సీతాదయాకర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
== రాజకీయరంగ ప్రస్థానం ==
సీతాదయాకర్ రెడ్డి 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించి 2001లో దేవరకద్ర జడ్పీటీసి సభ్యులుగా విజయం సాధించి, జిల్లా పరిషత్తు చైర్మెన్ గా ఎన్నికయింది. 2009లో కొత్తగా ఏర్పడిన [[దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి [[తెలుగుదేశం పార్టీ]] తరఫున సీతాదయాకర్ రెడ్డి పోటీ చేయగా, [[కాంగ్రెస్ పార్టీ]] తరఫున స్వర్ణ సుధాకర్, [[భారతీయ జనతా పార్టీ]] నుండి భరత్ భూషణ్, [[ప్రజారాజ్యం పార్టీ]] తరఫున కె.ఎస్.రవి కుమార్, [[లోక్‌సత్తా పార్టీ]] తరఫున కృష్ణకుమార్ రెడ్డి పోటీ చేశారు. ప్రధానపోటీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీతాదయాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి స్వర్ణసుధాకర్‌పై 19034 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సీతాదయాకర్_రెడ్డి" నుండి వెలికితీశారు