నిర్మాల్యం (మలయాళ సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
వెలిచపాడ్ కూతురు అమ్మి గుళ్ళో చేయవలసిన మామూలు కార్యక్రమాలను ఆ అబ్బాయితో చెబుతూ సహాయకారిగా వుంటున్నది. వారి చెలిమి క్రమేణా ప్రేమగా మారింది. వెలిచపాడ్‌కు కొడుకు కూడా వున్నాడు. అతని పేరు అప్పు. అప్పు ఎంతసేపూ గ్రామంలో వున్న పనిలేనివాళ్ళతో కలిసి తిరుగుతూ వుంటాడు. దేవత మీద తండ్రికి వున్న నమ్మకంలో కాస్త కూడా అతనికి లేదు. తండ్రికి ముందు తాత ఆ ఉద్యోగంలో ఉండేవాడు; ఆ తాత ఇవాళ పక్షవాతంతో మంచం మీద వున్నాడు. దేవాలయానికి సంబంధించిన పవిత్రమైన కత్తిని, గంటనూ తస్కరించి అప్పు అమ్మబోయాడు. కాని, కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సంగతి తెలిసిన వెలిచపాడ్ క్రోధంతో ఊగిపోయాడు. అది చూచి అప్పు గ్రామం విడిచిపెట్టి పారిపోయాడు.
 
గ్రామంలో మశూచికం విస్తరించింది. అది అమ్మవారి ఆగ్రహమే అని గ్రామస్తులంతా నమ్మారు. 'చాలా కాలంగా ఆమెకు పూజలు లేవు, బలులులేవు, ఉత్సవాలు లేవు. అందుకనే దేవత ఆగ్రహించింది ' అని గ్రామస్తులు విశ్వసించారు. దేవతను శాంతింప జెయ్యడానికి పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపాలని వెలిచపాడ్ తీర్మానించుకున్నాడు. అతని కల నిజమై ఉత్సవాలు ఆరంభమయ్యాయి. కొత్త పూజారికి ధనవంతుల అమ్మాయితో నిశ్చయమైందని ఉద్యోగం విడిచిపెట్టి ఉత్సవం ఆరంభం కాబోతున్న రోజునే వెళ్ళిపోయాడు.
 
ఆలయంలో దీపాలు వెలిగాయి. ఉత్సవాలు మొదలైనాయి. పవిత్ర ఖడ్గం తీసుకుని వెలిచపాడ్ దేవత ముందు నాట్యం చేయాలి. ఖడ్గం కోసం ఇంటికి వెళ్ళాడు. వెలిచపాడ్‌కు తన గదిలోంచి మాటలు వినిపించాయి... తన భార్య, తను డబ్బు బాకీ వున్న ముస్లిం వర్తకుడితో సరసాలు... వెలిచపాడ్‌కు తల తిరిగి పోయింది.
 
ఆలయం ముందు భేరీలు మ్రోగాయి... వెలిచపాడ్ ఖడ్గంతో ప్రవేశించాడు... మహోధృతంగా నాట్యం మొదలెట్టాడు... ఎప్పటిలాగే, నాట్యం చేస్తూ రక్తం ప్రవహింపజేశాడు. కాని ఈ సారి అతని ప్రదర్శనలో కనిపించిన తీవ్రత ఇంతకు ముందు ఎన్నడూ కనిపించలేదు!
 
==పురస్కారాలు==