సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

{{విస్తరణ}} అయిపోయినట్లే
పంక్తి 31:
అభిజాత్యమో, కావేరి నీళ్ల మహిమో తెలీదు కానీ చంద్రశేఖర్ బాల్యంలోనే పరిమళించేడు. చంద్ర [[చెన్నై]]<nowiki/>లోని హిందూ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో [[భౌతిక శాస్త్రము|భౌతిక శాస్]]<nowiki/>త్రంలో బీయెస్సీ ఆనర్స్ పట్టా పొందాడు. అప్పటికే అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రం అంటే ఆసక్తి పుట్టింది. విశ్వాంతరాళంలో నక్షత్రాలు ఏర్పడే విధానం, తారలలో జరిగే పరిణామాలు, వాటి స్థిరత్వం తదితర అంశాలపై [[పరిశోధన]]<nowiki/>లు జరిపి శాస్త్రజ్ఞులలో గుర్తింపు పొందాడు.
 
పదిహేను సంవత్సరాల పిన్న వయస్సులోనే, ఇంకా విద్యార్థిగా ఉండగానే, తన మొట్టమొదటి పరిశోధనా పత్రం 1929 లోప్రచురించేడు. ఈ పత్రం యొక్క ప్రత్యేకత అవాగాహన అవాలంటే ఆనాటి విద్వత్ వాతావరణం అర్థం కావాలి. కాంప్టన్ ప్రభావం (Compton Effect) అనే దృగ్విషయం 1923 లో ఆవిష్కరించబడింది. అందుకని కాంప్టన్ కి 1927 లో నోబెల్ బహుమానం వచ్చింది. ఒక “కొత్త గణాంక పద్ధతి” అంటూ 1926 లో ఫెర్మీ, డిరాక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక పత్రం ప్రచురించేరు. ఈ కొత్త గణాంక పద్ధతిని (ఇప్పుడు దీనిని ఫెర్మీ- డిరాక్ గణాంకాలు అంటున్నారు) వెనువెంటనే ఉపయోగించి, ఆర్. ఎచ్. ఫౌలర్ అనే ఆసామీ ఒక నక్షత్రం కూలిపోయి, శ్వేత కుబ్జ తార (white dwarf) గా ఎలా మారుతుందో 1926 లో భాష్యం చెప్పేడు. ఈ కొత్త గణాంక పద్ధతి వాడి సోమర్ఫెల్డ్ అనే వ్యక్తి లోహాలలో ఎలక్^ట్రానుల ప్రవర్తన మీద ఒక వ్యాఖ్యానం రాసేడు. రాసి, మద్రాసు వచ్చి ఒక ఉపన్యాసం ఇచ్చేడు. ఆ ఉపన్యాసం విన్న పందొమ్మిదేళ్ళ చంద్రశేఖర్ ప్రభావితుడై, “కొత్త గణాంక పద్ధతి దృష్టితో కాంప్టన్ ప్రభావం” అనే పరిశోధనా పత్రం ప్రచురించేడు. ఈ పత్రం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఫౌలర్ కంట పడింది. ఫౌలర్ సిఫార్సుతో చంద్రశేఖర్ కి ట్రినిటి కాలేజిలో ప్రవేశం లభించింది. ఇటు BSc (Hons) పట్టా పుచ్చుకున్నాడో లేదో అటు పెద్ద చదువులకని 1930 లో - 19 ఏళ్ల ప్రాయంలో) ఇంగ్లండ్ ప్రయాణం అయి వెళ్ళిపోయేడు.
 
పడవలో ప్రయాణం చేసేవారి కాలక్షేపానికి ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. మద్యపానీయాలు, ఆటలు, అమ్మాయిలు - ఒకటేమిటి? తోటి భారతీయ విద్యార్థులు ఈ కాలక్షేపపు వసతులని వినియోగించుకోడానికి ఉబలాట పడుతూ ఉంటే చంద్రశేఖర్ కాగితం, కలం తీసుకుని, నక్షత్రం కూలిపోయి శ్వేత కుబ్జతారగా మారే సందర్భాన్ని వర్ణిస్తూ కొన్ని గణిత సమీకరణాలు రాసి, వాటిని పరిష్కరించి చూస్తున్నాడు. అలా చూస్తూ ఉండగా ఆ సమీకరణాలు గొంతెత్తి ఒక విషయాన్ని చెప్పేయి ఆయనకి. ఏమిటా విషయం? ఒక శ్వేత కుబ్జతార లోని పదార్థం (లేదా ఆ నక్షత్రపు గరిమ) ఒక అవధిని మించితే ఆ నక్షత్రం తన గురుత్వ ఆకర్షణ శక్తుల ప్రభావానికి కూలిపోయి (gravitational collapse), మరొక రకం నక్షత్రంగా మారిపోతుంది. ఏ రకం తారగా మారిపోతుంది? న్యూట్రాన్ తారగా కానీ, కర్రి బిలం (black hole) గా కాని. ఆ రోజులలో కర్రి బిలం (కృష్ణ బిలం) అనే భావన ఊహామాత్రంగా ఉండడం ఉంది కానీ సిద్దాంత పరంగా కానీ, ప్రయోగికంగా కానీ ఋజువు కాలేదు. కనుక గణిత సమీకరణాలు చెబుతున్న వర్తమానం ఆయనకే మింగుడు పడలేదు. గణితాన్ని గుడ్డిగా నమ్మడమా? లేక ….