ప్యాంటు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (19), కి → కి (4), గా → గా (3), తో → తో (5), కూడ → కూడా , సం using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Sports pants.jpg|thumb|right|పాంటు]]
మగవారు/ఆడవారు నడుము నుండి పాదాల వరకు తొడుక్కొనే వస్త్రము. ఇది లావుగా ఉండే గుడ్డతో తయారుచేస్తారు. ఇది [[సూటు]] లోని ఒక భాగమైననూ, సూటు యొక్క ఇతర భాగాలైన [[నెక్ టై]]/[[బౌ టై]], [[కోటు]] లేకున్ననూ, కేవలం [[షర్టు]]తో బాటు దీనిని వేసుకొనవచ్చును. చాలా వరకు [[భారతీయ దుస్తులు|భారతీయులు]] (మరియు ఇతర ఉష్ణ దేశస్థులు) కేవలం షర్టు '''ప్యాంటు''' లతోనే కనబడతారు. ప్యాంటులో[[ప్యాంటు]]<nowiki/>లో సగం మాత్రం అనగా [[తొడ]]ల వరకు ఉండే వస్త్రాన్ని [[నిక్కరు]] అంటారు. [[బెర్మూడా]] వంటి దేశంలో ప్యాంటుకి బదులుగా మోకాళ్ళ వరకు ఉండే సాంప్రదాయిక నిక్కరులని సూటుతో వేసుకొనగా, [[స్కాట్లండ్]], [[ఐర్లండ్]] వటి దేశాలలో ప్యాంటుకి బదులుగా [[స్కర్టు]]ని కూడా వాడతారు.
 
ఒక్కోమారు ప్యాంటుకి బదులుగా మోకాళ్ళ వరకు వదులుగా ఉండే [[నికర్ బాకర్స్]]నిబాకర్స్ని ధరిస్తారు.
 
సాంప్రదాయికాలని ట్రౌజరు (ఉదా: ప్లీటెడ్ ట్రౌజర్సు) అనీ అసాంప్రదాయికాలని ప్యాంటు (ఉదా: లో-వెయిస్టెడ్ ప్యాంటు) అనీ పూర్వం వ్యవహరించేవారు. కానీ కాలక్రమేణా ఇవి రెండూ ఒకటే అయినాయి. ప్యాంటు అన్న పదం అన్నింటికీ వర్తించిననూ ట్రౌజరు అంటే మాత్రం సాంప్రదాయికం అనే మిగిలి పోయింది.
పంక్తి 12:
[[File:Trouser-parts.svg|right|thumb|200px|మొదటి తరం ప్యాంటు, వివిధ భాగాలు]]
* '''<big>మొదటి తరం</big>''': '''ప్లీటెడ్ ట్రౌజర్సు''' భారతదేశంలో ధరింపబడిన మొదటి తరం ప్యాంట్లు. బాగా వదులుగా ఉంటూ శరీర కదలికకి ఎక్కడా ఆటంకం కలిగింగచకుండా, అదే విధంగా కంటికి ఇంపుగా ఉండే విధంగా వీటి రూపకల్పన ఉండేది. మోకాలి గుండా నిలువుగా రెండు కాళ్ళకి క్రీజ్ (మడత)లు ఉండేవి. వీటికి నడుముకి ఇరువైపులా రెండేసి నైఫ్ ప్లీట్లు ఉండేవి. ఇవి నడుము కంటే పైకి (హై రైజ్) ధరించబడేవి. పాదం వద్ద బయటికి కనిపించేలా మడత వేసి కుట్టేవారు. వీటిని టర్న్డ్ ఉప్ కఫ్స్ అంటారు. నీటిలో, బురదలో నడిచే సమయంలో ప్యాంటుకి బురద అంటకుండా ఉండటానికి పురుషులు ప్యాంటుని ఒకటి రెండు మడతలు వేసేవారు. అయితే ఈ మడత దర్జీనే వేసి కుట్లు వేయటంతో ఇదే ఫ్యాషన్ అయినది. ఇదే కాలంలో ప్లీటెడ్ ట్రౌజర్స్ కి అసాంప్రదాయిక ప్రత్యాన్మాయంగా నడుము కంటే క్రింద, (సాక్సులు కనబడే విధంగా) మడమల పైకి ధరించే (లో-రైజ్) ప్యాంట్సు వేసేవారు. వీటిని '''లో-వెయిస్టెడ్ ప్యాంట్లు''' అని అనేవారు. మడమల వద్ద వదులు తగ్గించి ఉన్ననూ టర్న్డ్ అప్ కఫ్ లని మాత్రం వీటికి కూడా కుట్టేవారు. భారతదేశంలో 60వ దశకం ద్వితీయార్థం వరకు ప్లీటెడ్ ట్రౌజర్లు కొనసాగాయి.
