"మహబూబ్ నగర్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

'''రైలు సౌకర్యం''' : [[దక్షిణ మధ్య రైల్వే]] పరిధిలోకి వచ్చే మహబూబ్ నగర్ జిల్లాలో 195 కిలోమీటర్ల నిడివి కల ప్రధాన రైలు మార్గం ఉంది. ఈ రైలు మార్గం [[సికింద్రాబాదు]] నుంచి [[కర్నూలు]] గుండా [[తిరుపతి]], [[బెంగుళూరు]] వెళ్ళు దారిలో ఉంది. ఉత్తరాన తిమ్మాపూర్ నుంచి దక్షిణ సరిహద్దున ఆలంపూర్ రైల్వేస్టేషను వరకు జిల్లాలో మొత్తం 30 రైల్వేస్టేషనులు ఉన్నాయి. అందులో మహబూబ్ నగర్, షాద్‌నగర్, గద్వాల, జడ్చర్ల ముఖ్యమైనవి. మహబూబ్ నగర్ పట్టణంలోనే 3 రైల్వేస్టేషనులు ఉన్నాయి. (మహబూబ్ నగర్ మెయిన్, మహబూబ్ నగర్ టౌన్ మరియు ఏనుగొండ). కర్ణాటకలోని [[వాడి]] మరియు రాయచూరు మార్గం కూడా ఈ జిల్లాగుండా కొన్ని కిలోమీటర్లు వెళ్తుంది. [[మాగనూరు]] మండలంలోని [[కృష్ణ (మాగనూరు మండలము)|కృష్ణా]] రైల్వేస్టేషను ఈ మార్గంలోనే ఉంది. [[గద్వాల]] నుంచి [[కర్ణాటక]] లోని [[రాయచూరు]]కు మరో రైలు మార్గపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మహబూబ్ నగర్ నుంచి మునీరాబాద్ రైల్వే లైన్ కూడా మంజురు అయిననూ పనులు ప్రారంభం కావల్సి ఉంది. జిల్లాలో రైల్వేలైన్ల సాంద్రత ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 0.57గా ఉంది.
 
'''రోడ్డు సౌకర్యం''' : దేశంలోనే అతి పొడవైన [[జాతీయ రహదారి]] అయిన 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారి మహబూబ్ నగర్ జిల్లా గుండా వెళ్తుంది. జిల్లాలో ఉన్న [[జాతీయ రహదారి]] కూడా ఇదొక్కటే. ఇది జిల్లాలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు సుమారు 200 కిలోమీటర్ల పొడవు ఉంది. హైదరాబాదు నుంచి కర్నూలు గుండా బెంగుళూరు వెళ్ళు వాహనాలు జాతీయ రహదారిపై ఈ జిల్లా మొత్తం దాటాల్సిందే. జాతీయ రహదారిపై జిల్లాలోని ముఖ్య ప్రాంతాలు - షాద్‌నగర్, [[జడ్చర్ల]], పెబ్బేర్, కొత్తకోట, ఎర్రవల్లి చౌరస్తా, ఆలంపూర్ చౌరస్తాలు. జిల్లా గుండా మూడు అంతర్రాష్ట్ర రహదారులు కూడా వెళుతున్నాయి. వాటిలో జడ్చర్ల-రాయిచూరు రహదారి ముఖ్యమైనది. ఈ రహదారి మహబూబ్ నగర్, మరికల్, మక్తల్, మాగనూరు గుండా రాయిచూర్ వెళ్తుంది. మరో అంతర్రాష్ట్ర రహదారి హైదరాబాదు-శ్రీశైలం రహదారి. దీనికి జాతీయ రహదారిగా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ రహదారి కడ్తాల్, ఆమనగల్లు, కల్వకుర్తిల గుండా జిల్లానుంచి వెళుతుంది. హైదరాబాదు-[[బీజాపూర్]] రహదారి కొడంగల్ గుండా వెళ్తుంది.
 
'''బస్ డిపోలు''' : మహబూబ్ నగర్ జిల్లాలో [[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]]కు చెందిన 8 బస్సు డిపోలు ఉన్నాయి - మహబూబ్ నగర్, గద్వాల, షాద్‌నగర్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్.
10,929

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2112521" నుండి వెలికితీశారు