మహబూబ్​నగర్​ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
స్వాతంత్ర్యానికి పూర్వం [[1930]] దశాబ్దిలో జరిగిన ఆంధ్రమహాసభలలో ఈ జిల్లాకు చెందిన వ్యక్తులు అధ్యక్షత వహించారు. 1930లో [[మెదక్]] జిల్లాలో జరిగిన తొలి ఆంధ్రమహాసభకు [[సురవరం ప్రతాపరెడ్డి]] అధ్యక్షత వహించగా, [[1931]]లో [[నల్గొండ]] జిల్లా [[దేవరకొండ]]లో జరిగిన రెండో ఆంధ్రమహాసభకు [[బూర్గుల రామకృష్ణారావు]] అధ్యక్షత వహించాడు. వీరిరువురూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖులే. [[1936]]లో ఐదవ ఆంధ్రమహాసభ జిల్లాలోని [[ఫరూఖ్ నగర్|షాద్‌నగర్]] లోనే జరిగింది.
 
[[1956]]లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లానుంచి పలు ప్రాంతాలు విడదీసి, సరిహద్దు జిల్లాల నుంచి మరికొన్ని ప్రాంతాలు కలిపారు. జిల్లానుంచి [[పరిగి]] తాలుకాను విడదీసి హైదరాబాదు జిల్లా (ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా)కు కలిపినారు. పశ్చిమాన ఉన్న [[రాయచూరు]] జిల్లా నుంచి [[గద్వాల]], ఆలంపూర్ తాలుకాలను విడదీసి మహబూబ్ నగర్ జిల్లాకు జతచేశారు. [[కర్ణాటక]]లోని [[గుల్బర్గా]] జిల్లా నుంచి కోడంగల్‌ను ఇక్కడ విలీనం చేశారు.
 
[[1958]]లో కల్వకుర్తి తాలుకాలోని కొన్ని గ్రామాలు నల్గొండ జిల్లాకు బదిలీ చేయబడింది. [[1959]]లో [[రంగారెడ్డి జిల్లా]] లోని కొన్ని గ్రామాలు షాద్‌నగర్‌కు బదిలీ చేయబడ్డాయి. 1959 నాటికి జిల్లాలో 11 తాలుకాలు ఏర్పడ్డాయి. [[1986]]లో మండలాల వ్యవస్థ అమలులోకి రావడంతో 13 తాలుకాల స్థానంలో 64 మండలాలు ఏర్పడ్డాయి. జిల్లా భౌగోళికంగా పెద్దదిగా ఉన్నందున కోడంగల్ నియోజకవర్గంలోని మండలాలు రంగారెడ్డి జిల్లాలో కలపాలనే ప్రతిపాదన ఉంది. [[జూన్ 2]], [[2014]]న తెలంగాణ రాష్ట్రం అవతరించడంతో ఈ జిల్లాలో తెలంగాణలో అంతర్భాగంగా కొనసాగుతోంది.