] విద్వాంసులు మారెళ్ళ కేశవరావు హైదరాబాదు కేంద్రం గొప్పగా చెప్పుకొనే వారిలో ఒకరు. ఆయన సహకారంతో [[తిరుమల తిరుపతి దేవస్థానం]] వారు 6 సంపుటాల త్యాగరాజ కీర్తనలు రూపొందించారు. ఆయన తి.తి.దే పబ్లికేషన్స్ లో చేరారు. ఆయన [[క్షేత్రయ్య]] పదాలు, [[రామదాసు]] కీర్తనలపై కృషిచేసారు.<ref>{{cite news|title=Remembering a Carnatic maestro|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/remembering-a-carnatic-maestro/article3217113.ece|agency=ద హిందూ|publisher=GUDIPOODI SRIHARI|date=2006-02-10}}</ref>
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/మంచాళ_జగన్నాధరావు" నుండి వెలికితీశారు