నందమూరి తారక రామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 54:
[[1951]]లో కె.వి.రెడ్డి [[పాతాళభైరవి]], దాని తరువాత అదే సంవత్సరం [[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్‌.రెడ్డి]] [[మల్లీశ్వరి]], [[1952]]లో ఎల్వీ ప్రసాదు [[పెళ్ళిచేసి చూడు]], ఆ తరువాత వచ్చిన [[కమలాకర కామేశ్వరరావు]] చిత్రం [[చంద్రహారం]] ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయావారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం మరియు 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. [[పాతాళభైరవి]] 34 కేంద్రాలలో 100 రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది. తన ఉంగరాల జుట్టుతో, స్ఫురద్రూపంతో, వెలుగులు విరజిమ్మే నవ్వుతో ఆంధ్రదేశ ప్రజలను ఆకట్టుకుని వారి మనసుల్లో నిలిచిపోయాడు.
 
[[1956]]లో విడుదలైన [[మాయాబజార్‌]]లో ఆయన తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావిస్తారు. [[1959]]లో [[ఏ.వి.యం.ప్రొడక్షన్స్]] వారు నిర్మించి, విడుదల చేసిన [[భూకైలాస్]] చిత్రంలో [[రావణబ్రహ్మ]] పాత్రకు <!--నటించేందుకు ఆయన రావణుడి గూర్చి అధ్యయనం చేసి,--> రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. <!--మరెవ్వరూ ఆ పాత్రకు రామారావుగారిలా న్యాయం చేయలేరు. -->[[1960]]లో విడుదలయిన [[శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం]] భారీ విజయం సాధించింది. <!--ఆ సినిమా చూసి వెంకటేశ్వర స్వామి భక్తులు ఎన్.టీ.ఆర్. దర్శనం కోసం ఆయన ఇంటి ముందు వరుసలు కట్టారు.--> [[శ్రీమద్విరాటపర్వము]]లో ఆయన ఐదు పాత్రలు పోషించాడు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. [[1963]]లో విడుదలైన [[లవకుశ]] అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు ఆయన పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. [[1972]]నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.
 
ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం [[1961]]లో విడుదలైన [[సీతారామ కళ్యాణం]]. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని "నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు" పతాకంపై విడుదల చేసాడు. [[1977]]లో విడుదలైన [[దాన వీర శూర కర్ణ]]లో ఆయన మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు. [[1978]]లో విడుదలైన [[శ్రీరామ పట్టాభిషేకం]] సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు [[అడవిరాముడు]], [[యమగోల]] గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. [[1991]] ఎన్నికల ప్రచారం కోసం ఆయన నటించి, దర్శకత్వం వహించిన [[బ్రహ్మర్షి విశ్వామిత్ర]] [[1990]]లో విడుదలైంది.
పంక్తి 66:
[[1981]]లో ఊటీలో [[సర్దార్‌ పాపారాయుడు]] చిత్రం షూటింగు విరామసమయంలో ఒక విలేఖరి, ''మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా?'' ఆని అడిగాడు. దానికి జవాబుగా ''నేను [[నిమ్మకూరు]] అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తాను'' అని చెప్పాడు. ఆయన చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం.
 
అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసాడు. 1982 [[మార్చి 21]] న [[హైదరాబాదు]] వచ్చినప్పుడు అభిమానులు ఆయనకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 [[మార్చి 29]] సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు. ఆసమయంలోనే తన పార్టీ పేరు ''[[తెలుగుదేశం పార్టీ|తెలుగుదేశం]]''గా నిర్ణయించి, ప్రకటించాడు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు. దానిపై నుండే ఆయన తన ప్రసంగాలు చేసేవాడు. దానిని ఆయన "[[చైతన్యరథం]]" అని అన్నాడు. ఆ రథంపై "తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!" అనే నినాదం రాయించాడు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తి.
 
==ప్రచార ప్రభంజనం ==