సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
'''సుబ్రహ్మణ్య చంద్రశేఖర్''' ([[తమిళం]]: சுப்பிரமணியன் சந்திரசேகர்) ([[అక్టోబర్ 19]], [[1910]]—[[ఆగస్టు 21]], [[1995]]) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. విలియం ఆల్ఫ్రెడ్ ఫోలర్ తో కలిసి నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను 1983 లో [[నోబెల్ బహుమతి]]ని అందుకున్నాడు. ఫోలర్ చంద్రశేఖర్ కు తొలి గురువు. ఇతని మేనమామ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ [[సి.వి.రామన్]]. చంద్రశేఖర్ ను భారతప్రభుత్వం [[పద్మ విభూషణ్]] బిరుదుతో సత్కరించింది.<ref>సాక్షి ఫన్‌డే డిసెంబరు 8, 2013 నోబెల్ ఇండియా.</ref>
==బాల్యం==
చంద్రశేఖర్ అవిభక్త [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని [[పంజాబ్]] రాష్ట్రంలో (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది), [[లాహోర్]] పట్టణంలో 1910, [[అక్టోబర్]] 19వో తేదీన పదిమంది సంతానంలో మూడో వాడిగా, నలుగురు కొడుకుల్లో పెద్దవాడిగా పుట్టిన చంద్రశేఖర్‌ చిన్నప్పటి నుంచే చురుకైన విద్యార్థి. ఆయన తల్లిదండ్రులు సుబ్రపహ్మణ్య అయ్యర్, సీతాలక్ష్మి. తండ్రి ఆగ్నేయ రైల్వే ఉద్యోగి. ఆయన ఉప-ఆడిటర్ జనరల్ గా [[లాహోర్]]లో పనిచేస్తున్నపుడు చంద్రశేఖర్ జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా పలుప్రాంతాలు తిరిగినా వాళ్ల కుటుంబం [[తమిళనాడు]]<nowiki/>కు చెందినదే. ఆయన చిన్నతనంలో తల్లి దగ్గర చదువుకున్నాడు. ఆయన చదువు కోసం కుటుంబం 1922లో [[చెన్నై]]కి మారింది.
 
==విద్యాభ్యాసం==