* '''<big>రెండవ తరం</big>''': కొంత కాలము తర్వాత '''న్యారో''' అని పిలువబడే బిగుతు ప్యాంట్లు వచ్చినవి. 60వ దశకానికి [[హాలీవుడ్]]లో [[సీన్ కానరీ]] మొదలు పెట్టిన [[జేమ్స్ బాండ్]] చిత్రాలలో న్యారో ప్యాంట్లని ధరించాడు. 1961 లో హిందీ చిత్రం [[జంగ్లీ]]లోజంగ్లీలో [[షమ్మీ కపూర్]] న్యారో ప్యాంట్లలో హద్దులు లేని అల్లరి చేశాడు. 1967 లో తెలుగునాట విడుదలైన [[గూఢచారి 116]]లో [[ఘట్టమనేని కృష్ణ]] న్యారో ప్యాంట్లలో కట్టిన గూఢచారి వేషంతో ప్లీటెడ్ ట్రౌజర్ లు కనుమరుగైనాయి. ఈ తరం నుండి కఫ్ వాడకం కనుమరుగైనది. న్యారో ప్యాంట్ల పై మొగ్గు చూపిన అప్పటి యువత ప్లీటెడ్ ట్రౌజర్లని డబ్బా ప్యాంట్లు అని సరదాగా వ్యవహరించేవారు. పాత ఫ్యాషన్ యే ఇష్టపడే వయసు మళ్ళిన వారు, సాంప్రదాయ వాదులు టైట్ ప్యాంట్లని గొట్టం ప్యాంట్లుగా అవహేళన చేసేవారు. వదులుకి అలవాటు పడిన వారు, బిగుతుని ఇష్టపడేవారు కారు.
* '''<big>మూడవ తరం</big>''': తర్వాత '''బెల్ బాటం''' లు వచ్చాయి. మోకాలి వరకు బిగుతుగా ఉండి, మోకాలి వద్ద నుండి పాదం వరకు గంట (bell) ఆకారంలో వదులుగా ఉండటంతో వీటికి ఆ పేరు వచ్చింది. కథానాయకుడు సహృదయుడుగా ఉండే [[రాజేష్ ఖన్నా]] కాలం ముగిసి, నిరుద్యోగం, స్మగ్లింగ్, అన్యాయ వ్యవస్థ పై యువతలో పెరిగిన అసంతృప్తి, ప్రభుత్వాలని ప్రశ్నించే [[తిరుగుబాటు]] ధోరణి గల [[అమితాబ్ బచ్చన్]] శకం ఆరంభమైనది. ఆజానుబాహుడైన అమితాబ్ కి బెల్ బాటం శైలి బాగా నప్పటంతో యువత ఈ శైలిని అనుకరించటం మొదలుపెట్టారు. 1972 లో విడుదలైన [[మేరే జీవన్ సాథీ]]లోసాథీలో ఖన్నా మొట్టమొదట బెల్-బాటం ఫ్యాషన్ లో కనబడగా, అదే సంవత్సరం సోలో హీరోగా [[జంజీర్]]తో భారీ విజయాన్నందుకున్న అమితాభ్ అందులో, పెద్దగా విజయవంతం కాని [[అభిమాన్]] లలో ఇంకా న్యారో ప్యాంట్ లనే ధరించాడు. వెంటనే 1973 లో ఇద్దరూ కలసి నటించిన [[నమక్ హరామ్]]లోహరామ్లో ఇరువురూ బెల్ బాటం లలోనే కనబడ్డారు. 1975 నాటికి [[యమగోల]] చిత్రంలో [[నందమూరి తారకరామారావు]] బెల్-బాటంలో కనబడ్డాడు.
