పంచె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (19), ను → ను (7), తో → తో (2), సాంప్రదాయా → సంప్రదాయా ( using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Dhotis in Delhi.jpg|thumb|right|పంచె]]
'''పంచె''' భారతదేశంలో కొన్ని రాష్ట్రాలతో బాటు [[పాకిస్థాన్]], [[బంగ్లాదేశ్]], [[నేపాల్]]లో [[పురుషులు]] (కొన్ని ప్రాంతాల్లో [[స్త్రీ]]లు కూడా) ధరించే సాంప్రదాయక[[సాంప్రదాయ వాదం|సాంప్రదాయ]]<nowiki/>క వస్త్రము. కుట్టకుండా, దీర్ఘ చతురస్రాకారంలో సాధారణంగా 4.5 మీటర్లు (15 ఆడుగుల) పొడవు ఉండే ఈ వస్త్రాన్ని నడుము చుట్టూ చుట్టి ముడి వేయటం వలన ఒక పొడవు స్కర్టు వలె ఉంటుంది.
 
భారతదేశంలో [[తమిళనాడు]], [[కేరళ]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]], [[బీహార్]], [[మధ్యప్రదేశ్]], [[పశ్చిమ బెంగాల్]] మరియు [[ఒడిషా]] లలో పంచె విరివిగా ధరించబడుతుంది. ఉత్తర [[గుజరాత్]], దక్షిణ [[రాజస్థాన్]] లలో కేడియా అనే ఒక పొట్టి [[కుర్తా]]తో బాటు ధరిస్తారు. భారతదేశం సర్వత్రా ప్రత్యేకించి [[బీహార్]], [[పశ్చిమ బెంగాల్]] మరియు [[శ్రీలంక]] లలో పంచెను కుర్తాతో ధరిస్తారు. వీటిని ధోవతి-కుర్తా అని సంబోధిస్తారు. [[తమిళనాడు]]లో సట్టై ([[చొక్కా]]) తో బాటు, [[ఆంధ్ర ప్రదేశ్]]లో చొక్కా లేదా కుర్తా (జుబ్బా) తో ధరిస్తారు. [[పాకిస్థాన్]], [[పంజాబ్]] లలో కూడా ధోతీలు సాంప్రదాయిక దుస్తులుగా ధరించబడతాయి. [[లుంగీ]] అనే మరో వస్త్రం కూడా [[ఆసియా]] మరియు [[ఆఫ్రికా]] లలో విరివిగా ధరించబడుతుంది.
 
దీనిని కుర్తా, [[కండువా]], [[తలపాగా]]తో కలిపి ధరించడం తెలుగువారి[[తెలుగు]]<nowiki/>వారి స్వచ్ఛమైన వస్త్రధారణ.
 
==భారతదేశంలో వివిధ పేర్లు==
సంస్కృత పదం ధౌత నుండి ధోతి వ్యుత్పత్తి అయినది. దీనిని [[ఒడిశా]], [[హిందీ]] లలో ''ధోతి'' అని, [[గుజరాతీ]]లో ధోతియు అని, [[బెంగాలీ]]లో ధుతి అని [[అస్సామీ]]లో ''సురియా'' అని, [[పంజాబీ]]లో ''లాచా'' అని, [[మళయాళం]]లో ''ముండు'' అని, [[కొంకణ్]]లో ధోతార్, అంగోస్తర్, ఆడ్-నెశ్చె, లేదా పుడ్వె అని, [[మరాఠీ]]లో ''ధోతార్'' లేదా పంచె అని, [[కన్నడం]]లో కూడా ''పంచె'' అని పిలుస్తారు, [[పంజాబీ]]లో లాచా అని, [[ఉత్తర ప్రదేశ్]], [[బీహార్]], [[తేరై]] ల నగరాలలో మర్దానీ అనీ, తమిళంలో వేట్టి లేదా వేష్టి అనీ పిలుస్తారు.
 
ఇవి సుమారు 7 గజాలు పొడవు ఉండి, నడుం, కాళ్ల చుట్టూ తిప్పుకొని నడుం దగ్గర ముడి వేసుకొని ధరిస్తారు.
పంక్తి 18:
పంచె ఎలా కట్టాలన్న విషయంలో ఎటువంటి నియమనిబంధనలూ లేవు. ఇతరులను చూసి నేర్చుకోవటం, పెద్దల్ని అనుకరించటం లతో దీని కట్టు ఉంటుంది. దక్షిణ భారతదేశం సర్వత్రా పంచెని మోకాళ్ళ వరకు లేదా కొద్దిగా పైకి/క్రిందకు కడతారు. ప్రాంతాన్ని బట్టి, చేసే పనిని బట్టి, చుట్టు ప్రక్కల ఉన్న వారిని బట్టి కడతారు. (పెద్దలు, పరస్త్రీలు ఉన్నట్లయితే వారికి మర్యాద ఇచ్చే ఉద్దేశంతో ఇలా కట్టరు)
 
[[పెళ్ళికొడుకు పంచె కట్టు]]
గతంలో తెలుగు నాట [[పెళ్ళికొడుకు]] [[పెళ్ళి]] సందర్భంలో తప్పనిసరిగా పంచె కట్టాలనే నిబంధన వుండేది. కాని ప్రస్తుత మారిని కాలంలో ఈ [[నిబంధన]] తప్పనిసరిగా పాటించ కున్నా కొందరు [[పెళ్ళికొడుకు]]లు పంచె కడుతున్నారు.
[[అహింస]]ను నమ్మే జైనులు ప్రార్థనామందిరాలకు వెళ్ళే సమయంలో కుట్టని బట్టలు ధరించాలనే నియమం ఉండటం వలన పురుషులు పంచెలనే ధరిస్తారు. పంచె కన్నా చిన్నదైన ఇంకొక పై పంచెతో శరీర పైభాగాన్ని కప్పుకొంటారు.
 
