"ఎం.టి.వాసుదేవన్ నాయర్" కూర్పుల మధ్య తేడాలు

చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి (2), నెల్లూర్ → నెల్లూరు, ప్రతిష using AWB)
== సాహిత్య రంగం ==
1950దశకం తొలినాళ్ళ నుంచీ చిన్నకథలను వ్రాయడం ప్రారంభించిన వాసుదేవన్ నాయర్ 1958లోని నాలుకెట్టు (కేరళ సంప్రదాయ గృహం), 1962లో అసురవిత్తు (రాక్షస బీజం), 1964లో మంజు (మంచు), 1969లో కాలం, 1984లో రాండమూఝం (రెండవ సారి), విలపయత్ర, పతిరవుం పకల్వెలిచెవుం (అర్థరాత్రీ, పగటివెల్తురు), వారణాసి తదితర నవలలను రచించారు. ఇవేకాక నాటికలు, పరిశోధనాత్మక, సాహిత్యాంశాల వ్యాసాలు, యాత్రాచరిత్రలు, ఆత్మకథాత్మక రచనలు రాశారు. సర్పబిందు, నాలుకెట్టు నవలల్లో ఉమ్మడి కుటుంబాలు కలిగిన కేరళ సామాజిక వ్యవస్థలో ఆధునికత తీసుకువస్తున్న మార్పుల గురించి వాసుదేవన్ నాయర్ ప్రస్తావించారు. మంచు నవలలోని కథాంశం ఇద్దరు వ్యక్తుల అర్థరహితమైన నిరీక్షణ గురించి ఉంటుంది. నైనిటాలుకు యాత్రికునిగా వచ్చిన యువకునితో ప్రేమానుబంధం కలిగుండి అతను తిరిగి ఎప్పుడు వస్తాడోనని యువతి ఆకాంక్ష, కొండజాతి స్త్రీ, ఆంగ్లేయ యాత్రికులకు జన్మించి తన తండ్రిని కలవాలని ఆశించే కుర్రాడి నిరీక్షణలను ఇతివృత్తంగా రాశారు.
==సినిమాలు==
ఇతడు దర్శకత్వం వహించిన [[నిర్మాల్యం (మలయాళ సినిమా)|నిర్మాల్యం]] సినిమాకు [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా|ఉత్తమ చిత్రం]]గా [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ చలనచిత్ర పురస్కారం]] లభించింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2112877" నుండి వెలికితీశారు