* '''<big>నాల్గవ తరం</big>''': కొద్ది రోజులు ఏ ఫ్యాషన్ లేకుండా '''స్ట్రెయిట్ లెగ్''' ధరించారు. దీనిని ఫ్యాషన్ కి శూన్యావస్థ కాలంగా అభివర్ణించవచ్చును. ఉత్తరాదిన ఇది 80 వ శకంలో మొదలవగా తెలుగునాట 1982 లో విడుదలైన [[ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య]]లో [[చిరంజీవి]] బెల్-బాటం లే వేయగా, అదే సంవత్సరం విడుదులైన [[శుభలేఖ (సినిమా)]]లో స్ట్రెయిట్ లెగ్ ధరించాడు.
* '''<big>ఐదవ తరం</big>''': 90 వ దశకం వరకు కొనసాగిన స్ట్రెయిట్ లెగ్ లకి 1991 లో తెరపడినది. ఈ సంవత్సరం విడుదలైన [[గ్యాంగ్ లీడర్]]లో [[చిరంజీవి]] మోచేతుల వరకు వదులుగా ఉండే హాఫ్ షర్ట్ లు '''బ్యాగీ''' ప్యాంట్లు ధరించాడు. అరబ్బుల పైజామాలు పోలి ఉండే ఈ ప్యాంట్లు నడుము నుండి మోకాలు వరకు వదులు పెరుగుతూ, అక్కడ అత్యధిక వదులు ఉండి, మరల మోకాలి నుండి పాదం వరకు వదులు తగ్గుతూ, అక్కడ అత్యల్ప వదులు ఉండేవి. ఈ తరం తర్వాత యువత కథానాయకులని అనుకరించలేదు. వారే కథానాయకులకంటే ఒక అడుగు ముందు ఉండే శైలి ఇక్కడి నుండే ప్రారంభం అయినది.
* '''<big>ఆరవ తరం</big>''': 1994 నుండి యువత ప్యారలెల్ ప్యాంట్లని సాంప్రదాయికాలుగా ధరించింది. కొద్దిగా వదులు తక్కువగా ఉన్ననూ ఇవి మరల ప్లీటెడ్ ట్రౌజర్లని పోలి ఉండేవి. మరల కఫ్ ల ఉపయోగం వాడుకలోకి వచ్చింది. 1994 లో విడుదల అయిన [[ప్రేమికుడు]] చిత్రంలో [[ప్రభుదేవా]] ధరించిన బెలూన్ బ్యాగీలు కూడా అతి కొద్ది సమయం ఫ్యాషన్ గా ఉన్నాయి. వాస్తవానికి ఫ్యాషన్ ల పున:ప్రవేశం ఇక్కడి నుండే మొదలయినదని చెప్పాలి.
*'''<big>జీన్స్ విప్లవం</big>''': భారీగా ఉండటం, ఉతకటం, ఆరవేయటం, ఇస్త్రీ చేయటం కష్టంగా ఉండటం వలన జీన్స్ గురించి తెలిసిననూ వాటిని ధరించటం పై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. 1995 లో విడుదలైన [[దిల్ వాలే దుల్హనియా లేజాయెంగే]] సినిమాలో [[షారుఖ్ ఖాన్]] కేవలం మూడు సందర్భాలలో ఫార్మల్ ప్యాంట్లు ధరించాడు. మిగితావన్నీ జీన్స్ ప్యాంట్లే. ఇదే విధంగా 1996 లో [[నాగార్జున అక్కినేని]] నటించిన [[నిన్నే పెళ్ళాడుతా]] సినిమాలో ఒకటి రెండు సందర్భాలలో తప్పితే పూర్తి నిడివి జీన్స్ ధరించాడు. విజయ దుందుభి మోగించిన ఈ చిత్రాలు జీన్స్ తో యువతని మంత్రముగ్ధులని చేశాయి. [[లెవీ స్ట్రాస్ అండ్ కో.]], [[లీ]] మరియు [[వ్రాంగ్లర్]] ల చే బరువు తగ్గించిన, పలుచన చేసిన, మృదువుగా ఉన్న, కొద్దిగా సాగే గుణం కలిగిన సౌకర్యవంతమైన జీన్స్ లు రూపొందించబడటంతో జీన్స్ పుంజుకొన్నాయి. ఇస్త్రీ అవసరం లేకపోవటం, ఉతకకుండా ఎన్ని మార్లైనా వేసుకోగలిగే సౌలభ్యం ఉండటం, మాసిననూ, చిరిగిననూ అవి కూడా ఫ్యాషన్లుగా జమ కట్టటంతో జీన్స్ జనం లోకి మరింతగా చొచ్చుకుపోయింది. ప్రస్తుత కాలం జీన్స్ వేసిన వారిని చూడకుండా ఒక్క రోజు కూడా గడవదంటే [[అతిశయోక్తి]] కాదేమో!