పశ్చిమ [[హరే కృష్ణ]] అనుచరగణాలు కాషాయ/[[తెలుపు]] రంగు పంచెలను సాంప్రదాయబద్ధంగా మడిచి కడతారు. [[గాంధీ]] [[దక్షిణ ఆఫ్రికా]]లో దొరల వలె సూటు-బూటు ధరించిననూ స్వాతంత్ర్యపోరులో జనానికి తెలిసిన తన తర్వాతి జీవితంలో సింహభాగము పంచెనే కట్టారు. [[మహర్షి మహేశ్ యోగి]] తెల్లని సిల్కు ధోవతీ ధరించటంలో పెట్టింది పేరు.
 
సంపన్న వర్గాలకి చెందిన [[బెంగాలీ]] యువకులు అనగానే ఖరీదైన సుగంధ ద్రవ్యాలు, సాదా కుర్తా, ముందు వైపు కుచ్చిళ్ళతో ముడి వేసిన భారీ ధోవతి యొక్క ఒక మూలని చేత్తో పట్టుకొని రాజకీయాలు, సాహిత్యం గురించి మాట్లాడే వారే గుర్తుకు వస్తారు.అత్యంత సొగసైనవిగా భావింపబడే ఈ దుస్తులు వివాహాలకు, సాంస్కృతిక ఉత్సవాలకు ధరింపబడతాయి.
పంక్తి 37:
'''పంచెకట్టు:''' చీరకు వేసే కుచ్చిళ్ళ అంత ఒద్దికగా పెద్దగా కాకుండా, దాదాపు అదేవిధంగా, చిన్నగా నడుముకు ఒక వైపు మాత్రమే గానీ, ఇరువైపుల గానీ, రెండువైపులు బయటకు గానీ లోపలకుగానీ దోపుతారు. (ఒకటి బయటికి, ఇంకొకటి లోపలికి దోపరు.)
 
'''ధోవతి కట్టు:''' పై విధంగా కట్టిన పంచెకి క్రిందికి వ్రేలాడే అంచును కాళ్ళ మధ్య నుండి వెనుకకు తీసుకుపోయి, [[నడుము]] వద్ద లోపలికి (మాత్రమే) దోపుతారు. వెనుకకు దోపటం తప్పని సరి కాదు. నడిచే సమయంలో పెద్ద పెద్ద [[అడుగులు]] వేసేందుకు వీలుగా దీనిని చేత పట్టుకొనవచ్చును.
 
===దక్షిణ భారతంలో పంచె వినియోగం===
పంక్తి 44:
తమిళులు పంచకీ, [[లుంగీ]]లకీ జారిపోకుండా వెడల్పైన బెల్టు వాడతారు. కొందరైతే బెల్టు కనబడేలా షర్టుని పంచ లోకి టక్-ఇన్ చేస్తారు.
 
మలయాళీలు ఎక్కువగా ఎరుపు రంగు చొక్కా, తెలుపు రంగు పంచెలను ధరిస్తారు. కేరళలో జరిగే అత్యంత పెద్ద పండుగ అయిన [[ఓనం]]కి హిందువులే కాకుండా ముస్లింలు, క్రైస్తవులు చొక్కా-తెల్ల పంచెలు ధరిస్తారు. అయితే [[హిందువులు]] సవ్య దిశగా (clockwise: free end కుడి వైపుకు), [[ముస్లిం]], [[క్రైస్తవులు|క్రైస్తవు]]<nowiki/>లు అయితే అపసవ్య దిశగా (anti-clockwise: free end ఎడమ వైపుకు) కడతారు. [[కేరళ]] లోని ప్రతి గుడిలో[[గుడి]]<nowiki/>లో [[పురుషులు]] కేవలం పంచెలను మాత్రమే ధరించాలి. (శరీరం పై భాగం పై టవలు, పై పంచె, శాలువా వంటి ఎటువంటి ఆచ్ఛాదన ఉండకూడదు.)
 
మోకాలి వరకు (కాస్త పైకి గానీ, క్రిందకి గానీ) ఎగకట్టే పంచెని '''అడ్డ పంచె''' అంటారు. అయితే, గౌరవనీయులైన, వయసులో పెద్ద వారైన వారి ఎదురుపడినప్పుడు, గుడులలోకి ప్రవేశించే ముందు దీనిని మరల క్రిందకు దించేస్తారు. అడ్డ పంచె స్వేచ్ఛను అనుభవించటం కొరకు మాత్రమే. అది సాంప్రదాయికం కాదు.
"https://te.wikipedia.org/wiki/పంచె" నుండి వెలికితీశారు