గౌతమ్ గంభీర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[1981]] [[అక్టోబర్ 14]] న [[ఢిల్లీ]] లోజన్మించిన గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ ఆటగాడు. [[2003]] నుంచి వన్డేలలో, [[2004]] నుంచి టెస్టులలో భారత జట్టు తరఫున ప్రాతినిద్యం వహిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్ లో రెండు డబుల్ సెంచరీలను సాధించి టెస్ట్ జట్టులో సెలెక్ట్ అయ్యాడు. స్వదేశంలో జర్గిన టూర్ గేమ్ లో డబుల్ సెంచరీ సాధించిన 4 వ భారతీయుడితను. ఇంతకు ముందు [[సునీల్ గవాస్కర్]], [[దిలీప్ వెంగ్‌సర్కార్]], [[సచిన్ టెండుల్కర్]] లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
 
[[2000]] లో గంభీర్ [[బెంగుళూరు]] లోని [[నేషనల్ క్రికెట్ అకాడమీ]] కి సెలెక్ట్ అయ్యాడు.<ref>{{cite news|first = Partab| last = Ramchand| title= First list of NCA trainees| url = http://feedsuk.cricinfo.com/link_to_database/ARCHIVE/CRICKET_NEWS/2000/APR/029816_CI_15APR2000.html| publisher = [[Cricinfo]]| date = [[2000-04-15]]}}</ref> .[[2003]] లో [[బంగ్లాదేశ్]] తో జర్గిన టి.వి.ఎస్. కప్ లో మొదటి సారిగా వన్డే పోటీలను ఆడినాడు. అతని మూడవ మ్యాచ్ లోనే 71 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు. [[2005]] లో [[శ్రీలంక]] పై 97 బంతుల్లో 103 పరుగులు చేసి తన తొలి సెంచరీని నమోదుచేశాడు. [[2004]] లో [[ఆస్ట్రేలియా]] తో జర్గిన నాల్గవ టెస్టులో గంభీర్ తన టెస్ట్ జీవితం ఆరంభించాడు. కాని ఆ టెస్టులో అతను ఏ మాత్రం ప్రతిభ కనబర్చలేకపోయాడు. 3 మరియు 1 పరుగు స్కోర్లకే ఔటైనాడు. అయిననూ అతని రెండో టెస్టులో [[దక్షిణాఫ్రికా]] పై 96 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో అతని తొలి శతకం [[2004]] [[డిసెంబర్]] లో [[బంగ్లాదేశ్]] పై సాధించాడు. ఆ తర్వాత [[పాకిస్తాన్]] తో సిరీస్ లో మంచి శుభారంభం ఇచ్చిననూ 6 ఇన్నింగ్సులలోనూ కల్పి ఒకే అర్థ శతకం సాధించాడు. ఆ తర్వాత అదే సం.లో [[జింబాబ్వే]] పై 97 పరుగులు సాధించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గౌతమ్_గంభీర్" నుండి వెలికితీశారు