*'''<big>ఫ్యాషన్ ల పున:ప్రవేశం</big>''': మరల బెల్-బాటం లను పోలిన ప్యాంట్లు '''బూట్ కట్''' పేరుతో వచ్చాయి. ఈ ఫ్యాషన్ అప్పటికి మిక్కిలి వాడుకలో ఉన్న జీన్స్ కి కూడా పాకినది. 2006 లో [[లీ]] మరల '''స్కిన్నీ జీన్స్''' లని ప్రవేశ పెట్టినది. ఇవి న్యారో ప్యాంట్లని పోలి ఉండేవి. 2007 లో విడుదలైన [[దేశముదురు]]లో [[అల్లు అర్జున్]] వీటిని ధరించటం గమనించవచ్చును. 2009 లో విడుదలైన [[ఆర్య 2]]లో [[అల్లు అర్జున్]] సాంప్రదాయిక దుస్తులని టైట్ ఫ్యాషన్ లో వేసిననూ, నాయకులని అనుసరించటం యువత అప్పటికే మానుకొని, వారి కంటే ఫ్యాషన్ లో ఒక అడుగు ముందే ఉండటంతో అవి జనాదరణకి నోచుకోలేదు.
*'''<big>ప్రస్తుత వాడకం</big>''':ప్రస్తుతం ఫ్లాట్ ఫ్రంట్ (ప్లీట్లు, మడత లేని) కాటన్ ట్రౌజర్లు కూడా సాంప్రదాయికంగా వాడుతునారు. వీటిని నిలువుగా కాకుండా అడ్డంగా ఇస్త్రీ చేస్తారు.
పంక్తి 38:
==ప్యాంటు భాగాలు==
===ట్రౌజరు భాగాలు===
* '''బెల్టు లూపులు''': [[నడుము]] చుట్టూ బెల్టుని పెట్టుకొనేందుకు వీలుగా కుట్టిన రింగుల వంటి రిబ్బన్లు[[రిబ్బన్ కేబుల్|రిబ్బన్]]<nowiki/>లు
*'''జేబులు''': నడుముకిరువైపులా ఉండే వాటిని సైడ్ పాకెట్స్ అంటారు. ప్రక్కలకి ఉండే కుట్ల పైన గానీ కొద్దిగా ఏటవాలుగా గానీ ఉంటాయి. (బహు అరుదుగా ట్రౌజర్లకి జీంస్ ప్యాంటు వలె ముందు వైపున జేబులు ఉంటాయి.) పిరుదుల పైన ఒక్కో పాకెట్ ఉంటాయి. వీటిని హిప్ పాకెట్స్ అంటారు. కొన్ని ప్యాంటులకి ఒక హిప్ పాకెట్ మాత్రమే ఉంటుంది. కార్గోలు అయితే మోకాళ్ళ వెలుపలి ప్రక్కలకి కూడా జేబులు ఉంటాయి. అందుకే వీటిని సిక్స్-పాకెట్ అంటారు
* '''ప్లీటులు''': జిప్పుకి ఇరువైపులా రెండేసి మడతలు ఉంటాయి. వీటినే ప్లీట్స్ అంటారు. ఒక వైపు ఉన్న ప్లీటులు (నడుముకి కత్తులు వేలాడదీసినట్లు) ఒకే దిశలో ఉంటాయి. అందుకే వీటిని నైఫ్ ప్లీట్స్ అంటారు. కొందరు ఒకే ప్లీటు ఇంకొందరు మూడేసి ప్లీట్లు వేయించుకొంటుంటారు. ఇవి వ్యక్తిగతం. కొన్ని ట్రౌజర్లకైతే అసలు ప్లీట్లే ఉండవు.
"https://te.wikipedia.org/wiki/ప్యాంటు" నుండి వెలికితీశారు